రాశిఫలాలు - జూన్ 23, 2025


 

మేష రాశి

ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి సహకారం మీ ధైర్యాన్ని పెంచుతుంది. వ్యాపారంలో ఆర్థిక  ప్రయోజనాలు  పొందుతారు. ఉద్యోగులు  కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించగలుగుతారు. మీరు క్రొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన చేయవచ్చు.

వృషభ రాశి

 ఈరోజు కోపాన్ని నియంత్రించాలి. పాత రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఒత్తిడి ఉంటుంది. ఒంటరిగా ఉండటం మీకు అంత మంచిది కాదు. అనుకున్న పనులన్నీ ఆలస్యంగా పూర్తవుతాయి. రహదారిపై నడుస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ పని చేసినా, ఆలోచనాత్మకంగా చేయండి.

మిథున రాశి

ఈ రోజు మీ సామర్థ్యాలను ఉపయోగించండి. జీవిత భాగస్వామి  భావాలను గౌరవించండి. ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా ఉంచడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో నగదు సమస్య అధిగమిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. 

కర్కాటక రాశి

ఈ రోజు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది . రుణం తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీ గౌరవం పెరుగుతుంది. 

సింహ రాశి

ఈ రోజు అనవసర ప్రయాణాలు చేయవద్దు. మనసులో ప్రతికూల ఆలోచనలు వస్తాయి. కొత్త వ్యక్తులను ఈజీగా నమ్మేయవద్దు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు లాభపడతారు.  స్నేహితులతో మంచి సమయం గడుపుతారు.

కన్యా రాశి

ఈ రోజు ఇతరులతో వ్యక్తిగత సమస్యలను పంచుకోవద్దు. మీరున్న రంగంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది.  అనవసరమైన ఆందోళన కారణంగా మీ ఆరోగ్యం ప్రభావితమవుతుంది. పిల్లల వృత్తి గురించి కొంత ఆందోళన ఉంటుంది. ప్రేమ సంబంధాలలో దూరం పెరుగుతుంది

తులా రాశి

ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు ఈ రోజు చేతికందుతుంది. కోర్టు కేసులలో చిక్కుకున్నవారు ఈ రోజు గెలుస్తారు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తనతో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ప్రణాళిక ప్రకారం చేసే పనులు పూర్తవుతాయి..మంచి లాభాన్నిస్తాయి 

వశ్చిక రాశి

ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యల నుంచి ఈ రోజు పరిష్కారం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు బదిలీపై వెళ్లాల్సి వస్తుంది. శత్రువులు వారి అవసరాలకోసం మీతో స్నేహం చేస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆహారం తీసుకోండి.

ధనస్సు రాశి

తప్పుడు ఆలోచన నుంచి దూరంగా ఉండాలి. బంధువులను సులువుగా నమ్మేయవద్దు. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. స్నేహితుల ప్రవర్తన మిమ్మల్ని బాధపెడుతుంది.  

మకర రాశి

మీరున్న రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభఫలితాలున్నాయి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు
 
కుంభ రాశి

ఈ రోజు మీపై మీకున్న విశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో పెద్ద ఆర్డర్లు పొందుతారు. పిల్లలు అధ్యయనాలలో గొప్ప పనితీరును కలిగి ఉంటారు. మీరు ఉపాధిలో మార్పులు చేయవచ్చు. ప్రతికూల ఆలోచనలకు అవకాశం ఇవ్వొద్దు. 

మీన రాశి

ఈ రోజు ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. కోపం తగ్గించుకోవాలి. ప్రేమ భాగస్వామికి సమయం కేటాయిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం పెరుగుతుంది.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 
9542665536

#rasiphalalu #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025