ఉద్యోగమా -వ్యాపారమా
ఉద్యోగమా -వ్యాపారమా చాలామంది తల్లిదండ్రులు మా అబ్బాయికి వ్యాపారం కలిసి వస్తుందా లేదా ఉద్యోగం చేస్తే బాగుంటుందా అని అడుగుతూ ఉంటారు. చాలామందికి వ్యాపారం చేయాలని కోరిక ఉంటుంది కానీ వ్యాపారంలో అభివృద్ధి చెందుతామా లేదా అనే సందేహం వస్తుంది.ఒక జాతకుడికి వ్యాపారము కలిసి వస్తుందా లేదా ఉద్యోగం చేస్తే బాగుంటుందా అనే విషయం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. వ్యాపారం చేయడానికి ధైర్యం ఉండాలి. ఏ లగ్న జాతకులు అయినా సరే మూడవ స్థానం బలంగా ఉంటే వ్యాపారం చేయవచ్చు. మూడవ స్థానం ధైర్య వీర్య స్థానంగా చెప్పబడింది. మూడో స్థానం బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువ పనివాళ్ళు ఎక్కువ పెట్టుబడి తో వ్యాపారం చేయకూడదు. మూడో స్థానం బలహీనంగా ఉన్నవారు పెట్టుబడి లేకుండా తను ఒక్కరు మాత్రమే కష్టపడి పనిచేసే వ్యాపారం చేయవచ్చు. ఉదాహరణకి టైలరు, వడ్రంగి, మెకానిక్ వీరికి పెట్టుబడి పెద్దగా ఉండదు రిస్కు తక్కువ. మూడో స్థానం బలంగా ఉన్నవారు ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ పని వాళ్ళతో వ్యాపారం ప్రారంభం చేయవచ్చు. మూడవ స్థానంలో శని భగవానుడు కానీ రవి కానీ ఉన్నప్పుడు వీరు కచ్చితంగా వ్యాపారం చేయవచ్చు. మూడవ స్థానంలో ఉండే గ్రహ...