ధర్మసందేహాలు
ధర్మసందేహాలు
బొట్లు పెట్టుకోవడం, రుద్రాక్షలు, తులసిమాలలు వేసుకోవడం 'ప్రదర్శన' అనిపించుకోదా? భక్తి మనసులో ఉంటే చాలదా?
మనసులో ఉంటే తప్పకుండా బయటా ఉంటుంది. శరీరాన్ని శుద్ది చేసే విధానాల్లో ఇవి ఒకటి. వీటిని దైవచిహ్నాలు, దైవరక్షలు అంటారు. ఇవి ప్రదర్శన కోసం అనడం తగదు. అయితే కొందరు ఆడంబరం కోసం వేసి ఉండవచ్చు. కానీ అందరిదీ అదే పద్దతి అనడం తగదుకదా.
శాస్త్ర రీత్యా భూమధ్యం (కనుబొమ్మల నడుమ) జ్ఞానరూపుడైన దైవం యొక్క స్థానం. అక్కడ బిందు రూపుడిగా భగవంతుని ధ్యానించే యోగ విధానమూ ఉంది.
అలాగే రుద్రాక్ష, తులసి, స్పటికం- వీటి వైద్యమహిమలు కూడా ఇటీవల శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆధ్యాత్మికంగా కూడా ఈ చిహ్నాలధారణ కనబడుతుందనీ కనిపించని సూక్ష్మజగత్తులో కూడా రక్షణ ఇస్తుందని వేదపురాణాలు, మన శాస్త్రాలు వివరిస్తున్నాయి.
భక్తులైన వారికి దైవంపైనా, శాస్త్రం పైనా నమ్మకం ఉంటుంది. ఈ చిహ్నాల వల్ల దైవకృప, దైవచింతన నిరంతరం సన్నిహితమవుతుందని భక్తులు దీనిని ధరిస్తారు. అంతేకానీ ఆర్భాటం కోసం కాదు. బైట కనిపించేదంతా మనసులో ఉండకపోవచ్చు గానీ, మనసులో ఉన్నది మాత్రం బైట కనిపించి తీరుతుంది.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి