కన్యారాశిలోని గ్రహాలు-ఫలితం



 కన్యారాశిలోని గ్రహాలు-ఫలితం

జ్యోతిష్య శాస్త్రంలో ఒక రాశిలో  గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేవి చాలా సూక్ష్మంగా పరిశీలించాలి. ఉదాహరణకు ధనుస్ రాశిలోని గ్రహాలు కారణంగా జాతకుడు అదృష్టాన్ని అనుభవిస్తాడు అని అంటారు. ధనుస్సు రాశి కాలా పురుష చక్రానికి తొమ్మిదవ స్థానం అవుతుంది. కాలపురుష చక్రానికి ఆరవ స్థానమైన కన్యా రాశి లోని గ్రహాలు అత్యంత ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాయి ఎందుకంటే ఇది శత్రు ఋణ రోగ స్థానము. ధనుస్సు లో ఉన్న గ్రహాలు ఏ విధంగా శుభ ఫలితాలు ఇస్తాయో కన్యలో ఉన్న గ్రహాలు కూడా అశుభ ఫలితాలు ఇస్తాయి. అప్పులు, శత్రువులు, రోగాలు  కోర్టు కేసులు, గొడవలు ఇస్తాయి. బుధుడు ఈ స్థానంలో ఉన్నప్పుడు లగ్నానికి శుభగ్రహమైతే అప్పులు చేయడానికి ఇష్టపడతారు. లగ్నానికి వ్యతిరేక గ్రహం అయితే అప్పులలో మునిగిపోయి బయటకు రాలేరు. కన్యా రాశిలో రవి ఉన్నప్పుడు తండ్రివర్గంతో విభేదాలు, హార్ట్ ప్రాబ్లమ్స్, కళ్లకు సంబంధించిన సమస్యలు, అల్సర్, ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు ఉంటాయి. కన్యలో చంద్రుడు ఉన్నప్పుడు కిడ్నీ సమస్యలు తల్లి వర్గంతో ,అత్తగారితో సమస్యలు ప్రయాణంలో సమస్యలు ఉంటాయి. కుజుడు ఉన్నప్పుడు పూర్విక ఆస్తులు  స్వార్జిత ఆస్తులు కనుమరుగవుతాయి.  కన్య రాశి లోబుధుడు ఉన్నప్పుడు మేనమామలతో విరోధాలు, అప్పులు తీర్చలేకపోవడం, ఆన్లైన్లో మోసపోవడం స్టాక్ మార్కెట్లో మోసపోవడం జరుగుతాయి. నరాలకు సంబంధించి చర్మానికి సంబంధించి సమస్యలు ఉంటాయి. బుదుడికి ఈ స్థానం ఉచ్చ స్థితి మరియు స్వస్థానం అయినప్పటికీ ఈ సమస్యలు ఉంటాయి. గురుడు ఈ స్థానంలో ఉన్నప్పుడు సంతానం నుండి సమస్యలు ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఈ జాతకులు చిట్ ఫండ్ నడపకూడదు చిట్స్ వేయకూడదు. చిట్స్ వేస్తే మోసపోతారు. అప్పులు చేస్తే వాటికి వడ్డీలు అత్యధికంగా కడుతూ ఉంటారు.

శుక్రుడు ఈ స్థానంలో ఉన్నప్పుడు దిగువ స్థాయి స్త్రీలతో సమస్యలు, లైంగిక వ్యాధులు, లగ్జరీ ఖర్చుల వలన సమస్యలు ఉంటాయి ఇది స్త్రీ పురుషులకు ఇద్దరికీ వర్తిస్తుంది. శని భగవానుడు ఈ స్థానంలో ఉంటే తోటి ఉద్యోగుల సహకారం ఉండదు. క్రింది ఉద్యోగులతో సమస్యలు ఉంటాయి. ఏదైనా వ్యాధి ఉంటే అది తీవ్రస్థాయిలో పెరిగిపోతుంది. రాహువు ఈ స్థానంలో ఉన్నప్పుడు అత్యాశకు వెళ్లి ఇతరులతో మోసగింపబడతారు. రసాయనాలు ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల ప్రమాదాలు ఉంటాయి. కేతువు ఈ స్థానంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా మోసపోతారు.స్వామీజీల వలన ఆశ్రమాల ద్వారా లేదా వక్రబుద్ధి ఉన్న గురువు ద్వారా మోసపోతారు. కన్యా రాశిలో ఏదైనా గ్రహాలు ఉన్నప్పుడు ప్రతి జాతకుడు జరగబోయే విషయం తెలుస్తున్నది కావున ఆయా విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025