గర్భముతో ఉన్నవాళ్ళు రోజూ చదవ వలసిన మహా మంత్రము, స్తోత్రము..


గర్భముతో ఉన్నవాళ్ళు రోజూ చదవ వలసిన మహా మంత్రము, స్తోత్రము.

కష్ట సుఖాలు, కలిమి లేములు, సంతతి కలగడం, కలగక పోవడం, కలిగిన సంతతి అల్పాయువుగా వుండడం, చిరంజీవిగా వుండడం ఇదంతా కర్మ ఫలాలను బట్టి వుంటుంది. అంతా కర్మాధీనం అని వేదం చెబుతుంది.

షష్టీ దేవి ఉపాఖ్యానం చెబుతాను విను. ఈ దేవి కధ చాలా మహిమ గలది. ప్రకృతి దేవి యొక్క షష్టా౦శ (ఆరవ కళ) వల్ల అవతరించినది గనుక ఆమెకు షష్టీ దేవి అని పేరు వచ్చినది.

పేరు దేవ సేన. ఈమె కుమార స్వామికి ప్రియురాలు. శిశు రక్షకి. బాలారిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది. శిశువుల ప్రక్కనే వుండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల పాలిట ఈ దేవి దివ్య మాత. ఈమెకు సంబంధించిన కధ వ్రాసినా, వినినా, చదివినా సుఖ సంపదలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యముగా గర్భముతో వున్నవాళ్ళు తప్పక రోజూ చదవ వలసిన మహా మంత్రము, స్తోత్రము ఇది.

స్వాయంభువ మనువు కొడుకు ప్రియవ్రతుడు, సార్ధక నామధేయుడు, సంసార సంబంధము బంధకారణమని పెండ్లి మాని తపస్సు చేస్తూ వుండగా బ్రహ్మ వచ్చి, సంసారం సక్రమముగా చేసి పుత్రుని గని వానికి రాజ్యం అప్పగించి తపస్సు చేయడం రాజ ధర్మం, అని చెప్పగా, ప్రియ వ్రతుడు మాలతి అనే క్షత్రియ కన్యను పరిణయమాడి, దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వచ్చారు. ఎంతకాలమైనా సంతతి కలుగలేదు. కశ్యప మహాముని ప్రోత్సాహాముతో పుత్ర కామేష్టి చేసినారు. తత్ఫలితముగా రాజ పత్ని గర్భవతి అయినది. ఆ గర్భం చాలా దుర్భరముగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువును కన్నది. కన్నతల్లి కడుపు భాధ చెప్ప శక్యం కాదు. ఏడిచి ఏడిచి సొమ్మసిల్లి పడిపోయినది.

ప్రియవ్రతుడు లోలోపల క్రుంగి కొంతసేపటికి తేరుకొని, రాతి గుండెతో శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్లి అక్కడ క్రింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు. అంతలో అక్కడకు ఒక దివ్య విమానములో ఒక దేవత వచ్చినది. ఆ దేవతకు ప్రియవ్రతుడు అభివాదము చేసి “ అమ్మా ఎవరు మీరు? మీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు ఇక్కడకు దయచేసినారు? అని సవినయముగా అడిగాడు.

“రాజా! నేను ప్రకృతి షష్టా౦శ వల్ల బ్రహ్మ మానస సృష్టిగా అవతరించినాను. స్కందుని పత్నిని. నా పేరు దేవసేన. షష్టి దేవి అని నన్ను స్మరిస్తారు. .అని అన్నది. ప్రియవ్రతుడి ప్రార్ధనతో కనికరించి పిల్లవానిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతుడికి ఇస్తూ “వీని పేరు సువ్రతుడు, అప్రమేయమైన బల పరాక్రమాలతో ఈ భూమిని ఏకచ్చత్రంగా పాలిస్తాడు, నూరు యజ్ఞాలు చేస్తాడు. అని అన్నది. వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ, నీ ప్రజల చేత కూడా ఆరాధింప చేస్తూ వుండు. నీకు అంతా మంచి జరుగుతుంది అని దీవించి అంతర్దానమైనది.

ప్రియవ్రతుడు పరమానందముతో ఇంటికి వచ్చి షష్టీ దేవి యొక్క కధ చెప్పి, తన భార్య తో కలిసి వేదోక్త విధానముగా ఆ దేవిని ఆరాధించి, ప్రజల చేత కూడా షష్టీ దేవి యొక్క పూజలు చేయించినాడు.

పురుటింట ఆరవనాడు షష్టీ పూజ చేస్తే పురుటితల్లికి,పుట్టిన శిశువుకు క్షేమం. అలాగే పురిటి శుద్దినాడు కూడా చేయించడం చాలా మంచిది. అన్న ప్రాశన సమయములో కూడా చేయడం వలన పురిటి దోషాలు, బాలారిష్ట దోషములు తొలగి శిశువు పూర్ణాయుర్దాయము కలిగి ఉండును.

 ఆ ప్రియవ్రతుడు షష్టీ దేవిని ఈ విధముగా స్తుతించినాడు.

కొడుకును కోరి షష్టీ దేవిని పూజించి యీ స్తోత్రముతో శ్రద్దా భక్తులతో పఠిస్తూ వుంటే శుభలక్షణ లక్షితుడు, దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు. బాల బాలికలు భయపడి ఏడుస్తూవున్నప్పుడు, పురిటి ఇంట ఈ స్తోత్రం పఠిస్తే అన్ని భాధలు పోయి, పిల్లలు సుఖముగా,సురక్షితముగా వుంటారు. షష్టీ దేవి అనుగ్రహము వలన అన్ని రకములైన బాల గ్రహ పీడలు తొలగి పోతాయి. ఇది షష్టీ దేవి కధ.

షష్టీ దేవి స్తోత్రము 

నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ద్యై, శాంత్యై, నమో నమః

శుభాయై దేవసేనాయై, షష్ట్యై దేవ్యై నమో నమః

వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః

సుఖదాయై మోక్షదాయై, షష్ట్యై దేవ్యై నమో నమః

సృష్ట్యై షష్టా౦శరూపాయై, సిద్దాయై చ నమో నమః

మాయాయై సిద్ధయోగిన్యై, షష్టీ దేవ్యై నమో నమః

సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః

బాలాధిష్టాతృ దేవ్యై చ షష్టీ దేవ్యై నమో నమః


కళ్యాణ దేవ్యై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం

ప్రత్యక్షాయై సర్వభక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః


పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు

దేవ రక్షణకారిణ్యై షష్టీ దేవ్యై నమో నమః


శుద్ధసత్వ స్వరూపాయై వందితాయై నృణాం సదా

హింసాక్రోధ వర్జితాయై షష్టీ దేవ్యై నమో నమః


ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి!

మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి!

ధర్మం దేహి యశోదేహి షష్టీ దేవీ నమో నమః ! 

దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే !

కళ్యాణం చ జయం దేహి, విద్యా దేవి నమో నమః!


ఫలశృతి :

ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం 

యశశ్వినం చ రాజేంద్రం షష్టీదేవి ప్రసాదాత 


షష్టీ స్తోత్ర మిదం బ్రహ్మాన్ యః శృణోతి వత్సరం 

అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిర జీవనం 


వర్షమేకం చ యాభక్త్యాసంస్తుత్యేదం శృణోతి చ

సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే 


వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం

సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః 


కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ భవేత్ 

వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః 


రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్ 

మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః

 

జయదేవి జగన్మాతః జగదానందకారిణి 

ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టీ దేవతే 

 

శ్రీ షష్టీ దేవి స్తోత్రం సంపూర్ణం.

సంతానం లేని వారు, కొడుకును కోరి షష్టీ దేవిని పూజించి యీ స్తోత్రముతో శ్రద్దా భక్తులతో పఠిస్తూ వుంటే శుభలక్షణ లక్షితుడు, దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు.

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #shastidevisthotram #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025