మితిమీరిన అప్పులు


 

మితిమీరిన అప్పులు

సాధారణంగా అప్పు లేకుండా సమాజంలో ఎవరు ఉండరు అని చెప్పాలి. చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుండి కోట్లలో వ్యాపారం చేసే వారందరూ కూడా ప్రైవేటు వ్యక్తుల నుండి కానీ బ్యాంకుల నుండి గాని కచ్చితంగా అప్పు చేస్తారు. ఉద్యోగం చేసేవారు కూడా ఏదో ఒక సమయంలో కచ్చితంగా అప్పు చేయవలసి ఉంటుంది. అప్పుచేసి ఇల్లు కట్టడం, అప్పు చేసి కారు కొనడం, లగ్జరీ కోసం అప్పు చేయడం వలన కొందరు  సమస్యల వలయంలోనికి నెట్టబడతారు.ఎటువంటి జాతకులు అప్పులు చేస్తే అది తీర్చలేక సమస్యలలో మునిగిపోతారు అనేది జాతక రీత్యా విశ్లేషణ చేద్దాం. జాతకంలో ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలలో ఏవైనా గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహ స్థితిలో అప్పులు చేస్తే అవి తీర్చలేక అప్పులలో మునిగి పోతారు. బుధుడు దశలో జాతకునికి అప్పులు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ లగ్నానికి బుధుడు శివగ్రహం అయితే మీరు శుభకార్యాల కోసం అప్పులు చేస్తారు. లగ్నానికి బుధుడు పాపి అయితే అనవసరంగా అప్పులు చేస్తారు. బుధ దశలో అప్పులు చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఆ దశలో అప్పులను మరింత వేగవంతం చేస్తుంది. సహజ దన కారకుడు అయిన గురు భగవానుడు కర్కాటకంలో బుధుడు నక్షత్రంలో ఆశ్లేష నక్షత్రంలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఆ దశ వస్తే మీరు కచ్చితంగా అధికంగా అప్పుచేయబోతున్నారు అని అర్థం. వృశ్చిక రాశిలో జ్యేష్ఠా నక్షత్రంలో ఏవైనా గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహ దశలో జాతకుడు అధికమైన అప్పులు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా మీనరాశిలో రేవతి నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉన్నప్పుడు ఆ గ్రహ దశ వచ్చినప్పుడు జాతకుడు అప్పులు చేస్తారు. జాతకంలో బుధుడి నక్షత్రంలో ఏవేని నాలుగు గ్రహాలు ఉంటే జాతకుడు జీవితంలో చేసిన అప్పుల నుండి బయటపడలేరు. జాతకంలో రెండవ స్థానానికి అధిపతి మరియు సహజ ధన కారకుడైన గురు భగవానుడు బుధుడి నక్షత్రాలలో ఉండకపోవడం మంచిది అని చెప్పాలి. కర్కాటకం, వృశ్చికం, మీనం గురుడికి శుభ స్థానాలు అయినప్పటికీ ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాల్లో గురుడు ఉన్నప్పుడు జాతకులు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పెద్ద ఎత్తున అప్పులు చేసి వ్యాపారం ప్రారంభించి నష్టాలను ఎదుర్కోబోతున్నారు, లేదా లక్షల అప్పు చేసి ఫ్లాట్ కొంటున్నారు అది తీర్చలేక ఆ ఫ్లాటును కోల్పోతారు అనేది సూచన. కావున జాగ్రత్తగా ఉండడం అవసరం. మీ జాతకంలో బుధుడు ఒంటరిగా స్వంత రాశి ఉచ్ఛస్థితి మూల త్రికోణంలో ఉన్నప్పుడు బుధ దశలో మీరు పెద్ద అప్పును చేసి సమస్యను ఎదుర్కోబోతున్నారని తెలుసుకోండి. ఆదాయానికి తగినట్టుగా స్వల్పంగా అప్పు చేస్తే పరవాలేదు అది తీర్చగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో అప్పు తీర్చగలము అనుకుని అప్పు చేస్తే మాత్రము అది సమస్యగా మారుతుంది. మరొక విధానం ప్రకారం పైన చెప్పిన గ్రహ దశలలో పెద్దగా అప్పులు చేయడం అనేది ప్రమాదకరంగా ఉంటుంది అనేది వాస్తవం. తెలిసో తెలియకో అప్పులు చేసే సమస్యలతో ఉంటే మీ జాతకరీత్యా కొన్ని పరిహారాలు పాటించిన యెడల అప్పుల నుండి కొంతవరకు ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది.

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025