వివాహము-దశాబుక్తులు


 

వివాహము-దశాబుక్తులు

వివాహానికి దశాబుక్తులు ముఖ్యమా లేదా గోచారం ముఖ్యమా అనేది పరిశీలిద్దాం. సాధారణంగా కొన్ని సందర్భాలలో నిశ్చితార్థం అయిన తర్వాత కూడా వివాహం జరగకుండా ఫెయిలవుతున్నాయి. దీనికి జాతకంలో కొన్ని ప్రత్యేక గ్రహ వ్యవస్థలు కారణం అవుతాయి. కొందరు తల్లిదండ్రులు మంచి సంబంధం వచ్చింది అమ్మాయి లేదా అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించి గోచారంలో గురుగ్రహ సంచారాన్ని బట్టి వివాహం నిశ్చయించుకుంటారు. గోచారంలో 2,5,7,9, 11 స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు గురు బలం ఏర్పడుతుంది. ఈ సమయంలోనే వివాహ వయస్సు ఉన్నవారికి వివాహ సంబంధం మాటలు జరగడం, అవి ఫిక్స్ కావడం జరుగుతుంది. ఇదే సమయంలో  దశాబుక్తులు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. దశ భుక్తులు గోచారము దేనికి అవే ప్రత్యేకంగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. గోచారంలో గురుబలం ఉండి దశాబుక్తులు సహకరించకపోతే వివాహ సంబంధాలు మాటల వరకు వెళ్లి ఆగిపోవడం, కొన్ని సందర్భాలలో నిశ్చితార్థం జరిగి లేదా కళ్యాణ మండపం వరకు వెళ్లి కూడా వివాహాలు ఆగిపోతాయి. దశాబుక్తుల బలంగా ఉన్నప్పుడు గోచారం బలంగా లేనప్పటికీ వివాహం ఆగకుండా జరుగుతుంది. వివాహం కావాలంటే జాతకంలో 2మరియు 7వ స్థానాలకు వీటితోపాటు శుక్రుడు కి కూడా సంబంధం ఉండాలి. లేదా వృషభ, తుల లో ఉన్న గ్రహాలు దశ, అంతర్దశలు కూడా వివాహం జరిపిస్తాయి. గోచారంలో గురు భగవానుడు బలంగా ఉన్నప్పుడు వివాహ సంబంధం కుదురుతుంది కానీ దశాబుక్తులు సహకరించనప్పుడు ఇరువురి మధ్య టరమ్స్ అండ్ కండిషన్స్, లేదా ఇచ్చి పుచ్చుకోవడాలు, లేదా మాటలు విషయంలో భేదాభిప్రాయాలు వచ్చి వివాహం జరగకుండా ఆగిపోతుంది. కావున కేవలం గోచారం అనుసరించి ఎప్పుడూ వివాహ ప్రయత్నాలు చేయకూడదు. ఇది వివాహం కొరకు మాత్రమే కాదు ఇల్లు కట్టుకోవడం నూతన వ్యాపారాలు ప్రారంభించడం వంటి వాడికి కూడా వర్తిస్తాయి. ఒక సంబంధం కుదిరినప్పుడు నిశ్చితార్థ సమయంలో దశాభుక్తులు బలంగా ఉన్నప్పటికీ, వివాహ ముహూర్త సమయంలో కూడా దశాబుక్తులు బలంగా ఉండాలి. ముహూర్తం చూసేవారు ఇది కూడా గమనించాలి. వివాహ సమయంలో దశాబుక్తులు బలంగా లేకపోతే వివాహం మండపం వరకు వస్తుంది ఆగిపోతుంది. సాధారణంగా వివాహం రాహు కేతు దోషం వలన, శని భగవానుని దోష వలన, పునర్పు దోషం వలన కుజదోష వలన ఆలస్యం అవుతాయి. చాలామంది టీవీలో ప్రోగ్రామ్స్ చూస్తూ కొన్ని రాశుల వారికి బాగాలేదు అని చెప్పేసరికి భయపడుతూ ఉంటారు. కానీ గోచారంలో బాగా లేనప్పటికీ దశాభుక్తులు బలంగా ఉన్నప్పుడు వారికి ఎటువంటి సమస్యలు రావు. టీవీలో చెప్పే జాతక విషయాలు గోచారానికి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. గోచారం అనేది చెయ్యి అందించి అవసరమైన సమయంలో వదిలివేసే వ్యవస్థ వంటిది. దీనిపైన పూర్తిగా ఆధారపడి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వివాహం ఇల్లు కట్టుకోవడం నూతన వ్యాపారం ముఖ్యమైన కార్యక్రమాలలో కేవలం గోచారంపై ఆధారపడరాదు. దశాబుక్తులు కూడా కలిపి పరిశీలించాలి. దశాబుక్తులలో గ్రహాలకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు వాటికి పరిహారం చేసుకుంటే గోచారం సహకరించిన సహకరించకపోయినా జాతకులు జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు.

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025