వారాహి నవరాత్రులు (ఆషాడ గుప్త నవరాత్రి)


 

వారాహి నవరాత్రులు (ఆషాడ గుప్త నవరాత్రి)

26 /06 అదివారాహి గురువారం

 27/06  దండిని వారాహి , శుక్రవారం

28/06 బృహద్ వారాహి, శనివారం

29/ 06 ఉన్మత్త వారాహి , ఆదివారం

30/06 స్వప్న వారాహి, సోమవారం

1/07 ధూమ్ర వారాహి , మంగళవారం

2/07 వజ్ర వారాహి , బుధవారం

3/07 శ్వేత వారాహి , గురువారం

4/07 కిరాత వారాహి , శుక్రవారం

5/07  మహా వారాహి , శనివారం

వారాహిమాతను లలితమ్మ అంగ దేవతగా శ్రీవిద్య లో పూజ చేస్తే ఆమె పూజ రాత్రి సమయంలో మటుకే చేయాలి..వారహిని ప్రధాన దేవతగా పూజించే సమయంలో మూడు కాలాల్లో పూజ చేయవచ్చు.. ఉదయం సాయంత్రం కూడా వారాహి నవరాత్రి జరిపే రోజుల్లో పూజ చేయవచ్చు...

ఈ సంవత్సరం ఈ వారాహి నవరాత్రులు ప్రతి ఇంట్లో జరగాలని కోరుకుంటున్నాను, ఈ తల్లి ఎన్నో సమస్యలకు పరిహారం ఇస్తుంది, ముక్యంగా ఆస్తి తగాదాలు, అప్పులు, అనారోగ్య సమస్యలు, భూమి కొనడం, అమ్మడం, శత్రు బాధలు, గ్రహ బాధలు, ప్రయోగ బాధలు నుండి విముక్తి కలుగుతుంది. రానున్న రోజుల్లో మళ్ళీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ,ఏ కుటుంబం లో వ్యక్తి లు అయిన వారిని దూరం చేసికునే పరిస్థితి రాకూడదు. సమస్యలు వచ్చినా అవి దాటగల శక్తి అమ్మవారు అనుగ్రహించాలి ,ప్రతి కుటుంబానికి ఆమె రక్ష ఉండాలి. 

ఉదయం లలితా సహస్రనామ పారాయణ చేయండి సాయంత్రం 6 గ పైన వారాహి పూజ మొదలుపెట్టాలి.

అమ్మవారికి ఇప్ప నూనె అంటే చాలా ఇష్టం ఇప్ప నూనె తో దీపారాధన, ఇప్ప పువ్వులు దొరికితే పూజలో వాడండి, ఆ తల్లికి ప్రతి రోజు నివేదనలో యధాశక్తిన గుండ్రటి పండ్లు నైవేద్యం పెట్టాలి, లడ్డులు ( నువ్వులు బెల్లం నైయ్యి, ఇలాచి), పనస పండు చాలా విశేషం.. బెల్లం పానకం కచ్చితంగా పెట్టాలి.

కందగడ్డ తో వంట నైవేద్యం, కంద దీపం, దుంపలు చిలకడ దుంపలు ఉడికించి బెల్లం కలిపి పెట్టడం..దానిమ్మ పండ్లు, దానిమ్మ గింజలతో అర్చన.. పుట్టతేన నైవేద్యం.. 

అమ్మవారికి చేసే హోమంలో , తోక మిరియాలు, తెల్ల ఆవాలు, పనస తో చేస్తే అమ్మవారికి చాలా ప్రీతి.

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #guptanavaratrulu #varahidevi #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025