కలశం తొ పూజ ఎందుకు చేస్తారు? సృష్టికి ముందు ఏం జరిగింది?

 

కలశం తొ పూజ ఎందుకు చేస్తారు? సృష్టికి ముందు ఏం జరిగింది?

ఇంట్లో శుభకార్యం లేదా వ్రతం చేస్తున్నారంటే. తప్పకుండా కలశాన్ని ఏర్పాటు చేయాల్సిందే. రాగి, ఇత్తడి, వెండి లేక మట్టి పాత్రను తీసుకుని దాని నిండా నీరుపోసి దానికి పసుపు, కుంకుమ రాసి అందులో నాలుగు మామిడి ఆకులు ఒక కొబ్బరికాయ ఉంచి దాని చుట్టూ పసుపు దారం చుట్టి కలశాన్ని ఏర్పాటు చేస్తారు.

అయితే కలశాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే... సృష్టికి పూర్వం శ్రీ మహావిష్ణువు పాల సముద్రము మీద శయనించుచున్న తరుణంలో అతని నాభి నుంచి ఒక కలువ పువ్వు ఉద్భవించినది.

 దాని మీద కూర్చుని బ్రహ్మ ఉద్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. అంతా జలమయమై ఉన్న విశ్వంలో బ్రహ్మ సృష్టి ప్రారంభమైంది. సృష్టికి ముందు విశ్వమంతా జలమయంగానే వున్నదని పురాణాలు చెప్తున్నాయి.

విశ్వం జలమయం కావడం సమస్త జీవులను నీరే ఆధారమనే విషయాన్ని మానవాళి అర్థం చేసుకోవచ్చు. నీరు పూజ్యనీయమైంది. అందుకే ఏ పూజ చేసినా కలశం ఏర్పాటు చేసి... అందులో పవిత్ర జలంతో నింపుతారు.

 కలశానికి పూచే పసుపు కుంకుమలు, మామిడి ఆకులు సౌభాగ్యానికి సంకేతం. కలశములోని నీరు సమస్త విశ్వానికి ప్రతీక. ఇందులో దేవతలుంటారని వారిని ఆహ్వానించే దిశగానే కలశపూజ చేస్తారని విశ్వాసం. ఈ కలశాన్ని పూజించడం ద్వారా సకల దేవతామూర్తులను పూజించడంతో సమానం.

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025