గజేంద్రమోక్షం

 గజేంద్రమోక్షం...!!

మోక్షం ప్రసాదించే "గజేంద్రమోక్షం"ఒక్కసారి 

వింటే చాలు..!

ఎవరు అయితే ఈ "గజేంద్ర మోక్షం" కథని 

శ్రద్దగా వింటారో పాపాలు పరిహరించబడతాయి.

ఐశ్వర్యం కలసి వచ్చి దరిద్రం తొలగిపోతుంది.

గ్రహ దోషాల వలన కలిగే పీడలు తొలగిపోతాయి.

గజరాజు:..!!

ఒకప్పుడు ద్రవిడ దేశాన్ని పరిపాలించే రాజు ఉండేవాడు, అతడు అష్టాక్షరీ మంత్రోపదేశమును పొంది ఒక పర్వత శిఖరానికి చేరుకొని అక్కడ అష్టాక్షరీ మంత్రం ఉపాసన చేద్దామని భావించి అక్కడే మంత్రం జపం చేస్తుండగా, 

అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు.

అయితే మంత్ర జపం చేస్తు మహర్షి వచ్చినా 

లేవకపోవడంతో ఆగ్రహించిన అగస్త్య మహర్షి ఏనుగు యోని యందు జన్మించెదవు అని శపించాడు.

ఐతే మహాపురుషులు ఏనాడు అయితే 

మీఇంటికి వస్తారో ఆరోజే మీపూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి అని అనడంతో... 

ఆలా గజరాజుగా జన్మించి తన ప్రాణాలు పోయే సమయంలో గత జన్మలో చేసిన మంత్రానుష్టాన ప్రభావం వలన శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేసాడు.

మొసలి:..!!

ఒక గంధర్వుడు ఒక రోజు గంధర్వ కాంతలతో నీటిలో నిలబడి స్నానం చేస్తుండగా అక్కడికి 

బాగా చిక్కిపోయిన ఒక మహర్షి రాగ అతడిని అపహాస్యం చేస్తే గంధర్వ కాంతలు నవ్వుతారని భావించి నీటి లోపలి నుండి వచ్చి ఆ మహర్షి 

కాళ్ళని లాగడంతో మహర్షి నీటిలోకి పడిపోయాడు.

అప్పుడు ఆగ్రహించిన మహర్షి నీకు నీటి అడుగు నుండి వచ్చి కాళ్ళు లాగే అలవాటు ఉన్నది కనుక ఆలా చేసే మొసలివై జన్మించమని శపిస్తాడు. ఆవిధంగా సుదర్శన చక్రంతో తల నరకబడగా అతడికి శాప విమోచనం కలిగింది. 

పోతన శ్రీమద్భాగవతంలో గజేంద్రమోక్షం 

ఘట్టంలో దట్టమైన అడవిని వర్ణిస్తూ... 

అడవిలో గున్న ఏనుగులు బాగా బలం కలిగినవి.. అడవంతా నిర్భయంగా, స్వేచ్ఛగా సంచరిస్తాయి.

ఏనుగులు సరస్సులో తొండాల నిండుగా 

నీటిని తీసుకొని పైన చల్లుకొంటూ, 

చెంపల మీద చల్లుకొంటూ గడగడ ధ్వనులు చేస్తూ తమ పెద్ద కడుపులు నిండేలాగ నీళ్లు తాగాయి.

ఏనుగు మీద కోపంతో ఉన్న మొసలి ఏనుగును సరసులోకి లాగుతోంది. 

ఏనుగు మొసలిని ఒడ్డుకు లాగుతోంది. 

ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై

యెవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం

బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము దాన యైన వా

డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్

భావం:..!

ఈ ప్రపంచమంతా ఎవని కారణంగా పుట్టి, పెరిగి, లీనమవుతోందో! 

ఎవడు ఈ మొత్తం ప్రపంచానికి మూలకారణమైన ప్రభువు అయి ఉన్నాడో! 

ఎవడు ఆదిమధ్యాంతాలు మూడూ తానై ఉన్నాడో! ఎవడు తనకు తాను పుట్టినవాడో! 

ఈ ప్రపంచానికంతటికీ అటువంటిప్రభువైనవానిని శరణు కోరుతున్నాను.

కలడందురు దీనులయెడ

కలడందురు పరమయోగి గణములపాలం

కలడందురన్ని దిశలను

కలడు కలండనెడువాడు కలడో లేడో!

భావం:..!

భగవంతుడు దీనులలో ఉన్నాడంటారు. 

ఇంకా మహాయోగుల సమూహాలలో ఉన్నాడంటారు.

అన్ని దిక్కులలోనూ ఆయనే ఉన్నాడంటారు. ఉన్నాడు ఉన్నాడు అని రూఢిగా చెబుతున్న భగవంతుడు నిజంగా ఉన్నాడా? లేడా?

లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె బ్రాణంబులున్

ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమం బయ్యెడిన్

నీవే తప్ప నితః పరం బెఱుగ మన్నింపం దగున్ దీనునిన్

రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!

భావం:..!

శారీరకబలం, మనోబలం రెండూ క్షీణించాయి. ప్రాణాలు కడముట్టాయి. 

శరీరం అలసిపోయింది. 

నువ్వు తప్ప నాకు మరో దైవం తెలియదు. 

నన్ను దయతో ఆదరించు. 

ఈ దీనుడిని కాపాడు. 

నువ్వు వరాలిస్తావు. 

మంచిని కలిగించే మనసు కలవాడవు కదా స్వామీ!

మొసలి కాలు పట్టుకుని లాగుతుంటే ఏనుగు 

దాని నోటి నుంచి విడిపించుకోవడానికి 

ప్రయత్నం చేస్తుంది. 

చివరికి దానిలోని శక్తి సన్నగిల్లుతుంది. 

తనను రక్షించమని విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. 

భగవంతుడు అందరినీ రక్షిస్తాడని భక్తులు భావిస్తారు. 

సాక్షాత్తు విష్ణుమూర్తి శరణుకోరినవారిని రక్షిస్తాడని ఆయన ఆర్త జన రక్షకుడని పేరు. 

అటువంటి భగవంతుడు తనను రక్షించడానికి 

ఇంకా రాలేదనే బాధలో గజరాజు విష్ణుమూర్తిని అనుమానించాడు.

అలవైకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబు దాపల మందారవనాంతరామృతసరఃప్రాంతేందుకాంతోపలో

త్పలపర్యంక రమావినోదియగు నాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహిపాహియన గుయ్యాలించి సంరంభియై

భావం:..!

వైకుంఠపురంలో రాజభవన సముదాయం ఉంది. అందులో ఉన్న ప్రధాన భవనానికి దగ్గరలో 

కల్పవృక్ష వనం ఉంది. 

అందులో అమృతసరోవరం ఉంది.

దాని తీరంలో చంద్రకాంత శిలావేదిక ఉంది. 

దాని మీద కలువపూలు పరచిన శయ్య ఉంది. 

ఆ శయ్య మీద లక్ష్మీదేవితో ఆనందిస్తున్నాడు 

దీన జన శరణ్యుడయిన శ్రీమన్నారాయణుడు.

తన భక్తుడైన గజేంద్రుడు దుఃఖిస్తూ..సర్వేశ్వరా, పరాత్పరా! నన్ను రక్షించు...రక్షించు అని పిలవటంతో ఆ పిలుపు విని వెంటనే వేగంగా లేచి...

సిరికిం జెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింప డే

పరివారంబును జీరడభ్రగపతిం మన్నింపడాకర్ణికాం

తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో

పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై

భావం:..!!

తనను రక్షించమని కోరిన గజేంద్రుని ప్రాణాలను రక్షించటానికి ఎంతో సంతోషంతో హఠాత్తుగా బయలుదేరాడు శ్రీమన్నారాయణుడు.

ఎందుకు వెళుతున్నాడన్నమాట కనీసం 

లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు. 

రెండుచేతులలో శంఖచక్రాలు ధరించలేదు. తనపరివారంలోని వారెవరినీ సహాయంగా రమ్మనలేదు.

తన వాహనమైన గరుత్మంతుని అధిరోహించలేదు. చెవుల వరకు జారిన జుట్టును కూడా 

సరి చేసుకోలేదు. 

అంతకు ముందే జరిగిన చదరంగక్రీడలో తన చేతిలో లక్ష్మీదేవి ఓడిపోయింది. 

ఆ సమయంలో తన చేత చిక్కిన లక్ష్మీదేవి పైట చెంగును సైతం విడిచిపెట్టలేదు.

తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధవ్రాతమున్ వాని వెన్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుః కౌమోదకీ శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్

భావం:..!!

శరణు కోరిన వారిని తక్షణమే రక్షించేవాడు శ్రీమన్నారాయణుడు. 

ఆయన గజరాజు పిలుపు విని త్వరత్వరగా బయలుదేరాడు.

ఆయన వెంట లక్ష్మీదేవి బయలుదేరింది. 

ఆమె వెంట అంతఃపురంలోని స్త్రీలంతా బయలుదేరారు.

వారి వెంట గరుత్మంతుడు, 

ఆయన వెంటధనుస్సు, శంఖ చక్రాలు, గద మొదలయిన దివ్యాయుధాలు బయలుదేరాయి.

వాటివెంట నారదమహర్షి, 

ఆ వెనుకే విష్వక్సేనుడు బయలుదేరారు. 

మొత్తానికి వైకుంఠంలోని సమస్త దేవతలు 

కదలి వచ్చారు.

అడిగెదనని కడువడి జనునడిగిన దను మగుడ నుడవడని యుడుగన్

వడివడి జిడిముడి తడబడనడుగిడునడుగిడదు జడిమ నడుగిడునెడలన్

భావం:..!

తన భర్త అయిన విష్ణుమూర్తి హడావుడిగా 

ఎక్కడికి వెళుతున్నాడో అర్థం కాలేదు లక్ష్మీదేవికి. 

ఆ విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో 

త్వరత్వరగా ఆయన వెంట పరుగెత్తింది.

ఆ తొందరలో విషయం ఏమిటని అడిగినా 

ఆయన బదులు చెప్పడని ఠక్కున ఆగిపోతుంది. అంతలోనే కలవరపడుతూ ముందుకు అడుగు పెట్టింది.

మళ్లీ అంతలోనే ఏ విషయమూ సరిగా చెప్పడనే భావనతో కదలక మెదలక నిలబడి పోయింది.

మేరు పర్వతంలా ఉన్న మొసలి తలను విష్ణువు సుదర్శన చక్రంతో ఖండించాడు.

విష్ణుమూర్తి అనుగ్రహంతో మొసలి బారి నుంచి బయట పడింది గజరాజు.

ఈ గజేంద్రమోక్షం ఘట్టాన్ని భక్తిశ్రద్ధలతో చదివినవారికి ఈ లోకంలో సంపద, బంగారం, వస్తువులు, సకల వాహనాలు వంటి 

సమస్త సుఖాలు కలుగుతాయి.

ఆ తరవాత శ్రీమహావిష్ణువు మోక్షాన్ని తప్పక ప్రసాదిస్తాడు.

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #gajendramoksham #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025