బిచ్చ‌గాడు-- శివ పార్వ‌తులు

 

బిచ్చ‌గాడు-- శివ పార్వ‌తులు !🚩

శివ పార్వ‌తులు ఆది దంప‌తులు.
పార్వ‌తి ద‌యార్ర్ద హృద‌యం క‌లిగిందంటారు. ఒక రోజు శివ‌పార్వ‌తులు ఆకాశ‌యానం చేస్తూ ఉంటే పార్వ‌తి ఒక బిచ్చ‌గాణ్ణి చూపించి ‘అత‌డెంత ద‌య‌నీయంగా ఉన్నాడో చూడండి. అత‌నికేదైనా సాయం చెయ్యండి’ అంది.
శివుడు ఎన్నో మార్గాల్లో మ‌నుషుల బాధ‌ల‌కు కార‌ణాల్ని వివ‌రించ‌డానికి ప్ర‌య‌త్నించాడు.
కానీ పార్వ‌తి ఒప్పుకోలేదు.
‘అవ‌న్నీ ప‌క్క‌న పెట్టండి. మొద‌ట ఆ బిచ్చ‌గాడి ద‌రిద్రం పోవ‌డానికి మీరు ఏమైనా చేయండి’ అంది. క‌ర్మ సిద్ధాంతం ఆమెను ఆమోదింప‌జెయ్య‌లేక‌పోయింది.
చివ‌రికి త‌ప్ప‌నిస‌రై శివుడు పార్వ‌తి కోరిక తీరుస్తాన‌న్నాడు.
బిచ్చ‌గాడు ఒక దారంటే వెళుతున్నాడు. ఆ దారిలో ఎవ‌రూ లేరు. శివుడు ఒక బంగారు ఇటుక‌ను అత‌ను వ‌స్తున్న దారిలో ప‌డేశాడు.
బిచ్చ‌గాడి భుజానికి ఒక జోలి ఉంది. ఆ రోజంతా బిచ్చ‌మెత్తుకుని త‌న ఇంటికి వెళుతున్నాడు. త‌న ద‌రిద్రం గురించి ఆలోచించచుకుంటూ పోతున్నాడు.
అత‌నికి ఉన్న‌ట్టుండి ఒక ఆలోచ‌న వ‌చ్చింది.
ఎప్ప‌టి నుంచో అత‌ని చూపుమంద‌గించిన‌ట్లు అత‌నికి అనుమానం. త‌ను ముస‌లివాడు కాక‌ముందే చ‌నిపోతే మంచిదే. లేకుంటే చూపు పూర్తిగా పోయి గుడ్డివాడై అప్ప‌టి ప‌రిస్థితేమిటి? క‌ఆనీ గుడ్డివాడైనా బిచ్చుమెత్తుకోక త‌ప్ప‌దు. క‌ళ్లు పోయిన‌ప్పుడు త‌ను ఎట్లా న‌డుస్తానో త‌న‌ని తాను ప‌రీక్షించుకోవాల‌న్న ఆలోచ‌న వ‌చ్చింది.
వెంట‌నే క‌ళ్లు మూసుకుని చేతులు ఇటూ అటూ వెతుకున్నట్లు న‌టిస్తూ న‌డ‌వ‌డం మొద‌లుపెట్టాడు.
అట్లా న‌డుస్తూ త‌న ముందున్న బంగారు ఇటుక‌ను కూడా దాటి వెళ్లిపోయాడు. త‌ర్వాత కళ్లు తెరిచి మొత్తానికి క‌ళ్లు లేకుంటే న‌డ‌వ‌డం క‌ష్ట‌మే అనుకున్నాడు.
ఆకాశం నుంచీ శివ‌పార్వ‌తులు జ‌రుగుతున్న‌దంతా చూస్తూ ఉన్నారు. బిచ్చ‌గాడు బంగారు ఇటుక‌ను చూడ‌కుండా వెళ్లిపోయాక పార్వ‌తిని చూసి న‌వ్వి శివుడు ‘చూశావు క‌దా! ఇత‌నికే కాదు. ఎంత‌మందికో ఎన్నో అవ‌కాశాలు వ‌స్తూ ఉంటాయి. కానీ ఉప‌యోగించుకునే వాళ్లు కొంత‌మందే ఉంటారు’ అన్నాడు.
.సర్వేజనా సుఖినో భవంతు 
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

  1. జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
  2. HAVANIJAAA
  3. (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
  4. శ్రీ విధాత పీఠం
  5. Ph. no: 9542665536
#sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025