ఐశ్వర్య దీపం ఇలా ఇంట్లో పెడితే... సంపదకు లోటుండదు..

 ఐశ్వర్య దీపం ఇలా ఇంట్లో పెడితే... సంపదకు లోటుండదు..

అప్పులు, డబ్బు సమస్యలు వెంటాడుతున్నాయా? వాటి నుంచి బయట పడాలంటే ఇలా ఐశ్వర్య దీపం పెట్టి చూడండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. 

ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి?

Aishwarya deepam: ఎంత సంపాదించినా కూడా డబ్బు చేతిలో నిలవడం లేదని కొందరు బాధపడతారు. ఆదాయం ఎక్కువగానే ఉన్నా అప్పులు అధికంగా ఉంటాయి. వ్యాపారంలో నష్టాల వల్ల ఇబ్బందులు పడుతున్నార? బాగా సాగుతున్న వ్యాపారం ఒక్కసారిగా పడిపోవడం వంటివిఎదురువుతున్నాయా? ఎంత సంపాదిస్తున్నా అప్పుకి వడ్డీలు కడుతూనే ఉంటున్నారా? అయితే ఈ పరిహారం పాటించి చూడండి. మీ ఆర్థికపరమైన అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అదే ఐశ్వర్య దీపం.. లక్, ధనయోగం, విజయాలు సిద్ధిస్తాయి! మంచి రోజులు, ఇక పట్టిందల్లా బంగారమే

అన్ని కష్టాలు దూరం, సంపదతో సంతోషం..

అన్ని రంగాల్లో విజయం.. అదృష్టం, ధనంతో పాటు ఎన్నో!ఇంట్లో ఐశ్వర్యం నిలవాలంటే ఐశ్వర్య దీపం పెట్టి చూడండి. మీ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టేది. సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుందని బాధపడే వారికి ఇదొక చక్కని పరిహారం. ఈ నియమాలు పాటిస్తూ ఐశ్వర్య దీపం పెట్టారంటే ఐశ్వర్యం మీ ఇంట్లోనే ఉంటుంది. మీ కష్టాలు తొలగిపోతాయి.

ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలంటే..

ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం రెండు పెద్ద ప్రమిదలు తీసుకోవాలి. వాటికి పసుపు కుంకుమ రాయాలి. నేలపై బియ్యం పిండి, పసుపు,కుంకుమతో ముగ్గు వేసి దాని మీద ఈ రెండు ప్రమిదలు ఒకదాని మీద మరొకటి పెట్టాలి. అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పుపైన పసుపు, కుంకుమ చల్లాలి. ఒక చిన్న ప్రమిద తీసుకుని దానికి పసుపు, కుంకుమ రాసి పూలు పెట్టి ప్రమిదలో నూనె లేదా నెయ్యి పోయాలి.

రెండు ఒత్తులు తీసుకుని ఒకటిగా చేసి వెలిగించాలి. దీపం శ్లోకం చదవాలి. పళ్ళు, పాలు, పటిక బెల్లం, కొబ్బరి కాయ ఏదైనా నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వేంకటేశ్వర స్వామి స్తోత్రం చదవాలి. కనకధార స్త్రోత్రం కూడాచదివితేమంచిది.

శుక్రవారం దీపారాధన చేసిన తర్వాత శనివారం రోజు ప్రమిదల్లో పోసిన ఉప్పు తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పోయాలి. లేదంటే నీటిలో కలిపి మొక్కలకిపోసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు ఆ ఉప్పుని నదిలో కలుపుకోవచ్చు. ప్రమిదలు మాత్రం ప్రతివారం అవే వినియోగించుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు మీద దీపం వెలిగించి శనివారం రోజు ఉప్పు తీసేయాలి. ఇలా 11, 16, 21 లేదా 41 శుక్రవారాలు పాటించాలి.

ఈ ఉప్పు దీపం ఇంటికి ఈశాన్య మూల పెట్టడం వల్ల మంచి ఫలితం పొందుతారు. 41 శుక్రవారాలు ఉప్పుతో దీపం పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ తీసేసిన ఉప్పు సింక్ నీటితో కలిపి పారేయవచ్చు. ఈ పరిహారం పాటించడం వల్ల సమస్యలు తొలగిపోయి మంచి రోజులు మొదలవుతాయి.

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025