సమస్యలకు అసలు కారణం


 సమస్యలకు అసలు కారణం

ప్రతి మనిషికీ పుట్టింది మొదలు జీవనపర్యంతం ఏదో రూపంలో సమస్యలు ఎదురవుతుంటాయి. ఆశించినవన్నీ జరగవు. అన్ని వేళలా పరిస్థితులు మనిషికి అనుకూలంగా ఉండవు. జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు. ఈ సమస్యలు, కష్టాలు మనిషి జీవితంలో సర్వసాధారణం. అవి వచ్చినప్పుడు నిరాశతో కుంగిపోకుండా తన ప్రయత్నాలు తాను కొనసాగించాలి. శిశిరంలో ఆకులు రాలిన చెట్లు వసంతంలో చిగురించినట్లుగా మనిషి జీవితంలోనూ సంతోషకరమైన రోజులు తప్పక వస్తాయి. అందుకే సమస్యలు, కష్టాలు ఎదురైనా వెనకంజ వేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. 

ధర్మరాజు ఒక సందర్భంలో భీష్ముణ్ని 'ప్రతి మనిషి జీవితంలో సమస్యలు రాకుండా ఉండవు. అప్పుడు మనిషి ఎలా ప్రవర్తించాలి?' అని ప్రశ్నిస్తాడు. అప్పుడు భీష్ముడు 'కుమారా! సమస్యలు చుట్టుముట్టినా, కష్టాలు ముంచుకొచ్చినా ధైర్యం వీడకుండా ఉండటమే మనిషి ప్రథమ కర్తవ్యం... సమస్యలను స్థిరచిత్తంతో, మనోధైర్యంతో ఎదుర్కోవాలి. అప్పుడే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది' అని బదులిస్తాడు.

నిజానికి సమస్యలకు అసలు కారణం వాటి పట్ల సరైన అవగాహన లేకపోవడమే. ప్రతీ సమస్యను పరిష్కరించడానికి మూడు దారులుంటాయి. ఆమోదించడం, మార్చుకోవడం, వదిలేయడం. సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి. మార్చుకోలేకపోతే వదిలేయాలి.

బలహీన మనస్కులు చిన్న సమస్యలకు కూడా కలతచెంది చింతాసాగరంలో మునిగిపోతారు. దృఢసంకల్పం గల వ్యక్తులు మాత్రం ఎటువంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా సముచితంగా వ్యవహరిస్తారు. లక్ష్యసాధనలో ఎన్నో కఠిన సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకుని తమ ప్రయత్నాలు కొనసాగిస్తారు. చివరికి లక్ష్య శిఖరాలను అందుకుంటారు.

జీవితం ఒడుదొడుకులతో కూడిన గంభీర సాగరం. ఇందులో ఆటుపోట్లు ఉంటాయి. సంతోష, మాధుర్య స్పర్శలూ ఉంటాయి. అందుకే సమస్యలకు కుంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా పరిస్థితులను అర్థం చేసుకునే అవగాహన ప్రతీ మనిషికి అవసరం. అవగాహన ఉన్నప్పుడు సమస్యలతోను, కష్టాలతోను కూడా కలిసి నిశ్చలంగా ప్రయాణం చేయగలుగుతాం. అప్పుడు పరిష్కారం దిశగా ఆలోచిస్తే సమస్యలు దూదిపింజల్లా తేలిపోతాయి.

ఎగిరే పక్షులు ఎదురుగాలి వీస్తుందని వెనక్కి తిరిగి పోవు. తెగించి ముందుకు దూసుకుపోతాయి. ఉప్పొంగుతూ ఉరికే నదులు కొండలు అడ్డిస్తున్నాయని బెదిరిపోవు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని చీల్చుకుని ముందుకు సాగుతాయి. కొమ్మలను నరికేస్తున్నా లోతుగా పాతుకుని ఉన్న వృక్ష మూలాలు తమ ఉనికిని కోల్పోవు. సరికొత్త చిగుళ్లతో నిత్యనూతనంగా ఉంటాయి. ఇలా నిత్యం మౌన సందేశాలు అందిస్తున్న ప్రకృతిని గమనిస్తే మనిషికి ఏదీ సమస్యగా అనిపించదు.

శీతోష్ణాలు ప్రకృతిలో ఎలా వస్తూపోతూ ఉంటాయో అలాగే మనిషి జీవితంలోనూ సుఖదుఃఖాలు వస్తూ పోతుంటాయని చెబుతాడు శ్రీకృష్ణుడు. అందుకే మనం పరిస్థితుల్ని అంగీకరించాలి. సాహసంతో సమస్యలను ఎదుర్కోవాలి. అవగాహనతో వ్యవహరించి ముందడుగు వేయాలి.... సమస్యలు బాగా వేధిస్తుంటే, వాల్మీకి రామాయణం లో "సుందరకాండ" పారాయణం చేయండి.. రోజూ కనీసం 2,3 సర్గలు.. 10,15 నిమిషాలు పడుతుంది.. ఇది సకల సమస్యలకు ఏకైక పరిష్కారం! జై శ్రీరామ్.

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025