మద్యపానం అలవాటు-జ్యోతిష్య విశ్లేషణ
మద్యపానం అలవాటు-జ్యోతిష్య విశ్లేషణ
నేటి కాలంలో ఇంటిని శరీరాన్ని పాడుచేసే మద్యపాన అలవాటుకు జ్యోతిష్య శాస్త్రంలో ఏ గ్రహాలు కారణం అవుతాయి తెలుసుకుందాం. మానవ శరీరంలో నీటిని నియంత్రించేది మరియు మనసును నియంత్రించేది చంద్ర భగవానుడు. ఒక జాతకంలో చంద్రుడు నక్షత్రాలు అయిన రోహిణి హస్త శ్రవణం నక్షత్రాలలో ఏవైనా గ్రహాలు ఉండి ఆ గ్రహాల యొక్క దశ నడుస్తూ ఉంటే జాతకుడు ఖచ్చితంగా మద్యపానానికి బానిస అవుతారు. ఒక జాతకంలో చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నా లేదా నీచ స్థితిలో ఉన్నప్పటికీ ఆ జాతకుడు మద్యపానానికి బానిస కాకుండా ఉండడం చాలా కష్టతరమైనది. కొన్ని సందర్భాలలో చంద్రుడు.. శని భగవానుడు రాహువు కేతువులతో సంబంధం ఏర్పడినప్పుడు కూడా మద్యపానానికి అలవాటు పడతారు. చంద్రుడు కుజుడుతో దగ్గర డిగ్రీలలో ఉండి చంద్రమంగళ యోగం ఉన్నప్పటికీ జాతకుడు మద్యానికి బానిస అవుతాడు. చంద్రుడు స్థానంలో ఒక గ్రహం ఉండి ఆ దశ జరుగుతున్నప్పుడు కూడా జాతకుడు మద్యానికి అలవాటు పడతారు.చంద్రుడితో కలిసి ఉండి గ్రహాలు ఒకవైపు జాతకునికి మంచి చేస్తున్నప్పటికీ అవే గ్రహాలు జాతకుడు మనసు నాక్రమించి జాతకుడుని నాశనం చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి అనేది మర్చిపోకూడదు. ప్రతి కుమార్తె తల్లిదండ్రులు అబ్బాయి జాతకాని పరిశీలించి వ్యసనాలు లేని అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడం చాలా ముఖ్యం. ఈ మద్యం అలవాటు ఆరోగ్య నష్టాన్ని ఆర్థిక నష్టాన్ని కుటుంబ నష్టాన్ని ఇవ్వడమే కాకుండా కొన్ని సందర్భాల్లో నేర ప్రవృత్తిని కూడా ఇస్తుంది. వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో ఏదైనా ఒక గ్రహం ఉండి ఆ గ్రహం యొక్క దశ జరుగుతుంటే జాతకుడు కచ్చితంగా మద్యపానానికి బానిస అవుతాడు ఎందుకంటే వృషభరాశి కాలపురుష చక్రానికి రెండవది రెండవ స్థానం ముఖమును సూచిస్తుంది. కావున కచ్చితంగా జాతకుడు మధ్యానికి బానిస అవుతారు. శుక్రుడు జల గ్రహం ఈ శుక్రుడు చంద్రుడుతో నక్షత్ర సంబంధం ఏర్పడితే కచ్చితంగా జాతకులు మద్యం సేవిస్తారు. ఇటువంటి గ్రహస్థితి ఉన్నవారు కూల్ డ్రింకులు అధికంగా సేవించడం, కృత్రిమ పానీయాలు, టీ కాఫీలకు అధికంగా బానిస అవడం కూడా జరుగుతుంది. అధికంగా సేవించడం కూడా దుర అలవాటుగా భావించాలి. మంచి అలవాట్లు జీవితంలో ఉన్నత స్థితికి తీసుకువెళతాయి. చెడు అలవాట్లు జాతకుడి జీవితాన్ని తలక్రిందులు చేస్తాయి. చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ తెలుసో తెలియకో త్రాగుడికి బానిస అయిన వారు ఏ గ్రహం వలన దోషం ఏర్పడిందో పరిశీలించి దానికి సంబంధించిన చిన్నపాటి పరిహారాలు పాటిస్తే సుమారుగా 7 రోజుల్లోనే ఆ వ్యసనం నుండి బయటపడే అవకాశం ఉంది.
జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి