కోటిజన్మలలో సంపాదించిన పుణ్యం
కోటిజన్మలలో సంపాదించిన పుణ్యం ఉంటేనే కాని శివునిపట్ల భక్తి కలగదని ఘోషిస్తున్నది శివగీత.
'కోటి జన్మార్జితై: పుణ్యే: శివే భక్తిర్విజాయతే'.
'శివ' అనే రెండక్షరాలే మన పాపాలను పటాపంచలు చేసి, మోక్షాన్ని ప్రసాదిస్తాయి.
సూత్రంలో మణులు ఉండేటట్లుగా ఈ సమస్త ప్రపంచంలో ఆ దేవాదిదేవుని అష్టమూర్తులు వ్యాపించి ఉన్నాయి.
శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, మహాదేవుడు, ఈశానుడు అనేవి ఆయన అష్టమూర్తుల పేర్లు.
ఈ శర్వాది అష్టమూర్తులే పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, క్షేత్రజ్ఞ, సూర్యచంద్రులను అధిష్టించి ఉన్నాయి.
ఈ అష్టమూర్తులను ఆధారం చేసుకొని విశ్వమంతా వ్యాపించిన భగవంతుని సర్వతో భావంతో ఆరాధించాలని శివపురాణం తెలియజేస్తున్నది.
“ఓం శర్వాయ క్షితిమూర్తయే నమ:
ఓం భవాయ జలమూర్తయే నమః
ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమ:
ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమః
ఓం భీమాయ ఆకాశమూర్తయే నమః
ఓం పశుపతయే యజమానమూర్తయే నమః
ఓం మహాదేవాయ సూర్యమూర్తయే నమః
ఓం ఈశానదేవాయ చంద్రమూర్తయే నమః
జీవుని దేహమే దేవాలయం.
మాయావిముక్తుడైన జీవుడే సదాశివుడు. అజ్ఞానమనే నిర్మాల్యాన్ని విడిచి పెట్టి "సో హం" భావంతో సదాశివుని , పూజించాలి.
దేహో దేవాలయః ప్రోక్తో జీహాదేవ సనాతనః
త్యజే దజ్ఞాన నిర్మాల్యం సోహం భావయే పూజయేత్
'రుద్రో జనానాం హృదయే సన్నివిష్టః ప్రాణేష్యంతర్మనసో లింగమాహుః'
హృదయంలో ఉన్నవాడు రుద్రాలింగశాబ్దవాచ్యుడైన శివుడిని శ్రుతులు చెబుతున్నాయి.
అందుకే మన హృదయంలో ఆ ఆత్మలింగాన్ని స్థాపించుకొని నిర్మలమైన మనస్సు నుండి వెలువడే శ్రద్దా నదీజలంతో మహాదేవుని అభిషేకించి,
సమాథి పుష్పాలతో పూజించి, మోక్షాన్ని పొందాలి.
బ్రహ్మచారులు యాజ్ఞవల్క్యుని చేరి “ఏ మంత్రంచేత మనుష్యుడు మోక్షంపొందుతాడు” అని అడిగారు.
దానికాయన "శతరుద్రీయేణేతి" శతరుద్రీయంచేత
అన్నాడు.. అని జాబాలోపనిషత్తు చెపుతున్నది.
'శతం రుద్రా దేవతా యస్య'
నూరుమంది అంటే పెక్కుమంది రుద్రులు దేనికి దేవతలో అలాంటిది శతరుద్రీయం అని తైత్తరీయసంహిత చతుర్థకాండ పంచమ ప్రశ్నాత్మకమైన రుద్రాధ్యాయం పేర్కొంటున్నది.
మాయాంతు ప్రకృతిం విద్యాత్
మాయినం తు మహేశ్వరమ్' (శ్వేతా.ఉ)
మాయ అంటే ప్రకృతి.
దానికి అధిపతి మహేశ్వరుడు.
అందుకే ప్రకృతిలోని అనంతమైన శివశక్తిని శివపూజతో, భజనతో, శ్రవణాదికాలతో మేల్కొల్పాలి.
తానే శివుడై సర్వాన్ని శివమయంగా భావించి తాదాత్మ్యం చెందాలి.
అదే శివపూజలోని ఆంతర్యం.
అప్పుడు శివపూజలో సాయుజ్యం, శివభజనలో సామీప్యం, శివుని విషయాలను ప్రసంగించడంలో, శివధ్యానంలో సారూప్యం సిద్ధిస్తాయని ఆదిశంకరుల ఉపదేశం.
శివుని ధారాపూర్వకంగా చల్లని నీటితో అభిషేకం చేయడం...యోగ శాస్త్రరీత్యా మన సహస్రార కమలంలో ప్రకాశించే సదాశివతత్యామృతం వర్షించడానికి ఒక ప్రతీక.
'సర్వయజ్ఞ తపోదాన తీర్థదేశేషు యత్సలం
తత్పలం కోటిగుణితం శివలింగార్చనాత్సలం'.
అన్ని యజ్ఞాలవల్ల, తపస్సులవల్ల, దానాలవల్ల, తీర్థాలను సందర్శించడంవల్ల కలిగే ఫలానికి
కోటి రెట్లు శివలింగార్చనవల్ల కలుగుతుందని పెద్దలంటారు.
ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు.
రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించకూడదు ('నారుద్రో రుద్రమర్చయేత్) ముందుగా మహాన్యాసంతో ఆ యోగ్యతను సంపాదించుకొని, తరవాత ఆయనను నమక చమక పారాయణతో అభిషేకిస్తాం. ఏకాదశరుద్రాభిషేకం చేస్తాం.
మన జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, మనస్సు కలిపి పదకొండు.
అదే ఏకాదశ రుద్రాభిషేకంలోని అంతరార్థం.
అంతే కాదు...
మనలో ప్రాణాపానాది ఐదు వాయువులూ, నాగకూర్మాది ఐదు ఉపవాయువులూ ఉన్నాయి.
ఈ పదింటికీ మూలమైనది ఆత్మ.
దాంతో వదకొండు.
ఇవే ఏకాదశరుద్ర స్వరూపం. రుద్రపారాయణంవల్ల, రుద్రాభిషేకంవల్ల ఇవన్ని శుద్ధమవుతాయి.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి