ధన ప్రవాహము-జాతక విశ్లేషణ

                                 

ధన ప్రవాహము-జాతక విశ్లేషణ

జాతకులలో కొందరికి ధన ప్రవాహం అనేది జరుగుతుంది అనగా ఎల్లప్పుడూ అవసరానికి తగిన ధనం లభిస్తూనే ఉంటుంది. వీరు సాధారణంగా అప్పులు చేయవలసిన పని ఉండదు. చేసినప్పటికీ వెంటనే తీరిపోతాయి. ఇటువంటివారి జాతకాలలో గ్రహాల అమరిక ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. లగ్నాత్తు రెండవ అధిపతి మూడవ అధిపతికి సంబంధం ఉన్నప్పుడు అనగా ద్వితీయాధిపతి తృతీయాధిపతి కలిసి ఉన్న లేదా పరివర్తన ఉన్నా వీళ్ళకి నిరంతర ధనం లభిస్తూనే ఉంటుంది. లేదా కుజుడు ధనాధిపతికి సంబంధం ఏర్పడినప్పుడు వీరి జాతకంలో ధన ప్రవాహం ఉంటుంది. ఎప్పుడు ధనానికి లోటు ఉండదు. అదేవిధంగా భాగ్యాధిపతి లాభాధిపతి పై దృష్టి ఉన్న లేదా కలిసి ఉన్న జాతకులకు కూడా అత్యధిక ధనం లభిస్తూనే ఉంటుంది. కొద్ది రోజులలో ఏదో ఒక పెద్ద ధనానికి సంబంధించిన అవసరం ఉంటే ఆ సమయానికి ధనం వెంటనే లభిస్తుంది. వ్యాపారం చేసేవారైతే లాభాలు ఆకస్మికంగా రావడం లేదా ఏదో విధంగా ధనం అయితే లభిస్తుంది. లేదా జాతకంలో గురు భగవానుడు లాభాధిపతిని కలిసినా,లాభాధిపతి పై దృష్టి ఉన్నా ఈ జాతకులకు ధనం లభిస్తూనే ఉంటుంది. లేదా తృతీయ అధిపతి తొమ్మిదో అధిపతిని కలిసినా దృష్టి ఉన్న, లేదా ఆ స్థానాలను చూస్తున్నా వీరికి కూడా ఎల్లప్పుడూ ధన లభిస్తూనే ఉంటుంది. ఇటువంటి ధన ప్రవాహం అనేది దశ అంతర్దశలతో సంబంధం లేదు. ఎల్లప్పుడూ వీరికి చేతిలో డబ్బు ఉంటుంది. వీరి దగ్గర డబ్బు నిల్వ ఉంటుందా లేదా అనేది జాతకంలో అవయోగాల ఆధారంగా నిర్ణయింపబడుతుంది. కొందరికి నిరంతర ధన ప్రవాహం అనగా డబ్బు వస్తూనే ఉంటుంది. కానీ జాతకంలో అవయోగాలు ఉన్నవారు ధనాన్ని నిలవ వేయలేరు ఆస్తులు కొనలేకపోతుంటారు. ఏదో రూపంలో ఖర్చవుతుంది. జాతకంలో అవయోగాలు తొలగించుకున్నప్పుడు వచ్చిన ఆదాయం నిలవ వేయగలరు స్థిరాస్తులు కొనగలరు. ధన యోగం ఉన్న గ్రహాలు ధనం ఇస్తూనే ఉంటాయి. జాతకంలో అవయోగాలు లేదా దుర్యోగాలు  లేనప్పుడు ఈ ధనాన్ని స్థిరాస్తు రూపంలో లేదా చరాస్తి రూపంలో నిలువ చేయగలుగుతారు. జ్యోతిష్య శాస్త్రంలో కొద్దిపాటి అవగాహన మీకు ఉంటే పై యోగాలు మీ జాతకంలో ఉన్నాయో లేదో పరిశీలించండి.

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #pariharalu #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025