అనగనగా.

అనగనగా..
ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది. ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు. ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లి..!
"మీరేంచేస్తారో నాకు తెలియదు నా చిలుకను బ్రతికించండి. లేదంటే నేనూ చనిపోతాను" అని కన్నీరుపెట్టుకుంది..!
దానికి ఇంద్రుడు..
"దీనికే ఇంత ఏడవడం ఎందుకు.!? అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మ కదా..! నేను వెళ్ళి ప్రార్ధిస్తాను.నువ్వేం దిగులు పడకు..!" అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు. ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ..! "నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను. దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు..! కావున మనం విష్ణువు దగ్గరికి వెళదాం పద.!" అంటూ బయలుదేరారు.
వీరిరాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు. "నిజమే ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే..! కానీ..! చిలుక ప్రాణం చివరి దశలో ఉంది..! మళ్ళీ ఊపిరి పోయాలంటే శివునికే సాధ్యం..! మనం ముగ్గురం శివుని వద్దకు వెళదాం పదండి..! " అన్నారు.
ముగ్గురూ శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నారు." ఆయుష్షు పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను..! మనం వెళ్ళి యమధర్మరాజు ను అడుగుదాం పదండి..! " అంటూ అందరూ బయలుదేరారు.
ఇంద్ర, బ్రహ్మ, విష్ణువు, శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాదారంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు.
"అయ్యో..! అదేమి పెద్ద పనికాదు. మాములుగా చావుకు దగ్గరగా ఉన్న వారి కర్మఫలాల లెక్కింపు, ప్రాణాల హరింపు బాధ్యతను యమలోకానికి అప్పగిస్తారు, అలా వచ్చినవారి లలాట లిఖితాన్ని అనుసరించి, వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకుమీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడ తీస్తాము. అట్టి రాత ప్రకారం ఎవరి ఆకు ఎప్పుడు రాలి క్రిందపడుతుందో వారు ఆయా సమయంలో అందులో రాసిన విధంగా చనిపోతారు. మీ యొక్క చిలుకకు సంబంధించిన ఆకును అట్టి వరుసలోనుండి తొలిగించాక దాని మరణాన్ని మార్చేసే పనిచూద్దాం, పదండి ముందైతే వెళ్లి ఆ ఆకుని తొలగించి చిలుకను కాపాడుదాం..! " అని అన్నాడు యముడు.
త్రిమూర్తులు మరియు యముడు సాధారణంగా ఒకేసారి కలసికట్టుగా ఒక చోటికి వెళ్లడం దాదాపు జరిగే పని కాదు, అయినా ఇంద్రుని ప్రార్థన, ఇంద్రాణి కోరిక తీర్చాలనే ఆకాంక్షించతో వారు నలుగురు కలువాల్సిన అత్యంత అరుదైన సన్నివేశం అది, సరే మొత్తానికి అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఆ గదిలోని ఒక ఆకు రాలి పడింది. ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసి ఉందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం వ్రాసి ఉంది ఇలా..!
"ఎప్పుడైతే ఈ గదిలోకి యమధర్మరాజు గారు, విష్ణు ఈశ్వర బ్రహ్మాదులతో కలసి దేవేంద్రుడిని వెంటబెట్టుకుని వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది..! " అని వ్రాసి ఉందట.
నిజానికి చిలుక జనన సమయంలో బ్రహ్మచే అలా వ్రాయబడడం చూసిన చిత్రగుప్తుల వారు, ఇక ఈ చిలుకకు మరణం అసాధ్యమని, బ్రహ్మ గారు ఏ చిత్తములో ఉండి ఇలాంటి అసాధ్యమైన మరణ శాసనం రాశాడో కానీ ఈ ప్రాణి యుగాంతాల వరకు బ్రతికే అవకాశాన్ని పొందింది దీనిదెంత అదృష్టమో కదా అని భావించారట, కానీ చిత్రగుప్తుడు భావనను పటాపంచలు చేస్తూ యమలోకంలో అంతమంది దేవతలు కలిసే సందర్భం రావడం, దీర్ఘాయుష్షు ఉందనుకున్న అట్టి చిలుక ప్రాణాలు హరించబడటం చూసి చిత్రగుప్తుల వారు అవాక్కయ్యారట..
చూశారా, ఇదే విధి..! విధిని ఎవ్వరూ మార్చలేరు. జీవించి ఉన్నప్పుడే ఇతరులమీద ప్రేమను చూపుదాం. . వీలైనప్పుడు మన సహాయాన్ని ఇతరులకు ఇతరులకు అందిద్దాం.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి