తరచుగా జరిగే తగాదాలు-పరిహారం
తరచుగా జరిగే తగాదాలు-పరిహారం
కొన్ని సందర్భాలలో ఎదుటివారితో అకారణంగా తగాదాలు వస్తూ ఉంటాయి. ఆఫీసులో కానీ ఇరుగుపొరుగు వారితో గాని ఏ సందర్భంలో అయినా సరే చిన్న చిన్న గొడవలు లేదా తగాదాలు వస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి. ఇటువంటి తగాదాలు లేదా గొడవలు రాకుండా ఉండడానికి చిన్న పరిహారం పాటించండి. ఈ పరిహారం చేసే సమయంలో మౌనంగా ఉండాలి పరిహారం పూర్తి అయ్యేవరకు ఎవరితో మాట్లాడకూడదు. ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకోండి అది కొత్తది అయి ఉండాలి దానిలో దొడ్డు ఉప్పు ఏడు కళ్లు తీసుకోండి అనగా ఉప్పు చిన్న చిన్న ముక్కలుగా ఉంటుంది అటువంటివి 7 తీసుకోవాలి. ఈ ఏడు ఉప్పు కనికలును ముందుగా తీసుకున్న కొత్తది తెలుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ పూజ మందిరంలో హనుమంతుడు ఫోటో ముందు కానీ దుర్గాదేవి ఫోటో ముందు కానీ ఏదైనా పర్వాలేదు దాని ముందు ఉంచి సాంబ్రాణి ధూపం వెయ్యాలి తర్వాత ఆ ఉప్పు మూటకు నమస్కారం చేసుకొని
ఆ మూట తీసుకుని ఒక పాత్రలో ఉంచండి ఈ పాత్రను మీ గృహంలో ఏ గదిలో అయినా పర్వాలేదు దక్షిణ భాగంలో ఎవరు తాకనిచోట ఎత్తు ప్రాంతంలో ఉంచండి. ఒకసారి ఆ ప్రాంతంలో ఉంచిన తర్వాత పిల్లలు కానీ పెద్దవాళ్లు కానీ ఎవరూ దాన్ని తాకరాదు. అక్కడ ఉంచిన తర్వాత 41 రోజులు తర్వాత ఆ మూటను బయటికి తీసి ఉప్పు కనికలను ఏదైనా ప్రవహించే నీటిలో వేయాలి మీకు దగ్గరలో ప్రవహించే నీరు లేకపోతే మీ సింక్లో వేసి నీళ్లు వేయండి. మిగిలిన ఆ తెలుపు వస్త్రాన్ని ఎవరు తొక్కని ప్రాంతంలో వేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. ఈ విధంగా చేస్తే అకారణంగా వచ్చే గొడవలు తగాదాలు వంటివి రాకుండా ఉంటాయి గృహంలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.
జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #pariharalu #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి