సుదర్శన చక్రం
ఈ చక్రాన్ని దర్శించినా జన్మ ధన్యమే వైకుంఠం నుండీ శ్రీ మహావిష్ణువు స్వయంగా పంపిన సుదర్శన చక్రం
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం గర్భగుడిపై ఉన్న సుదర్శన చక్రం ఎవరూ తయారుచేసినది కాదు.,
మరి అది ఎలా వచ్చిందంటే భక్తరామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికై గొప్ప గొప్ప లోహ శిల్పులను రప్పించి వారిచేత సుదర్శన చక్రాన్ని తయారచేయిస్తున్నాడు. కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవటమో,లేదా సరిగా రాకపోవడమో జరుగుతుంది.
కలత చెందిన రామదాసు కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై "భక్తా..!! సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు. అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను అది గోదావరిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు" అని చెప్పాడు. మరుసటి రోజు గజ ఈతగాళ్ళతో రామదాసు వెతికించాడు. కానీ కనిపించలేదు.
మళ్లీ రాముడు కలలో కనిపించి "అది నామీద అమితమైన భక్తిని పెంచుుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది" అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రునికి స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం చేతిలో ఆగింది.ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తున్నది...
ఇంతటి ప్రాశస్త్యం ఉన్నది కనుకనే భద్రాద్రి మహా పుణ్యక్షేత్రమై విలసిల్లుతుంది ...
శ్రీరామ రామ రామేతి!!
రమే రామే మనోరమే!!
సహస్రనామ తతుల్యం!!
రామ నామ వరాననే!!
సర్వేజనా సుఖినోభవం
అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో, ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు.
అందరం భక్తితో " శ్రీరామ శ్రీరామ శ్రీరామ" అని వ్రాసి స్వామివార్ల అనుగ్రహం పొందుదాం ... ఎన్ని సార్లు స్మరిస్తే అంత మేలు చేస్తారు శ్రీ రామచంద్రుడు, ఆంజనేయ స్వామి వారు.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి