మహా శక్తి యోగం-జాతక విశ్లేషణ

 



మహా శక్తి యోగం-జాతక విశ్లేషణ

శని భగవానుడు రాహువు కలయిక జాతకంలో శపిత దోషంగా పరిగణిస్తారు. ఈ యోగం జాతకుడిని చాలా సమస్యలకు గురిచేస్తుంది. శని భగవానుడు కానీ రాహువు కానీ విడిగా ఉన్నప్పుడు జాతకుడికి చాలా సమస్యలను ఇస్తారు.కానీ ఇదే శని భగవానుడు రాహువు కొన్ని సందర్భాలలో రాజయోగంగా మారి అత్యధిక శుభ ఫలితాలను ప్రసాదిస్తారు. జాతకంలో చంద్రుడు ఉన్న స్థానానికి 12వ స్థానంలో అనగా మీ రాశికి 12వ స్థానంలో శని భగవానుడు రాహువు కలిసి ఉండి వీరిద్దరి మధ్య దూరం ఐదు డిగ్రీల కన్నా ఎక్కువగా ఉండాలి. ఈ డిగ్రీలు ఎంత దూరంలో ఉంటే అంత ఎక్కువ ఫలితాలను ఆశించవచ్చు.ఈ శని భగవానుడు రాహువు పై  బుధుడు, లేదా గురుడు లేదా శుక్ర భగవానులు యొక్క దృష్టి ఉండాలి. ఈ మూడు గ్రహాల దృష్టి కానీ వీటిలో రెండు గ్రహాలు కానీ లేదా ఈ మూడు గ్రహాలలో ఏదైనా ఒక గ్రహం యొక్క దృష్టి ఉన్నప్పటికీ మహాశక్తి యోగం యాక్టివేట్ అవుతుంది. ఈ బుధుడు లేదా గురుడు లేదా శుక్ర భగవానులు స్వక్షేత్రంలో ఉండి కానీ ఉచ్చస్థితిలో ఉండి కానీ శని భగవానుడు రాహువు పై దృష్టి సారించినప్పుడు ఈ మహాశక్తి యోగం తిరుగులేని ఫలితాలని ఇస్తుంది. రాజకీయ అధికారం,రాజకీయాల్లో ఉన్నత పదవులు, ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలు, ప్రభుత్వం వలన ఆదాయం ప్రభుత్వం కాంట్రాక్టుల ద్వారా ఆదాయం, అధికారం కలిగి ఉండడం అధికారంలో ఉన్న వారికి బినామీలుగా ఉండటం వంటి ప్రత్యేక ఫలితాలను ఇస్తుంది. ఈ మహాశక్తి యోగం జాతకంలో లగ్నానికి ఎటువంటి సంబంధం లేదు. రాశి ఆధారంగా మాత్రమే ఏర్పడుతుంది ఈ గ్రహస్థితి ఉన్నవాళ్లుకు 36 సంవత్సరాల తర్వాత ఈ మహాశక్తి యోగం యాక్టివేట్ అవుతుంది 40 సంవత్సరాల తర్వాత అత్యంత శక్తివంతంగా మారి రాజకీయ పదవులు, రాజకీయ అధికారంలో ఉన్న వారితో బలమైన సంబంధాలు లేదా ప్రభుత్వంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు ప్రసాదిస్తుంది. జీవితం మంచి మార్గంలో నడిచేటట్లు అవకాశం ఇస్తుంది. ఆర్థికంగా మంచి పురోగతిని ఇస్తుంది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించినప్పటికీ ఈ మహాశక్తి యోగం ఉంటే జాతకుడు తిరుగులేని శక్తివంతుడుగా మారుతాడు. ఆలయ ధర్మకర్తలుగా ఉండి మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అధికారం ఉన్న వారితో సంబంధాలు ఏర్పరచుకొని వీరు కూడా అధికారాన్ని సంపాదిస్తారు. రాజకీయంలో ఉన్నవారు లేదా రాజకీయ ప్రవేశం చేయాలనుకునేవారు ప్రభుత్వ రంగంలో ఉన్నత స్థానం పొందాలనుకున్నవారు ఈ యోగం ఉందో లేదో పరిశీలించుకోండి ఈ యోగం ఉన్నవాళ్లు కచ్చితంగా ఉన్నత ఫలితాలను పొందుతారని నిశ్చయంగా చెప్పవచ్చు.

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025