"ధర్మాచరణ - వస్త్రధారణ"
"ధర్మాచరణ - వస్త్రధారణ"
ధర్మాచరణమందు వస్త్రధారణమునకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నది.
వస్త్రాన్ని ఆవహించుకొని దేవతలు ఉంటారు అన్న విషయం మన ధర్మశాస్త్ర గ్రంధాలలో చెప్పబడియున్నది. అందుకే వస్త్రాన్ని కాలితో ఈడ్చడం గాని, తొక్కడం గాని చేయకూడదనేవారు మన పెద్దలు.
ఈరోజుల్లో పూజాకార్యక్రమాలలో పాల్గొనేవారిలో కొందరు శాస్త్రవిధి తెలియక కుట్టిన ధోవతిలాంటి వస్త్రాలను కట్టుకొని వైదిక కార్యక్రామలలో పాల్గొంటున్నారు. ఇటువంటివి ఈమధ్య కాలంలో బట్టల దుకాణాలలో కూడా అమ్ముతున్నారు. దయచేసి ఇటువంటి వస్త్రాలను కొనవద్దండి. కొంచెం శ్రద్ధ పెడితే కాసెపోసి (గోచీ )కట్టుకోవడం పెద్ధ విషయమేమి కాదు.
మన శాస్త్ర గ్రంధాలు ఈ విషయమై ఏమని చెపున్నాయంటే
"వికచ్చోనుత్తరీయశ్చ నగ్నశ్చావస్త్ర ఏవచ, శ్రౌతస్మార్థే నైవకుర్యాత్",
1)అనగా కచ్ఛము లేకుండాగానీ గుండారపోసి కట్టడముగానీ అనగా గోచీపోసి(వస్త్రాన్ని మడతపెట్టి రెండు కాళ్ళ మధ్యనుండి వెనుక వైపు దోపకపోవడం),
2)ఉత్తరీయము లేకుండాగానీ,
3)అంచులేని వస్త్రము కట్టినాగానీ, 4)అగ్నిస్పర్శ కలిగిన (కాలిపోయిన వస్త్రము కట్టినాగానీ),
5)ఎలుకలు తదితర జంతువులు కొరికిన వస్త్రము కట్టినాగానీ,
6)ఒకసారి కట్టినవస్త్రం మరల ఉతికి ఆరేయకుండా రెండవమారు కట్టినాగానీ,
7)కుట్టినబట్ట కట్టినాగానీ(పాంటు, షర్టులు మొదలైనవి)
8)రంగుబట్ట కట్టినాగానీ,
9)తడి వస్త్రం కట్టినాగానీ,
10)చిరిగిన వస్త్రం కట్టినాగానీ,
11)పెట్రోల్ వాష్ చేసిన డ్రైక్లీనింగ్ పంచెలుగానీ, పట్టుబట్టలుగానీ, చీరలు గాని కట్టినాగానీ,
వస్త్రము లేనివాడుగాను అనగా దిగంబరుడితో సమానం అనియు అటువంటి వస్త్రధారణతో వైదిక కర్మలలో పాల్గొనడంగానీ, దేవాలయ, పుణ్యతీర్థ క్షేత్ర సందర్శనం చేయడంగానీ చేయరాదని మన ధర్మశాస్త్ర గ్రంధాలు చెపుతున్నవి. అందువల్ల తెల్లని నూలు వస్త్రాలనుగానీ, లేదా పట్టుబట్టలను, కాశీ పంచలనుగానీ, ధావళినిగానీ ధరించడం మంగళకరం.
మిత్రులారా! మనమందరము సనాతనధర్మానుయూయులము. ఇటువంటి ధార్మిక విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించాలి. ధార్మిక చింతన కలిగిన మనము ఇటువంటి విషయాలుతెలుసుకొని మనము ఆచరించాలి, మన కుటుంబ సభ్యులు, బందువులు, మిత్రులు, శ్రేయోభిలాషులతో పంచుకోవాలి. అప్పుడే మనము సగర్వంగా సనాతన ధర్మానికి వారసులము అని చెప్పుకోవడానికి అర్హులమనిపించుకొంటాము. అందరూ ఈ ధార్మిక విషయాన్ని వీలైనంవరకు అందరూ తెలుసుకోవాలి.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి