వివాహ పొంతన గణాలు(పాయింట్లు) ఆధారంగా చూడవచ్చా?
వివాహ పొంతన దేనిని ప్రామాణికంగా తీసుకుని చూడాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా ఒక అబ్బాయికి అమ్మాయికి వివాహం చేయాలి అనుకున్నప్పుడు అబ్బాయి నక్షత్రానికి అమ్మాయి నక్షత్రానికి ఎన్ని గణాలు లేదా పాయింట్లు వచ్చాయి అనేది పంచాంగం చూసి 18 పాయింట్లు కన్నా ఎక్కువ వస్తే వివాహం చేయవచ్చు అని 18 పాయింట్లు కన్నా తక్కువ వస్తే వివాహం చేయకూడదని నిర్ణయం తీసుకుంటున్నారు. పాయింట్ల ఆధారంగా వివాహ విషయంలో నిర్ణయం తీసుకోరాదు. పాయింట్ల ఆధారంగా నిర్ణయం తీసుకుని వివాహ జీవితాన్ని గందరగోళం లో పడవేయవద్దు. 34 పాయింట్లు వచ్చిన వాళ్లు కూడా విడిపోయిన దంపతులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు 36 పాయింట్లు తీసుకోవాలి దీని అర్థం ఏమిటి అనేది పంచాంగం చూసి మీకు సలహా ఇచ్చిన వారికి కూడా తెలియదు. కానీ మీరు తెలుసుకోండి. వర్ణము 1పాయింటు, వశ్యం2పాయింట్లు, తారాబలం 3 పాయింట్లు, యోని 4 పాయింట్లు, గ్రహమైత్రి5 పాయింట్లు, గణము6 పాయింట్లు, రాశి 7, నాడి 8 పాయింట్లు మొత్తం 36 గణాలు లేదా పాయింట్లుగా లెక్కిస్తారు. కేవలం ఈ పాయింట్లు ఆధారంగా జీవితాలను నిర్ణయించకూడదు. అబ్బాయి అమ్మాయి ఇద్దరు జాతకాల లగ్నకుండలి, నవాంశ కుండలి పరిశీలించాలి, కుజ దోషము, లగ్న శత్రు షష్టఅష్టకములు పరిశీలించాలి వివాహం తరువాత దంపతులు కలిసి ఉంటారా, పోలీస్ స్టేషన్లో కేసులు, కోర్టు ద్వారా, భరణం ద్వారా విడిపోతారా అనేది పై రెండు విషయాలు ఆధారంగా తెలుసుకోవచ్చు. ఈ విషయాలు పాయింట్లతో తెలియదు. రాశ్యాధిపతి పరిశీలించినప్పుడు దంపతులు అన్యోన్యంగా ఉంటారా లేదా ఒకరిపై ఒకరు మానసికంగా టార్చర్ పెట్టుకుంటారా తెలుస్తుంది. అష్టమాధిపతి పరిశీలనలో దంపతుల ఆయుష్షు తెలుస్తుంది. పంచమాధిపతి పరిశీలనలో దంపతులకు సంతానం కలుగుతుందా లేదా.. .కలిగిన సంతానానికి ఆయుష్షు ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. భాగ్యాధిపతి పరిశీలన ద్వారా దంపతుల అన్యోన్యతను తెలియజేస్తుంది. రాజ్యాధిపతి పరిశీలనలో వివాహం తర్వాత దంపతులు పూర్వీక ఆస్తులను స్వార్జితాన్ని నష్టపోతారా.. లేదా వివాహం తర్వాత ఆస్తిపాస్తులు పెరగడము ఉద్యోగ అభివృద్ధి వ్యాపార అభివృద్ధి ఉంటుందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సప్తమ స్థానం పరిశీలన ద్వారా దంపతుల మధ్య పడక సుఖం ఉందా లేదా తెలుస్తుంది.వీటితోపాటు రాహు నక్షత్రాల వాళ్ళకి కేతు నక్షత్రాల వాళ్లను జత చేయకూడదు, దంపతుల యొక్క ఆరోగ్య స్థితిగతులను, మానసిక సంఘర్షణలను జాతకం ద్వారా పరిశీలించి వివాహ పొంతన చేయాలి.ఇటువంటి విషయాలు పాయింట్లతో తెలియవు. మీ సంతానం వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటే పెద్దవాళ్లకు కూడా సంతోషాన్ని ఇస్తుంది. కేవలం పాయింట్లు ఆధారంగా వివాహ నిర్ణయించి వివాహ జీవితాన్ని అయోమయంలో పడవేయవద్దు. అబ్బాయి అమ్మాయి ఇద్దరి జాతకాలను సరియైన జ్యోతిష్యుని ద్వారా పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మీ సంతానం యొక్క వైవాహిక జీవితం మీ కళ్ళ ముందే సంతోషకరంగా ఉంటుంది.
జాతక,ముహూర్త విషయాలకు phone Or వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చును.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి