ఆయుష్షు స్థానం-రాహుకేతువులు
ఆయుష్షు స్థానం-రాహుకేతువులు
జ్యోతిష్య శాస్త్రంలో ఎనిమిదవ స్థానం ఆయుష్షును సూచిస్తుంది. అటువంటి అష్టమ స్థానంలో రాహుకేతువులు ఉన్నప్పుడు దీర్ఘాయుష్షు ఉంటుందా లేదా అనే భయం కొందరికి ఉంటుంది. ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అష్టమ స్థానంతో పాటు ద్వితీయ స్థానం కూడా మారక స్థానాలుగా జ్యోతిష్యంలో పేర్కొంటారు. రాహువు రెండవ స్థానంలో ఉన్నప్పుడు కేతువు ఎనిమిదవ స్థానంలో ఉంటారు. కేతువు రెండవ స్థానంలో ఉన్నప్పుడు రాహువు ఎనిమిదో స్థానంలో ఉంటారు. రాహువు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఆయుష్షు తీరిపోతుందా అని సందేహం వస్తే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి. 60 సంవత్సరాలు దాటిన తర్వాత రాహువు అష్టమ స్థానంలో ఉండి ఆ దశ వస్తే ఆయుష్షు ప్రమాదంలో ఉన్నట్టు భావించాలి. రాహువు దశాకాలం 18 సంవత్సరాలు. కేతు దశా కాలం ఏడు సంవత్సరాలు. జాతకుడు 40 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు రాహు దశ కాలం వస్తే 50% ఆయుష్ ప్రమాదంలో ఉందని అర్థం. జాతకుడు 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు రాహు దశ కాలం వస్తే ఆయుష్షు 25 శాతం ఆయుష్షు ప్రమాదంలో ఉందని భావించాలి. అయితే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి పాప గ్రహ స్థానాలైన మేషం సింహం వృశ్చికం మకరం కుంభం ఈ స్థానాలు అష్టమ స్థానాలుగా ఉన్నప్పుడు రాహు కేతువులు అక్కడ ఉండి దశ నడిపిస్తే మాత్రం ఆయుష్కు భంగం జరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా వేరే స్థానాలు అష్టమ స్థానాలు అయితే ఆయుష్షుకు ప్రమాదం ఉండదు. మరియు అష్టమాధిపతి ఆయుష్షు కారకుడైన శని భగవానుడు బలంగా ఉన్నప్పుడు కూడా ఆయుష్షుకు ప్రమాదం ఉండదు. రాహు కేతువులు అష్టమ స్థానంలో ఉండి జాతకుడి యొక్క ఆయుష్షును తగ్గించాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి. అష్టమాధిపతి లేదా శని భగవానుడు బలంగా ఉన్నప్పుడు రాహు కేతువులు ఆయుష్షును ఏమి చేయలేరు, రాహు కేతువులు ఉన్న స్థానం శుభగ్రహ స్థానాలు అయినప్పుడు కూడా ఆయుష్షుకు ప్రమాదం ఉండదు. రాహు కేతువులు అష్టమ స్థానంలో పాపగ్రహ స్థానాల్లో ఉన్నప్పటికీ వీటిపై గురు దృష్టి ఉన్నపుడు కూడా రాహు కేతువులు ఏమీ చేయరు. రాహు కేతువులు అష్టమంలో పాపస్థానాలలో ఉండి 60 సంవత్సరాలు వయసు పైబడిన వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. 40 సంవత్సరాల వయసు ఉండి రాహు కేతువులు అష్టమంలో ఉండి దశ నడుస్తూ ఉంటే 50 శాతం ప్రమాదంలోనూ, 20 సంవత్సరాల వయసు వారు పైన చెప్పిన సమస్య ఉన్నప్పుడు 25% ప్రమాదంలో ఉంటారు ఇటువంటి లక్షణాలున్న వారు రాహు దశ నడిపే 18 సంవత్సరాలు లేదా కేతు దశ ఏడు సంవత్సరాలు అత్యంత జాగ్రత్తతో ఉండాలి. శని భగవానుడు స్వ క్షేత్రంలో కానీ ఉచ్చ స్థితిలో కానీ బలంగా ఉన్నప్పుడు ఆయుష్ గురించి భయపడవలసిన పని లేదు. గురుడు కానీ శుక్రుడు కానీ శుక్లపక్ష చంద్రుడు కానీ రాహుకేతువులను చూస్తూ ఉంటే రాహుకేతువులు ఆయుష్షుకు ఎటువంటి సమస్య ఇవ్వరు. బుధుడు స్వక్షేత్రంలో కానీ ఉచ్చస్థితిలో కానీ మూల త్రికోణంలో కానీ, దిగ్బలం పొందినప్పుడు కానీ రాహువు కేతువు వలన ఆయుష్షుకు ప్రమాదం ఉండదు. శుభగ్రహాలు బలహీనపడి రాహు కేతువులు బలం పొందినప్పుడు జాతకులు ఆయుష్ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.
జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి