ఆలూమగల అన్యోన్యత కొరకు


 ఆలూమగల అన్యోన్యత కొరకు 

ప్రస్తుత కాలంలో ఎవరికి వారికి స్వతంత్ర 

భావప్రకటన వలన, భార్యా భర్తల మధ్య అన్యోన్యత తగ్గి అవి అనేక  సమస్యలు వరకు దారి తీస్తున్నాయి. 

కలహాలను దూరం చేసుకోటానికి మంత్ర శాస్త్రంలో 

కొన్ని మంత్రాలు ఉన్నాయి. 

మంత్రాలను జపం చేసుకుంటూ చిన్న చిన్న సూచనలను పాటించటం వలన భార్యా భర్తల మధ్య కలహాలను దూరం చేసుకుని ఆనందంగా జీవించవచ్చు. వివాహానికి జాతక చక్రంలో సప్తమ స్థానం వివాహ స్థానాన్ని తెలియ చేస్తుంది. ఈ సప్తమ స్థానంలో పాప గ్రహం ఉన్నా లేక 

సప్తమ స్థాన అధిపతి 6,8,12 స్థానాలలో ఉన్నా దాంపత్య పరంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. అదే సప్తమ స్థాన అధిపతి స్వరాశి లో ఉన్నా,మిత్ర రాశిలో ఉన్నా, ఉచ్చ స్తితిలో దాంపత్య జీవితం బాగుంటుంది.సప్తమ స్థానం బాగుగా లేని పురుషులు అయితే శుక్రుని కి సంబంధించిన మంత్రాన్ని, 

స్త్రీలు అయితే బుధుని కి సంబంధించిన మంత్రాన్ని జపించాలి.పురుషులు అయితే ‘ఓం వస్త్రం దేహి శుక్రాయ నమః  ‘ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవాలి,

అదే స్త్రీలు అయితే ‘ ఓం లోహితాక్ష్యానమహ ‘ అనే మంత్రాన్ని పఠించాలి.దీనితో పాటు పురుషులు అయితే బియ్యాన్ని కాని, పరమాన్నాన్ని కాని ఆవుకు తినిపించాలి. 

అదే స్త్రీలు అయితే మంగళవారం నాడు ఆవుకి కొద్దిగా బెల్లం తినిపించాలి. 

ఇంకా భార్యా భర్తలు కలిసి ఉన్న ఫోటోను పడక గదిలో నైరుతి కోణంలో అమర్చాలి.దాని వలన కూడ అనుకూలతరంగాలు ఏర్పడి వైవాహిక జీవితం బాగుంటుంది.ముఖ్యంగా భార్యా భర్తల మధ్య ఆర్ధిక విషయాల వలన వచ్చే కలహాలను నివారించడానికి సోమవారం నాడు అశొక వృక్షం యొక్క ఆకులను తీసుకుని తోరణంగా గుమ్మం ముఖద్వారానికి  కట్టాలి. 

మంగళవారంనాడు ఆ తోరణం తీసి వేసి ప్రవహిస్తున్న నదిలో విడిచి పెట్టాలి. 

ఈ విధంగా 4 సోమవారాలు చేయాలి. ఇలా చేస్తే ఆర్ధిక ఆటుపోట్లవలన గొడవలు పడే దంపతుల మధ్య విబేధాలు తొలిగిపోతాయి.

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025