కుజుడు-జ్యోతిష్య వివరణ
కుజుడు-జ్యోతిష్య వివరణ
ఒక జాతకంలో కుజుడు సోదర కారకుడు, వ్యాపార కారకుడు, వివాహం సంతానము, భూమి కారకుడు ప్రమాదాలకు కారకుడు ఈ విధంగా అనేక బాధ్యతలు నిర్వహిస్తారు. శరీర నిర్మాణం మజిల్స్, బోన్స్ మధ్యలో ఉన్న మూలుగుకు కారకుడు రక్తం తయారీలో ప్రధాన పాత్ర కుజుడు వహిస్తారు. ఆడవాళ్ళలో మెచ్యూర్ కావడానికి, రీ ప్రోడక్ట్ సైకిల్కు కుజుడు కారకుడు. వివాహ సమయం వచ్చేసరికి కుజదోషం అనే విషయంలో కుజుడు జాతకంలో ప్రధాన పాత్ర వహిస్తారు. కుజుడు ఉన్న స్థానాన్ని ఆధారంగా కుజదోషము ఉన్నది లేనిది నిర్ణయం జరుగుతుంది. జాతకంలో ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది 12 స్థానాలలో కుజుడు ఉన్నప్పుడు కుజదోషంగా పరిగణిస్తారు. నాలుగు మరియు 12 స్థానాల్లో కుజుడు తక్కువ ప్రభావాన్ని చూపిస్తారు ఏడు ఎనిమిది స్థానాలు అత్యంత తీవ్ర కుజదోష ప్రభావాన్ని చూపిస్తారు. కుజుడు ఒక జాతకుడికి ఆక్రోషం, ఆగ్రహం ఆవేశం, తొందరపాటుతనం ఇస్తారు. సాహసమైన పోరాట పనులకు కుజుడు కారకుడు.జ్యోతిషంలో కుజుడుని సైన్యాధిపతిగా నిర్ణయిస్తారు. మొండితనం, వితండవాదం, పిడివాదం, ఎవరినైనా ఎదిరించడం అంటి లక్షణాలు ఇస్తారు. భూమికి కారకుడు కుజుడు ఇంజనీరింగ్ వృత్తికి, భూమి నుండి లభించే వస్తువులకు కుజుడు కారకుడు. ఒక జాతకుడు ఇల్లు కట్టగలడా, భూమి వలన లాభం ఉంటుందా భూమి కొనగలడా అనేది కుజుడిని ఆధారంగా చెప్పవచ్చు. సంతానం తల్లిదండ్రులు మాట వింటారా లేదా ఎదిరిస్తారా భార్యాభర్తలు కలిసి ఉంటారా లేదా గొడవలు పడుతూ విడిపోతారా అనేది కుజుడి ఆధారంగా నిర్ణయించవచ్చు. ఈ ఫలితాలన్నీ కుజుడుతో కలిసిన గ్రహాలు లేదా కుజుడు పై దృష్టి ఉన్న గ్రహాల ఆధారంగా మారుతూ ఉంటాయి. కుజుడు శుక్రుడుతో కలిసి 3, 12 స్థానాలలో ఉన్నప్పుడు జాతకుడు కామంతో తప్పుదారులలో ప్రవర్తించే అవకాశం ఉంటుంది. కుజుడు జాతకంలో అనుకూలంగా ఉన్నప్పుడు పోరాటంలో విజయం సాధించడం, ప్రభుత్వ ఉద్యోగాలు చేయడం, యూనిఫామ్ సర్వీస్, డిఫెన్స్ అకాడమీ, పోలీస్ డిపార్ట్మెంట్ అగ్నిమాపక దళం సెక్యూరిటీ వింగ్ వీటికి సంబంధించిన ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఒకరు ఇంజనీరింగ్ చదువుతారా, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తారా, రియల్ ఎస్టేట్ పనిచేస్తుందా, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారా అనేది కుజుడు యొక్క స్థానం ఆధారంగా నిర్ణయించవచ్చు. వివాహం అయిన తర్వాత దంపతులు కలిసి ఉంటారా, నిరంతరం గొడవలు పడుతూ ఉంటారా రెండవ వివాహం చేసుకుంటారా ఇటువంటి విషయాలు కుజుడు స్థానం, కుజుడు పై దృష్టి ఉన్న గ్రహాలు ఆధారంగా తెలుసుకోవచ్చు. కుజుడు జాతకంలో ఆరవ స్థానానికి సంబంధం ఏర్పడి ఆ దశ నడుస్తూ ఉంటే జాతకులు ప్రమాదాలు గండాలు, యాక్సిడెంట్, రక్తస్రావం, శస్త్ర చికిత్సలు, ఏదైనా ఒక అవయవం కోల్పోవడం, జైలు జీవితం వంటివి కుజుడు ఇస్తారు. ఒక జాతకంలో కుజుడు అనుకూలంగా ఉన్నారా లేదా వ్యతిరేకంగా ఉన్నారా అనేది కుజుడు యొక్క స్థానం, లగ్నం, మిత్ర శత్రు గ్రహాలు, దృష్టి యుతి ఆధారంగా నిర్ణయించాలి. ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే ప్రమాదాలను తప్పించుకునే అవకాశం ఉంటుంది.
జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి