ధనయోగము-గురు గ్రహము
ధనయోగము-గురు గ్రహము
జాతకునికి ధనయోగం ఇవ్వడంలో గురు గ్రహము ప్రధాన పాత్ర వహిస్తారు. కొన్ని లగ్నాలకు ప్రత్యేకంగా గురువు విపరీత ధన యోగాలను ఇస్తుంటారు. ఆ విషయాన్ని పరిశీలిద్దాం.
మీ జన్మ లగ్నానికి ధన పంచమ భాగ్య లాభాధిపతి దీనిలో ఏదైనా ఒక స్థానానికి ఆదిపత్యం వహిస్తే గురువు అత్యంత ధనయోగాన్ని ఆ లగ్న జాతకులకు అందిస్తారు. ఉదాహరణకు మేష లగ్నం తీసుకుంటే ఈ లగ్నానికి భాగ్యాధిపతి గురువు. వ్యయాధిపత్యం ఉన్నప్పటికీ ఒక స్థానానికి కచ్చితంగా ఆదిపత్యం వహిస్తున్నారు కావున ఈ లగ్నానికి అత్యంత ధన యోగాన్ని ప్రసాదిస్తారు. వృషభ లగ్నానికి గురువు లాభాధిపతి ఈ లగ్నానికి కూడా గురువు అత్యంత ధనయోగాన్ని ప్రసాదిస్తారు. మిధున లగ్నానికి ఈ సూత్రం వర్తించదు. కర్కాటక లగ్నానికి గురువు భాగ్యాధిపతి కావున ఈ లగ్నానికి కూడా ధన యోగాన్ని ఇస్తారు. సింహ లగ్నానికి పంచమాధిపతి గురువు ఈ లగ్నానికి కూడా ధనయోగాన్ని ఇస్తారు. కన్య, తుల లగ్నాలకు ఈ నియమం వర్తించదు. వృశ్చిక లగ్నానికి ధనాధిపతి,పంచమాధిపత్యం గురుడు కావున ఈ లగ్న జాతకులకు రెండు స్థానాలకు అధిపతి వహించిన కారణంగా అత్యంత వేగంగా ధనం సంపాదిస్తారు. ధనుర్ లగ్నానికి పై నియమం వర్తించనప్పటికీ ధనుస్సు , మీన లగ్నాలకు గురువు అధిపతి కావున ఈ రెండు లగ్నాలకు కూడా అత్యంత ధనాన్ని గురువు ప్రసాదిస్తారు. మకర లగ్నానికి పై రెండు నియమాలు వర్తించవు. కుంభ లగ్నానికి గురువు ధనాధిపతి మరియు లాభాధిపతి కావున కుంభ లగ్న జాతకులు కూడా అత్యంత వేగంగా ధనాన్ని సంపాదిస్తారు.
గురువు అనుగ్రహించే లగ్నాలు మేషము వృషభము కర్కాటకము సింహము వృశ్చిక ధనుస్సు కుంభం మీనము. ఈ ఎనిమిది లగ్నాల జాతకులు అత్యంత ధనవంతులు అవుతారా అంటే దీనికి మరొక సూత్రం కూడా వర్తింపజేయాల్సి ఉంది. అప్పుడే వారు ధనవంతులు అవుతారు. పై లగ్నాలలో గురువు ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఆ లగ్నాల యొక్క ధనాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి వీరిలో ఏ ఒక్కరి పై అయినా గురు యొక్క దృష్టి ఉంటే వీరు ఖచ్చితంగా అఖండ ఐశ్వర్యవంతులు,కోటీశ్వరులు అవుతారు. అయితే ఏ సమయంలో వీరు అత్యధిక ధనాన్ని సంపాదిస్తారు అనేది కూడా పరిశీలిద్దాం. ధనం సంపాదించడానికి వృత్తి ఉద్యోగ స్థానం అయిన పదవ స్థానాన్నిపరిశీలించాలి. దశమ స్థానంలో ఏవైనా గ్రహాలు ఉంటే ఆ గ్రహాల యొక్క దశలో ధనం సంపాదిస్తారు, దశమ స్థానాన్ని ఏదైనా గ్రహం చూస్తూ ఉంటే ఆ గ్రహం యొక్క దశలో కూడా ధనాన్ని సంపాదిస్తారు. దశమాధిపతి దశలో అయితే ధనాన్ని కాస్త నెమ్మదిగా సంపాదిస్తారు.ఈ లగ్నాలకు గురువు యొక్క దశలో కూడా ధనాన్ని సంపాదిస్తారు. మిగిలిన లగ్నాలు మిధునం కన్య తుల మకర లగ్నాలకు గురుడు పాపస్థానాలలో అనగా 3 6 8 12 ఈ స్థానాలలో ఉన్నప్పుడు ధనం సంపాదిస్తారు కానీ వీరికి అంత సులువుగా రాదు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత ధనాన్ని సంపాదించగలుగుతారు. మిధున కన్య లగ్నాల జాతకులకు అయితే 12వ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ధనాన్ని ఇస్తాడు కానీ మనశ్శాంతి ఉండదు. ఈ నాలుగు లగ్నాలకు దశాకాలం అంటూ ఏమీ ఉండదు. జీవితంలో ఏదైనా సమయంలో ధనం సంపాదించగలుగుతారు.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి