పెళ్ళికి నిరాకరించడం-తిరస్కరించడం


పెళ్ళికి నిరాకరించడం-తిరస్కరించడం

ఈ మధ్యకాలంలో వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోవడం లేదా వాయిదా వేయడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు మా పిల్లలు పెళ్లి పట్ల ఆసక్తి చూపడం లేదండి వయసు 30 సంవత్సరాలు దాటిపోతున్నాయి అని అడుగుతున్నారు. కొన్ని ప్రత్యేకమైన జాతక లక్షణాలు ఉన్నప్పుడు జాతకులు వివాహం పై ఆసక్తి చూపించరు. ఇంకా మంచి ఉద్యోగం రావాలి ఇంకా మంచిగా సెటిల్ అవ్వాలి, అనుకున్న  గోల్ రీచ్ అయిన తర్వాత వివాహం చేసుకుంటాను అని చాలామంది అంటున్నారు. వివాహం పట్ల ఆసక్తి లేకపోవడానికి జాతకంలో సర్ప దోషం ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. వీళ్లకు వివాహం పట్ల చాలా ఎక్కువ అంచనాలు ఉంటాయి. మరికొందరికి సంబంధాలు చూస్తూనే ఉంటారు కానీ ఇంతకన్నా మంచి సంబంధం వస్తుందని ప్రతి సంబంధాన్ని నిరాకరిస్తూ ఉంటారు. చివరికి వీరు వయసు దాటిపోయిన తర్వాత ఏదో ఒక సంబంధం చూసి ఓకే చేస్తారు లేదా కొంతమంది వివాహం కాకుండానే ఒంటరిగా మిగిలిపోతుంటారు. జాతకంలో కుజుడు రాహు నక్షత్రాలలో కానీ కేతు నక్షత్రాలలో కానీ ఉన్నప్పుడు ఇటువంటి మనస్తత్వం ఉంటుంది. కుజుడు కేతు నక్షత్రాలైన అశ్విని మఘ మూల ఈ నక్షత్రాలలో ఉన్నప్పుడు వివాహం పట్ల పెద్దగా ఆసక్తి చూపించరు. వాయిదా వేస్తూ ఉంటారు. కుజుడు రాహు నక్షత్రాలైన ఆరుద్ర స్వాతి శతభిషం ఈ నక్షత్రాలలో ఉన్నప్పుడు పెళ్లి పట్ల చాలా ఎక్కువ అంచనాలు ఉంటాయి. ఇంతకన్నా బెటర్ వస్తుంది అని ఆలోచనతో ప్రతి సంబంధాన్ని నిరాకరించి చివరికి లభించిన దానితో అడ్జస్ట్ అవుతారు. కుజుడు కేతువు నక్షత్రంలో ఉన్నప్పుడు పెళ్లి పట్ల ఆసక్తి తగ్గుతుంది, కుజుడు రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు విపరీత అంచనాలు ఉంటాయి. మరొక కారణం లగ్నాధిపతి రాహువు లేదా కేతు నక్షత్రాలలో ఉన్నప్పుడు లేదా లగ్నాధిపతి కేతువు లేదా రాహువుతో కలిసి ఉన్నప్పుడు కూడా వివాహం పట్ల ఆసక్తి చూపించరు. ఇటువంటి జాతకులు లగ్నాధిపతి ఏ నక్షత్రాలతో కలిసి ఉన్నారు పరిశీలించి దానికి తగిన పరిహారం పాటించినప్పుడు సుమారు 90 రోజుల లో వివాహం జరిగే అవకాశం ఉంది. జాతక పరిశీలనలో మీకు కొద్దిగా అవగాహన ఉంటే వివాహం ఎందుకు ఆలస్యం అవుతుందో పరిశీలించుకుని దానికి తగిన పరిహారం కోసం సంప్రదించండి. సరియైన పరిహారాలు పాటించినప్పుడు మీకు తగిన జీవిత భాగస్వామి లభిస్తారు.

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025