హైదరాబాద్ : లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహాకాళి అమ్మవారి జాతర, భోనాలు


 

హైదరాబాద్ : లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహాకాళి అమ్మవారి జాతర, భోనాలు 

తెలంగాణ సంప్రదాయం పండుగలలో మొదటిది బోనాల పండుగ. 

ఆషాడ మాసంలో ఆదివారం నాడు గోల్కొండ కోటలో మొదలయి 1 నెల రోజుల పాటు సాగుతోంది. చివరన హైదరాబాద్ పాతనగరంలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో చివరగా బోనాల  పండుగ ముగుస్తుంది. ఈ పండుగని వీక్షించేందుకు సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు. ఈ ఉత్సవం 2 రోజుల పాటు కొనసాగుతుంది.

మొదటి రోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం,

రెండవ రోజు రంగం భవిష్యవాణి కార్యక్రమం.                       

పోతారాజుల నృత్యాలు, శివసత్తుల విన్యాసాలు, వివిధ డప్పుల దరువులు, బోనాము ఎత్తిన మహిళల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బోనం ఎత్తిన మహిళలను అమ్మవారి స్వరూపంగా భావించి వారి పాదాలకి మంచినీటితో సాకగా పోస్తారు. బోనం తయారు కోసం మొదటగా ఒక కొత్త కుండాని కొనుగోలు చేసి, పవిత్రముగా అన్నాన్ని వండి ఈ కుండలో ఉంచి, ఘటానికి, కుండకి కుంకుమ, పసుపు, వేపచెట్టు ఆకులతో అలంకరణ చేసి పూజ మొదలు పెడుతారు. 

శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయచరిత్ర                           

పాతబస్తీలో ఎన్నో దేవాలయాలు ఉన్నపటికీ అందరిచే పూజలు అందుకుంటూ 1 స్థానంలో  ఉండేది మాత్రం శ్రీ సింహవాహిని మహంకాళి మాత ఆలయం.

లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని అప్పట్లో బిజిలీ మహంకాళి అని పిలిచేవారు. 

సింహవాహనంపై అమ్మ ఉన్నందున కాలక్రమేణ బిజిలీ మహాకాళి అనే పేరు సింహవాహిని మహాకాళిగా ప్రసిద్ధి కెక్కింది. 

1908 లో మూసినదికి వరదలు వచ్చినప్పుడు వరద ముప్పు తగ్గుముఖం పట్టాలి అని లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని అమ్మవారికి పూజలు నిర్వహించి ఒక బంగారు చాటలో పట్టు వస్త్రాలు, మేలిమి ముత్యాలు , నగలు, బంగారు గాజులు పెట్టి వాటిని మూసీ నదిలో వదిలిపెడుతారు. 

హైదరాబాద్ సంస్థానం అప్పటి ప్రధానమంత్రి మహరాజా కిషన్ ప్రసాద్ తొలిసారిగా బోనాలు సమర్పించారు. కంచి కామకోటి పీఠాధిపతుల చేతుల మీదుగా సింహవాహినియైన మహాకాళి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 

హైదరాబాదులోని గోల్కొండ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయాలలో జరిగే బోనాల అనంతరం ఆషాఢంలోని చివరి ఆదివారం నాడు సింహవాహిని బోనాలు చేయడం పరిపాటి. అమ్మవారికి బెల్లంతో చేసిన అన్నం, రోగ నివారిణియైన వేపాకు సమర్పిస్తారు. మూడో శుక్రవారం ఉదయం అభిషేకం, సాయంత్రం విశేష పూజలతో బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది. ఆదివారం ఉత్సవ ఘటాన్ని దగ్గరలో ఉన్న కాశీ విశ్వనాథ దేవాలయం నుండి మేళతాళాలతో తీసుకొచ్చి మహాకాళి ఆలయంలో ఉంచుతారు. ఉత్సవ విగ్రహానికి కూడా పూజలు చేస్తారు. ఆ తర్వాత బోనాలు సమర్పిస్తారు. సోమవారంనాడు అమ్మవారి ఘటాన్ని, ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించి చివరగా మూసీ నదిలో ఘటాన్ని నిమజ్జనం చేస్తారు. తరువాతి ఆదివారం నాడు అభిషేకం, శాంతి కల్యాణం నిర్వహించడంతో ఆషాఢ ఉత్సవాలు ముగుస్తాయి.

అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖా ఆధీనంలోకి తీసుకున్నా తరువాత ప్రభుత్వం కూడా అధికారికంగా ఈ ఉత్సవాలు మరో ఎత్తు. 

రెండవ రోజు రంగం - భవిష్యవాణి

రెండవ రోజు రంగం, రధోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంనికి ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారు ఒక మహిళా లోకి ఆవహించి భవిష్యత్ లో జరిగే పరిణామాలు, మొదలగు వాటిగురించి భవిష్యవాణి వినిపిస్తారు. 

ఈ భవిష్యవాణి వినడానికి కూడా ప్రజలు భారీ ఎత్తున పాల్గొంటారు.

రధోత్సవం

రధోత్సవం లాల్ దర్వాజా ఆలయం నుంచి మొదలు పెట్టి అక్కన, మాదన్న  ఆలయాలు కలుపుకొని, చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాల మీదుగా వెళ్తుంది.

బోనం

భోజనానికి రూపాంతరం బోనం. ఆషాఢంలో బోనాల్ని సమర్పించడమంటే, అమ్మ కృపవల్ల దక్కిన ఆహారాన్ని ఆ శక్తికే నివేదన చేసి కృతజ్ఞతలు చెల్లించుకోవడం ఈ సంప్రదాయం వెనుక పరమార్ధం.

బోనాలు అంటే ఏమిటి..?

ఆషాఢ బోనాల పండగ ప్రత్యేకత ఏంటి.....?

భోజనం ఫ్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు.

చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

బోనంలో ఏముంటుంది..?

వేటపోతు మెడలో వేప మండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు.

ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటు వ్యాధులు రాకుండా కాపాడుతారని భక్తుల విశ్వాసం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు,పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి , ఇత్తడి లేక రాగి కుండలలో తమ తలపై పెట్టుకుని డప్పుతో ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు.

మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో పసుపు, కుంకుమ, బియ్యం పిండి ముగ్గుతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం జరుగుతుంది.

మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ గ్రామ దేవతా గుళ్ళను ఎంతో సుందరంగా అలంకరిస్తారు.

ఆచారాలు

బోనాల సందర్భంగా పోతురాజు వేషధారి. 'ఆషాఢ' మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం,

అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనేగాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు.

ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, వంటల పండుగ వంటి పేర్లతో పిలుస్తారు. కాలక్రమేనా తర్వాత కాలంలో బోనాలుగా మారింది.

బోనాల సందర్భంగా పొట్టేళ్ళ రథంపై అమ్మవారిని ఊరేగింపు చేస్తారు. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్ట శక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను పొట్టేళ్ళను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.

ఊరేగింపు ఇలా...

ఈ పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుతో లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.

బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళను కుమ్మరిస్తారు.

తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా వస్తూ ఉంది. బోనాల పండుగ సందోహం గోల్కొండ కోట లోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలలై లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.

పోతురాజు ఎలా ఉంటాడంటే

దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి గంభీరంగా బలశాలిగా ఉంటాడు. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పు వాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు.

పోతురాజు భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు.

కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.

విందు సంబరాలు బోనాలు పండుగ దేవికి నైవేద్యము సమర్పించు పండుగ కావడం చేత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలౌతుంది. పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోరులో పండుగ వాతావణం విస్పష్టంగా ప్రస్ఫుటమౌతుంది.

రంగం అంటే ఏమిటి.?

రంగం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ విక్రుతమైన కొపాని తగ్గించెందుకు అక్కడవున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పొతరాజు తన దంతాలతో ఆ మేక పోతును కొరికి, తల, మోండెం వేరు చేసి పైకి ఎగురవేస్తాడు (గావు పెట్టడం). ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తరువాత జరుగుతుంది.

ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతో ఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య అక్కన్న, మాదన్నల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది.

భాగ్యనగరం (హైదరాబాద్), లస్కర్ (సికింద్రాబాద్) జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగవైభవంగా జరుగుతుంది.

తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది.

మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంబమై తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగాను నిర్వహిస్తారు. ఆ తరువాత చివరగా లాల్  దర్వాజ సింహవాహిని ఆలయంలో, ఇతర చోట్ల నిర్వహిస్తారు. 

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #ashadambonalu #jathara #alayacharitra #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025