శుక్ర చంద్రుడు కలయిక
శుక్ర చంద్రుడు కలయిక
జ్యోతిష్యంలో శుక్రుడు చంద్రుడు స్త్రీ గ్రహాలుగా పేర్కొంటారు. చంద్రుడు మధ్య వయసు స్త్రీ లేదా తల్లి గ్రహంగా, శుక్రుడు భార్య వయస్సు ఉన్న స్త్రీగా పేర్కొంటారు. చంద్రుడు మహారాణిగా శుక్రుడు యువరాణిగా పేర్కొన్నప్పటికీ మానవ సంబంధాల విషయంలో ఇది అత్తగారు మరియు కోడలు యొక్క సంబంధ బాంధవ్యాలను సూచిస్తుంది. చంద్రుడు ద్రవపదార్థాలకు కారకుడు శుక్రుడు వీర్యకణాలకు కారకుడు వీరిద్దరూ దగ్గిర డిగ్రీలలో కొన్ని రాశులలో ఉన్నప్పుడు ఆడవారు గర్భాశయ సమస్యలు, గర్భం దాల్చకపోవడం వంటివి మగవారిలో అయితే శుక్రకణాలు బలం లేకపోవడం, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. శుక్రుడు కామానికి కారకుడు చంద్రుడు ఊహలకు కారకుడు వీరిద్దరూ కలిసినప్పుడు కొన్ని సందర్భాలలో సెల్ఫ్ కంట్రోల్ లేకుండా విచిత్ర ధోరణిలో ప్రవర్తిస్తారు. వీరు సొంత రాశి లేదా ఉచ్చ క్షేత్రంలో ఉన్నప్పుడు అధిక బలం పొంది తీవ్ర నష్టాన్ని కలుగజేస్తారు. ఇటువంటి జాతకులు కుటుంబ జీవితం నడిపించడంలో ఆసక్తి చూపించరు. అత్త కోడల మధ్య బాంధవ్యం బాధాకరంగా ఉంటుంది.వీరు ఇరువురు వృషభంలో గానీ కర్కాటకంలో కానీ కలిసి ఉంటే కుటుంబంలో సమస్యలు ఆర్థిక సమస్యలు ఉంటాయి. కోరికలను ఏ విధంగా అయినా సరే అనుభవించాలి తప్పుడు మార్గంలో వెళ్లడం అనేది అసుర గురువు అయిన శుక్రుడు లక్షణం. చంద్రుడు కోరికలు సక్రమంగా తీర్చుకోవాలి అనే లక్షణం. ఈ రెండు గ్రహాల కలయిక జాతకుడి క్రమశిక్షణను ఉల్లంఘిస్తుంది. మకరం కుంభం మేషం వృశ్చికం స్థానాలలో ఈ గ్రహ కలయిక ఉన్నప్పుడు పెద్దగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు. ఇది కాకుండా మిగిలిన స్థానాలలో ఈ కలయిక ఏర్పడినప్పుడు గర్భాశయ సమస్యలు, పీరియడ్స్ ఇన్ బ్యాలెన్స్, సంతాన సమస్య, శారీరక బలహీనత వీర్యకణాల లోపం, భార్యాభర్తల సమస్యలు, స్వీయ నియంత్రణ కోల్పోవడం, స్వయం భోగం పట్ల ఆసక్తి, మితిమీరిన స్వార్థం,అక్రమ సంబంధాలు, మగవారు మగవారిని ఇష్టపడడం, ఆడవారు ఆడవారిని ఇష్టపడడం, అత్తా కోడల మధ్య సంబంధ బాంధవ్యాలను దూరం చేయడం వంటి సూక్ష్మ విషయాలను తెలియజేస్తుంది. ఒక వ్యక్తి జాతకంలో ఈ కలయిక ఉన్నప్పుడు అతడు గొప్పవాడు కాలేడు. పౌర్ణమి చంద్రుడుతో శుక్రుడు సమసప్తక స్థితిలో ఉన్నప్పుడు ఈ సమస్యలు 50 శాతం ఉంటాయి. ఈ గ్రహాల మధ్య గురుడు ఉన్నప్పుడు సమస్యలు ఉండవు, కుజుడు తో సంబంధం ఏర్పడితే ఆ గృహం మగవారి కంట్రోల్ లో ఉంటుంది. ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోనికి గాని, మీ కుటుంబం లోనికి కానీ ప్రవేశిస్తున్నారు అన్నప్పుడు వారి జాతకం క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది.
జాతక,ముహూర్త విషయాలకు phone Or వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చును.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి