ఏ దేవుని ఉంగరం ఏ వేలికి ధరించాలి


 

ఏ దేవుని ఉంగరం ఏ వేలికి ధరించాలి

ఈ రోజుల్లో చాలామంది  గ్రహాలకు సంబంధించిన రత్నాల ఉంగరాలు, మరియు దేవుడి ఉంగరాలు కూడా ధరిస్తున్నారు. దేవుడు ఉంగరాలు ధరించే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఏ దేవుడి ఉంగరము ఏ వేలికి ధరిస్తే తొందరలోనే ప్రయోజనం లభిస్తుంది పరిశీలిద్దాం. దేవుడు ఉంగరాలు ధరించే సమయంలో దేవుడు యొక్క శిరస్సు భాగము చేతి మణికట్టు వైపు ఉండాలి దేవుని పాదాలు ధరించే వారి యొక్క వేళ్ళ చివరి భాగం వైపు ఉండాలి. దేవుడు ఉంగరాలు ఎల్లప్పుడూ కుడి చేతికి మాత్రమే ధరించాలి. భోజనం కానీ లేదా అల్పాహారం కానీ చేసే సమయంలో తాత్కాలికంగా వాటిని ఎడమ చేతికి ధరించి భోజనం కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత కుడి చేతికి ధరించవచ్చు. దేవుడు విగ్రహాలకు ఎంగిలి తగలరాదు. మృతౌ శౌచము లేదా జాతౌ సౌచము అనగా మైల వచ్చినప్పుడు ఉంగరాలు తీసి పక్కన పెట్టాలి మైల కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఉంగరాలు ఆవుపాలతో శుద్ధి చేసి తర్వాత నీళ్లతో కడిగి ధరించవచ్చు. ఈ విధంగా చేయడం వలన దేవుడు ఉంగరాలకు మరింత శక్తి వచ్చి మంచి ఫలితాలను ఇస్తాయి. గణపతి ఉంగరము చిటికెన వేలుకు ధరించవచ్చు లేదా ఉంగరం వేలికి కూడా ధరించవచ్చు. చిటికెన వేలు బుధుడు యొక్క స్థానము బుధుడు యొక్క అది దేవత గణపతి అలాగే ఉంగరపు వేలు రవి భగవానుడికి సంబంధించినది. రవి బుధుడు మిత్రుడు కావున వినాయకుడి విగ్రహం ఉంగరపు వేలుకు కూడా ధరించవచ్చు. కొంతమంది శివుడు లేదా అర్ధనారీశ్వరుడు ఉంగరాలు కూడా ధరిస్తున్నారు.ఇటువంటి ఉంగరాలను కుడి చేతి చూపుడు వేలుకు మాత్రమే ధరించాలి. ఎక్కువమంది వెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు ఈ ఉంగరాన్ని కుడి చేతి ఉంగరపు వేలుకు ధరించినప్పుడు ఆరోగ్యము, ఆయుష్షు పూర్వీకుల నుండి వచ్చే ఆస్తులు,తండ్రి భాగ్యము, రాజకీయ అధికారము, సమాజంలో గౌరవం, ఉద్యోగం లో ప్రమోషన్ లభిస్తూ ఉంటాయి. ఆ విధంగా కాకుండా గ్రహరీత్యా కొన్ని దోషాలు ఎదుర్కొనే సమయంలో అనగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని భగవానుని యొక్క కాలం జరుగుతున్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని మధ్య వేలికి ధరిస్తే మంచి ప్రయోజనం లభిస్తుంది శని భగవానుని యొక్క ఈతి బాధలు తగ్గుముఖం పట్టి వారి అనుగ్రహము లభిస్తుంది. లక్ష్మీదేవి ఉంగరాన్ని ధరించేవారు కుడి చేతి ఉంగరపు వేలుకు మాత్రమే ధరించాలి. ఈ విధంగా ఏ దేవత ఉంగరాలను దానికి సరైన వేళ్ళకు ధరించినప్పుడు సత్ఫలితాలను జాతకులు పొందవచ్చు.

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025