వరలక్ష్మీ వ్రతం చేయు విధానం
వరాలిచ్చే కల్పవల్లి వరలక్ష్మి. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఇంట్లో ఎలా జరుపుకోవాలి, పూజా విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లేదా రెండో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. అంతేకాదు, సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని హిందువుల నమ్మకం.
తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం (వరలక్ష్మీ వ్రతం పూజా విధానం.. ఇంట్లో సులభంగా చేసుకునే పద్ధతి) జరుపుకోనున్నారు. వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ దేవి వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు సకల శుభాలుకలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి అని హిందూ పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపదలెన్నో ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.
వరలక్ష్మీ వ్రతం పూజా సామాగ్రి
పసుపు, కుంకుమ,గంధం, విడిపూలు, పూల మాలలు,
తమలపాకులు, 30
వక్కలు, ఖర్జూరాలు,
అగరవత్తులు,
కర్పూరం,
చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, రవిక దుస్తులు
మామిడి ఆకులు, ఐదు రకాల పండ్లు,
అమ్మవారి ఫోటో,
కలశం,
కొబ్బరి కాయలు,
తెల్ల దారం లేదా నోము దారం, లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారుచేసిన నైవేధ్యాలు,
బియ్యం, పంచామృతాలు. దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి.
శ్రావణమాసంలో రెండో శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేయకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి
లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.
వ్రతం చేయు విధానం..
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో లేదా రూపును తయారుచేసి అమర్చు కోవాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి.తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #varalakshmivratham #poojavidhanam #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి