మొక్కలు నాటడం ద్వారా పరిహారాలు
మొక్కలు నాటడం ద్వారా పరిహారాలు
ఈ భూమి మీద చెట్లు మొక్కలు ఉన్నందున వచ్చే ప్రయోజనాలు గురించి ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే. మొక్కలు నాటడానికి పెంచడానికి అందరూ ఇష్టపడతారు. పద్మ పురాణంలో ఎటువంటి మొక్కలు నాటడం వలన జాతకరీత్యా ఎటువంటి ఫలితాలను పొందుతారు అనేది చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఎవరైనా ధనపరంగా చిక్కులు సమస్యలతో ఉన్నవారు మీ గృహ ఆవరణలో దానిమ్మ మొక్క నాటండి. మొక్క చిగురించి దాని సైజు పెరిగే కొలది మీ జీవితంలో ఆర్థిక అభివృద్ధి మీరే గమనిస్తారు. మంచి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రావాలంటే కుటుంబ జీవితం సంతోషంగా ఉండాలి అంటే దానిమ్మ మొక్క మంచి ప్రయోజనాలు ఇస్తుంది. మంచి బుద్ధిమంతులైన లక్షణాలు గల సంతానం కావాలి అనుకున్న వారు నేరేడు మొక్క నాటండి. వ్యాపారం అభివృద్ధి చెందాలి అనుకున్న వారు మీరు ఎటువంటి వ్యాపారం చేస్తున్న వారైనా సరే మోదుగ మొక్క నాటండి. మొక్క చిగురించి పెద్దగా అవుతూ ఉంటే మీ వ్యాపారం కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది ఆదాయం పెరుగుతుంది. గృహంలో ఆడపిల్లలకు ఏదైనా సమస్యలు ఉంటే ఇంటి ఆవరణలో వేపచెట్టు నాటండి క్రమంగా ఇంట్లో ఉండే ఆడపిల్లల సమస్యలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య తరచుగా చిన్న చిన్న సమస్యలు వస్తూ అన్యోన్యత లోపిస్తూ ఉంటే ద్రాక్ష పాదును గృహ ఆవరణలో పెంచండి. దీనివలన దంపతుల అన్యోన్యత పెరుగుతుంది. మీ వ్యాపార సంస్థలో గాని గృహంలో కానీ పనివారు ఇబ్బంది పెడుతున్నా, తరచుగా సెలవులు పెట్టడం వలన పనులు ఆలస్యం అవుతూ ఉంటే ఊరికి దూరంగా చింత చెట్టును నాటండి. ఈ చెట్టు పెరిగే కొలది పని వారి నుండి వచ్చే సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి మీకు ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండాలి అంటే కొబ్బరి మొక్కనాటి దానిని పోషించండి. దీని వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడి ఒకరు ఒకరు అర్థం చేసుకుని ఒక మాట మీద నిలబడతారు. స్త్రీలకు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభించాలంటే సంపెంగ మొక్క నాటి దానిని పోషించండి దీనివలన లక్ష్మీ కటాక్షం మానసికంగా సంతోషంగా ఏర్పడతాయి. మొండి బాకీలు ఉండి త్వరగా వసూలు కాకపోతే చందనం మొక్క నాటి దానిని పోషించండి మొండి బాకీలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. జాతక రీత్యా ఏర్పడే ప్రతి సమస్యకు ఒక పరిహారం ఉంటుంది. ప్రతి సమస్యకు వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చిన్న చిన్న పరిహారాలు కూడా అత్యంత పెద్ద పెద్ద ప్రయోజనాన్ని ఇస్తాయి జాతకంలో దోషాలను తొలగిస్తాయి. కొన్ని దోషాలు ఆహార నియమాలు పాటించడం వలన(మెడికల్ ఆస్ట్రాలజీ) తొలగిపోతాయి. మరికొన్ని దోషాలు క్రమశిక్షణ నియమాలు పాటించడం వలన తొలగిపోతాయి. అత్యంత బలమైన అవయోగాలు లేదా పూర్వజన్మ శాపాలు వంటి బలీయమైన దోషాలు ఉన్నపుడు మాత్రమే ధనాన్ని ఖర్చు పెట్టే పరిహారాలు అవసరం అవుతాయి. జాతకంలో ప్రతి సమస్యకు అధిక ధనాన్ని వెచ్చించి ధనాన్ని వృధా చేసే అవసరం లేదు.
జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా సంప్రదించవచ్చును.
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి