లంబోదరుడు గణనాయకుడు ఎలా అయ్యాడు.?


 

లంబోదరుడు గణనాయకుడు ఎలా అయ్యాడు.?

ఇక తొమ్మిది రోజుల పాటు చేసే వినాయక నవరాత్రి ఉత్సవాలకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. తొమ్మిది రోజుల పాటు రోజుకో పేరుతో వినాయకుడిని పూజిస్తారు. మొదటి రోజైన భాద్రపద శుద్ధ చవితి నాడు విఘ్నేశ్వరుడ్ని..వరసిద్ధి వినాయకుడు అంటారు. నవరాత్రుల్లో రెండో రోజు వికట వినాయకుడిగా..మూడో రోజు లంబోదర వినాయకుడిగా..నాలుగో రోజు గజానన వినాయకుడిగా పూజలు అందుకుంటారు. ఐదో రోజు మహోదర వినాయకుడిగా..ఆరో రోజు ఏకదంత వినాయకుడిగా..ఏడో రోజు వక్రతుండ వినాయకుడిగా..ఎనిమిదో రోజు విఘ్నరాజ వినాయకుడిగా పిలుస్తారు. ఇక తొమ్మిదో రోజు ధూమ్రవర్ణ వినాయకుడిగా పూజిస్తారు భక్తులు.
వినాయకుడిని మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు, 21 రోజుల్లో నిమజ్జనం చేస్తుంటారు. విఘ్నేశ్వరుడి పూజ కనీసం మూడు రోజుల పాటు చేయాలని పండితులు సూచిస్తున్నారు. మట్టి, నీళ్లతో విగ్రహాన్ని చేసి..తిరిగి నీళ్లలో నిమజ్జనం చేయడంలో ఎంతో అర్థం ఉందని చెబుతున్నారు. మనిషి కూడా మట్టిలో నుంచే వచ్చాడని..తిరిగి అదే మట్టిలో కలువక తప్పదన్న సూత్రం ఇందులో ఉంటుందని పండితులు చెబుతున్న మాట.

విఘ్నేశ్వరుడికి మొత్తం 108 పేర్లు..
విఘ్నేశ్వరుడికి మొత్తం 108 పేర్లు ఉన్నట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. లంబోదరుడికి 32 రూపాలు ఉంటే అందులో 16 రూపాలు ముఖ్యమైనవనీ పండితులు చెబుతున్నారు. అయితే వినాయకుడికి విఘ్నాధిపతి అని కూడా పేరుంది. దీనిపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే పూర్వం దేవతలు, మునులు..విఘ్నాలను తొలగించేందుకు ఓ అధిపతి కావాలని శివుడ్ని వేడుకున్నారట. పుణ్యనదులలో స్నానం చేసి వచ్చిన వారికే ఆ భాగ్యం కల్పిస్తానంటే.. అందరికంటే ముందు వినాయకుడు పుణ్యనదుల స్నానం పూర్తి చేసి వచ్చాడని..అలా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడని పురాణాలు చెబుతున్నాయి.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

#vinayakudu #lambodharudu #vigneshwaruni108names #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025