గణపతి పూజలో గరికకు ప్రాధాన్యం ఎందుకు.?


గణపతి పూజలో గరికకు ప్రాధాన్యం ఎందుకు.?

పూజ, వ్రతం, నోము ఏది చేసినా ముందుగా గణపతిని పూజించాలనేది సంప్రదాయం. చవితి వ్రతంలో స్వామివారి విగ్రహాన్ని వరసిద్ధి వినాయకుడు అని పిలుస్తాం. ముందుగా పసుపుతో గణపతిని చేసి..తర్వాత స్వామివారిని ఆహ్వానించి వత్రం చేస్తారు. ఇక గరిక లేని గణపతి పూజ వ్యర్థమని శాస్త్రాలు చెబుతున్నాయి. చవితి రోజు వినాయకుడికి అర్పించే గరికకు చాలా ప్రత్యేకత ఉంది. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడిని పుట్టించి..దేవతల్ని ఇబ్బంది పెట్టాడట. అప్పుడు ఎంత ప్రయత్నించిన గణపతికి వేడి తగ్గకపోవడంతో 21 గరిక పోచలను తలపై పెట్టాలని రుషులు సూచించారట. ఆ వెంటనే వినాయకుడి శరీరంలో వేడి తగ్గిందట. అందుకే గణపతి పూజలో గరికకు ప్రాధాన్యం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.
ఇక స్వామివారికి నైవేద్యంగా సమర్పించే కుడుముల్లోనూ ఆరోగ్య సూత్రం ఉంది. వర్షాకాలంలోనే వినాయక చవితి వస్తుంది. రెయిన్ సీజన్‌లో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ సమయంలో జీర్ణవ్యవస్థ కాస్త వీక్‌గా ఉంటుంది. అందుకే ఆవిరిపైన వండిన ఆహారాలు ప్రసాదంగా తీసుకుంటే జీర్ణవ్యస్థ ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. అందుకే వినాయకునికి కుడుములు అంటే చాలా ఇష్టమంటున్నారు.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

#ganapathi #vinayakachavithi #garikapooja #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025