సంతాన స్థానం జ్యోతిష్య విశ్లేషణ

 సంతాన స్థానం జ్యోతిష్య విశ్లేషణ

సంతాన స్థానాన్ని పంచమ స్థానం అని మరియు పూర్వ పుణ్య స్థానం అని కూడా పిలుస్తారు. పూర్వజన్మలో చేసిన పుణ్యము లేదా పాపాలను తెలియజేసేది ఈ స్థానం. ఈ స్థానంలో పాపగ్రహాలు ఉన్నయెడల పూర్వజన్మ శాపాలు లేదా పాపాలు ఇంకా ఈ జన్మలో అనుభవించవలసి వస్తుందని అర్థం. ఈ స్థానంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు పూర్వజన్మ పుణ్యం ఈ జన్మలో అనుభవిస్తారు అని తెలియజేస్తుంది. ఈ పంచమ స్థానంలో పాపగ్రహాలైన రవి, కుజుడు శని భగవానుడు రాహు కేతువులు ఏ ఒక్కరైనా ఉంటే జాతకంలో పుత్ర దోషం ఉందని అర్థం. ఈ స్థానంలో రవి భగవానుడు ఉంటే సంతానం లేకపోవడం లేదా ఆలస్యం కావడం లేదా సంతానం వలన సమస్యలు ఎదుర్కొంటారు. జాతకుడికి ఉష్ణ రోగాలు ఉంటాయి, కోర్టు కేసులలో అపజయాలు ఉంటాయి. ఈ స్థానంలో కుజుడు ఉంటే సంతానం ఆలస్యం అవుతుంది. కలిగిన సంతానం జాతకుడికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ స్థానంలో కుజుడు తో పాటు రవి కూడా ఉంటే జాతకుడు సంతానం వలన తీవ్ర సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ పూర్వ పుణ్య స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు సంతానం చాలా అరుదుగా ఉంటుంది. పరిహారాలు చేస్తే సంతానం కలుగుతుంది. పురుష సంతానం కలిగే అవకాశం చాలా తక్కువ. స్త్రీ సంతానం కలుగుతుంది. శని భగవానుడు స్వక్షేత్రము ఉచ్చ స్థితిలో ఉండి శుభగ్రహ దృష్టి ఉన్నప్పుడు ఈ సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. జాతకుడికి నిద్ర కూడా సరిగా ఉండదు. వైవాహిక జీవితంలో సమస్యలు కూడా ఉంటాయి. ఈ పూర్వ పుణ్య స్థానంలో రాహువు ఉన్నప్పుడు పుత్ర దోషం నాగదోషం ఏర్పడతాయి. జాతకులకు అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంతానమైతే కచ్చితంగా కలుగుతుంది కానీ ఆలస్యం అవుతుంది. వీరికి జీవితంలో ఏ పని కూడా సులభంగా జరగదు ప్రతిదీ ఆలస్యం అవుతుంది. పంచమస్థానంలో కేతువు ఉన్నప్పుడు పుత్ర సంతానం ఆలస్యం అవుతుంది. స్త్రీ సంతానం అయితే కచ్చితంగా ఉంటుంది. సిజేరియన్ జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. వీరికి నాగదేవతల అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది వీరికి పుట్టిన సంతానం ప్రతిభావంతులుగా ఉంటారు. ఇక పంచమ స్థానంలో శుభగ్రహాలైన గురువు ఉన్నప్పుడు కారకో భావనాశాయ సూత్రం ప్రకారం సంతానం ఆలస్యం అవుతుంది పంచమ స్థానం గురువు యొక్క స్వక్షేత్రం అయినప్పుడు మాత్రం ఈ సమస్య రాదు. పురుష సంతానం కచ్చితంగా ఉంటుంది. ఈ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు అధిక స్త్రీ సంతానం ఉంటుంది. నిరంతరం ఏదో ఒక శారీరక అనారోగ్య సమస్య ఉంటుంది. ఈ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు మొదటిగా స్త్రీ సంతానం ఉంటుంది. వివాహం అయిన తర్వాత అభివృద్ధి ఉంటుంది. ఈ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు మంచి తెలివితేటలు ఉన్న సంతానం ఉంటారు. వీరు అనేక రంగాలలో రాణిస్తారు.

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025