వివాహం ఏ సమయంలో జరుగుతుంది

 వివాహం ఏ సమయంలో జరుగుతుంది

ప్రస్తుత కాలంలో వివాహం చాలామందికి ఆలస్యంగా జరుగుతుంది మరి కొంతమంది వివాహం జరుగుతుందా లేదా అని సందేహం కూడా వస్తుంది. జాతకరీత్యా ఏ గ్రహాలు దశలలో వివాహం జరుగుతుంది పరిశీలిద్దాం. సాధారణంగా వివాహ స్థానం సూచించేది సప్తమ స్థానం సప్తమ స్థానాధిపతి కానీ సప్తమ స్థానంలో ఉన్న గ్రహాల దశ అంతర్దశలలో ఎవరికైనా వివాహాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అష్టమ స్థానాధిపతి లేదా అష్టమ స్థానంలో ఉండే గ్రహాల దశ లో కూడా వివాహం జరుగుతుంది అష్టమ స్థానం అనేది మాంగల్య స్థానం మరియు అష్టమ స్థానంలో ఉండే గ్రహాలు కుటుంబ స్థానంపై వీక్షణ కలిగి ఉంటాయి కావున కుటుంబ ఏర్పడాలంటే అష్టమ స్థానానికి కూడా ప్రత్యేకత ఉంది అదేవిధంగా కుటుంబ స్థానము కుటుంబ స్థానంలో ఉండే గ్రహాలు, కుటుంబ స్థాన అధిపతి ఈ గ్రహాల యొక్క దశ అంతర్దశలో కూడా వివాహం తిరిగే అవకాశం ఉంది అదేవిధంగా చతుర్ధ స్థానం అధిపతి ఆ స్థానంలో స్థితి పొందిన గ్రహాలు వీటి దశ అంతర్దశలో కూడా వివాహం జరుగుతుంది వివాహానికి ముఖ్యంగా కుజుడు గురుడు శుక్రుడు రాహువు ఈ గ్రహాల దశ అంతర్దశలలో కూడా వివాహం జరుగుతుంది. వివాహం జరగడానికి చాలా గ్రహాలు సహకరిస్తాయి. కానీ వివాహం ఆలస్యం కావడానికి ఏ గ్రహాలు కారణం అవుతాయి ఇప్పుడు పరిశీలిద్దాం. శని భగవానుడు వివాహం ఆలస్యానికి ఒక కారణం అని చెప్పాలి శని భగవానుడు లగ్నంలో గాని సప్తమంలో గాని ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది. శని భగవానుడు పంచమం లో ఉన్న లేదా దశమ స్థానంలో ఉన్నా సరే వివాహం ఆలస్యం అవుతుంది ఎందుకంటే శని భగవాన్ యొక్క దృష్టి వివాహ స్థానంపై ఉంటుంది. అదేవిధంగా శని భగవాన్ యొక్క దృష్టి సప్తమాధిపతి పై ఉన్నప్పుడు కూడా వివాహం ఆలస్యం అవుతుంది. మరొక ముఖ్యమైన కారణం సప్తమ స్థానంలో గురు భగవానుడు ఒక్కరే స్థితి పొంది ఉన్నప్పుడు కూడా వివాహం చాలా ఆలస్యం అవుతుంది. గురు భగవానుడు ఒక్కరే ఉన్నప్పుడు ఏ స్థానం అయినా సరే చాలా బలహీనమవుతుంది ఉదాహరణకు పంచమ స్థానంలో గురు భగవానుడు ఒక్కరే ఉండి ఏ ఇతర గ్రహాలు కలిసి లేకపోయినా లేదా దృష్టి లేకపోయినా ఆ జాతకులకు సంతానం కలగడం చాలా కష్టమైపోతుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో గురు భగవానుడు ఒక్కరే ఉంటే వివాహం చాలా చాలా ఆలస్యం అవుతుంది. గురు భగవానుడుతో ఏదైనా గ్రహం కలిసి ఉన్నప్పుడు మరల వివాహం తొందరగానే అవుతుంది. కేతువు యొక్క అంతర్దశలో మాత్రం వివాహం చేసుకోకపోవడం మంచిది కేతు యొక్క దశలో చేసుకోవచ్చు అంతర్దశ దాటిన తర్వాత చేసుకోవచ్చు. వివాహం ఆలస్యం ఇవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. వివాహాల ఆలస్యానికి కారణం తెలుసుకొని ఆ గ్రహాలకు సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు పాటించినప్పుడు దోషాలు తొలగి తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. వివాహం కాకుండా ఉండడానికి, వివాహం అయిన తర్వాత దంపతులు సంతోషంగా లేకపోవడానికి, రెండు మూడు వివాహాలు కావడానికి గ్రహసంపతి వేరేగా ఉంటుంది. వివాహ విషయంలో కొన్ని కొన్ని పరిహారాలు ఎవరికి వారే చేసుకునే అంత చిన్న పరిహారాలు కూడా ఉంటాయి అవి పాటించినప్పుడు వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది.

జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును. 

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025