ఎందుకు గ్రహణం లోపే వినాయకుని నిమజ్జనం చేయాలి??
వినాయక చవితి నిర్ణయము
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
శ్రీ మహాగణపతయే నమః
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీవిశ్వావసు నామ సంవత్సర భాద్రపదమాస శుద్ధ చవితి - 27.8.2025 బుధవారం - ఉదయం నుంచి సాయంత్రం వరకు వినాయక వ్రత పూజలు వినాయక విగ్రహ ప్రతిష్టలు చేయడానికి శుభప్రదంగా ఉన్నది.
అలాగే...
🌙🌒 సెప్టెంబర్ 7వ తేదీన - సంపూర్ణ చంద్రగ్రహణము.
కావున, ప్రతీసంవత్సరం వలె ఈ సంవత్సరం వినాయక నవరాత్రులు 21 రోజులు 27 రోజులు నవరాత్రులు ఈ సంవత్సరం జరపకూడదు. ఎందుకంటే.. ఈ సంవత్సరము సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది కావున నవరాత్రులు తొమ్మిది రోజులే చేయాలి.
ఎందుకు గ్రహణం లోపే వినాయకుని నిమజ్జనం చేయాలి??
ప్రతిష్టలు అనేవి రెండు రకాలు...
1 చర
2 స్థిర
చర ప్రతిష్ట
చర ప్రతిష్ఠ అనేది మనం వినాయక నవరాత్రులు అలాగే దుర్గ నవరాత్రులు ఏదైనా తాత్కాలికంగా విగ్రహాలు నిలిపి వాటికి పూజలు చేయడం చర ప్రతిష్ట అంటారు.
స్థిర ప్రతిష్ట
స్థిర ప్రతిష్ట అంటే శాశ్వతంగా ఆలయం నిర్మించడాన్ని స్థిర ప్రతిష్ట అంటారు.
అయితే ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏమిటంటే... గ్రహణ కాలం తర్వాత మన ఆలయాన్ని గ్రహణ దోషం పడిందని శుద్ధి చేసుకుంటాం. అయితే చర ప్రతిష్టకు శుద్ధి ఉండదు. ఆ విగ్రహములు మరి పూజకు పనికిరావు.
కావున వినాయక నవరాత్రులు అనేవి 9 రోజులు మాత్రమే చేసుకుని, సెప్టెంబర్ 7వ తేదీ లోపల వినాయక నిమజ్జనం చేసుకోవలెను.
శుభం భూయాత్
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #vinayakanimajjanam #chandragrahanam #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి