శ్రావణంలో శనివారం ప్రత్యేకత



శ్రావణంలో శనివారం ప్రత్యేకత

శ్రావణమాసం అంటే శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణమాసం అంటారు.

ప్రస్తుతం విష్ణుమూర్తి కలియుగంలో కలిగా అవతరించే వరకు ఆయా రూపాలలో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించడానికి అవతరిస్తాడు. అలాంటి రూపాలలో అర్చామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీనివాసుడు అంటే శ్రీవేంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆయన నక్షత్రం శ్రవణం కావడం మరో విశేషం. 

కాబట్టి,  ఈ నెలలో వచ్చే శనివారాలలో, శ్రవణానక్షత్రం రోజులలో శ్రీవేకంటేశ్వరుని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయి. 

దీనికోసం పూర్వం నుంచి శ్రావణ శనివారాల వ్రతం, పూజ, ఉపవాసం తదితర ఆచారాలు మనదగ్గర ఏర్పడ్డాయి.

 ఈ మాసం లో వచ్చే శనివారాలలో ఇంటి ఇలవేల్పుని పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపొయినా, కనీస ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది. 

ముఖ్యంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వర ఆరాధన అత్యంత శక్తివంతం. శనివారాలలో స్వామికి పాయసం, రవ్వకేసరి వంటి తీపి పదార్థాలను ప్రసాదంగా సమర్పించండం, పిండి దీపాలతో స్వామిని ఆరాధించడం, ఉపవాసం ఉండటం వంటి ప్రత్యేక పూజల వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు.

చాలామంది తెలుగు ప్రజలు సంతానం లేని వారు సంతానం కోసం ఏడుకొండల వాడికి మొక్కుకునే ఆచారం ఉంది. తమ కోరిక తీరిన తర్వాత ఆ పిల్లలతో శ్రావణమాసంలో గోవిందం అంటే చిన్న ఇత్తడి లేదా రాగి పాత్ర/చెంబు పెట్టి మూడు లేదా ఐదు ఇండ్ల దగ్గర గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్లి బియ్యం తీసుకువచ్చి ఆ బియ్యంతో స్వామికి తియ్యని ప్రసాదం చేసి అందరికీ పంచడం, తామూ స్వీకరించండం వస్తుంది. ఇలా మూడు లేదా ఐదు ఏండ్లు పాటిస్తారు. ఇలా ఆయా ప్రాంతాలలో అనేక ఆచారాలు ఉన్నాయి.

శ్రావణ శనివారం శ్రీ వేంకటేశ్వర ఆరాధన వల్ల శనిబాధలు, ఈతి బాధలు పోతాయి. అంతే కాకుండా స్వామి అనుగ్రహంతో  కోరుకున్న కోరికలు నేరవేరుతాయి.


సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025