వినాయక చవితి - నవరాత్రోత్సవాలకు ఉన్న విశిష్టత ఏంటి.?

 


వినాయక చవితి - నవరాత్రోత్సవాలకు ఉన్న విశిష్టత ఏంటి.?

గణపతిని పూజిస్తే మూడు గ్రహాల అనుగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడి అనుగ్రహంతో విద్య, జ్ఞాన ప్రాప్తి, వ్యాపారాభివృద్ధి కలుగుతాయి. కుజగ్రహం అనుగ్రహంతో వివాహం, అన్యోన్య దాంపత్యం బాగుంటుంది. కేతుగ్రహం అనుగ్రహంతో మోక్షప్రాప్తి కలుగుతుంది. గణపతి ఆరాధనతో ఈ మూడు గ్రహాల అనుగ్రహం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. పార్వతీ తనయుడికి చేసే పూజలకు హిందూ పురాణాలు, సంప్రదాయంలో అంత ప్రాముఖ్యత ఉంది.
వినాయక చవితి పూజ పొరపాట్లు లేకుండా చేస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నారు పండితులు. పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమ బొట్టు పెడుతారు. పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరిస్తారు. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లుపోసి, పైన కొబ్బరికాయ, రవిక ఉంచి కలశం ఏర్పాటు చేస్తారు. ఓ పళ్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెడుతారు. దీపారాధన తర్వాత వినాయక మంత్రాలను ఉచ్ఛరిస్తూ పూజను చేస్తారు భక్తులు.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

#vinayakachavithi #navarathrulu #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025