దేవాలయాలలో ఎంత టెక్నాలజీ దాగి ఉందో తెలుసా?


 

దేవాలయాలలో ఎంత టెక్నాలజీ దాగి ఉందో తెలుసా.

సనాతన హిందూ సంప్రదాయంలో ఎంతో టెక్నాలజీ దాగి ఉంది. అందుకే మన పండితులు, పెద్దలు అనునిత్యం దేవాలయాలకు వెళ్లి రండి అని చెబుతూ ఉంటారు. వారు ఎందుకు అలా చెబుతారు. దాని వెనుక ఉన్న రహస్యాలేంటి.. అసలు అప్పట్లోనే దేవాలయాల్లో టెక్నాలజీ ఎలా వాడారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

తరంగాలు కలిసే చోట

మన భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్ మరియు విద్యుత్ అయస్కాంత తరంగాలు కలుస్తాయో అక్కడే దేవాలయం లోని మూల విరాట్ ఉంటుంది. వాటిని ఆలయాల్లో ప్రతిష్టించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు క్యాటలిస్టుగా పని చేస్తాయి...

దేవాలయ దర్శనం

 మనలో చాలా మంది దేవాలయాలకు వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే చాలా మంది అందరూ ఎడమవైపు నుండి (Clockwise Direction) ప్రదక్షిణలు చేస్తారు. ఎవ్వరూ అందుకు యాంటీక్లాక్ వైపు నుండి చేయరు. అలా ఎందుకు తిరుగుతారంటే.. అలా తిరిగినప్పుడు అక్కడే ఉండే తరంగాల శక్తి మన దేహానికి వస్తుందని చాలా మంది నమ్మకం. ఇవి మన బాడీలోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి...

మంత్రాలు

ప్రతి దేవాలయంలోనూ పూజారులు మంత్రాలను చదువుతూ ఉంటారు. అయితే ఈ మంత్రాలు ఎందుకు చదువుతారనే విషయం చాలా మందికి తెలియదు. పూజారులు మంత్రాలు ఎందుకు చదువుతారంటే.. అక్షర నియమంతో ఉండే మంత్రాలు ఒక లయగా ఉండి న్యూరాన్లను ఉత్తేజపరుస్తాయి...

బంగారానికి తరంగాలకు సంబంధం

 మనం దేవాలయాలకు వెళ్లేటప్పుడు మన పెద్దలు మంచి ఆభరణాలు వేసుకోమని చెబుతూ ఉంటారు. అయితే వీటి ద్వారా మన ఆడంబరాలను చూపించడానికి అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఎందుకంటే ఈ బంగారు ఆభరణాలు తరంగాలను బాగా గ్రహిస్తాయట...

గర్భగుడి

మన హిందూ దేవాలయాల్లో చాలా వాటికి గర్భగుడులు ఉంటాయి. ఈ గర్భగుడి ఎప్పుడూ ఒక వైపుకు మాత్రమే ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే గర్భగుడిలో ఎదురుగా ఉండకుండా ఒకవైపుకే ఉండాలని మన పెద్దలు చెబుతుంటారు.ఆదిత్యయోగీ.

తడిబట్టలు 

మనలో చాలా మంది దేవాలయాలకు తడి బట్టలతో వెళ్తుంటారు. దీన్ని మడి ఆచారం అని కూడా అంటూ ఉంటారు. సాధారణంగా తడి బట్టలకు ఆక్సీజన్ ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది. దీని వల్ల అనేక ఉపయోగాలు కూడా ఉన్నాయి...

హారతి

ప్రతి దేవాలయంలో భక్తులకు హారతి ఇస్తుంటారు. పచ్చకర్పూరానికి ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. హారతి తీసుకునేటప్పుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి. దీనిని ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని అంటారు. అయితే ఎక్కడో దూరంలో ఉండే హారతిని కళ్లకు అద్దుకుంటే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.

అభిషేకం.

ఇక మన దేవాలయాల్లో దేవుళ్లకు అభిషేకం చేసిన తర్వాత అది తీర్థం ఇస్తుంటారు. ఆ తీర్థంలో పచ్చకర్పూరం, తులసి, మరియు పంచామృతంతో పాటు అభిషేకం చేసిన వాటిని తీర్థంగా ఇస్తుంటారు. ఇంత ఆధునిక సాంకేతికత ఉన్న మన దేవాలయాలు మానసిక, శారీరక సుఖాన్ని అందిస్తాయి..

భగవంతుడు నిర్వికారుడు. ఆయనకి ఆకారం లేదు. నిరాకారుడిని ధ్యానించడం, పూజించడం సామాన్యుడికి సాధ్యం కాదు.. కనుక నిర్వికార బ్రహ్మను తపస్సు ద్వారా ఋషులు దర్శించి రూపకల్పన చేశారు. విశ్వశక్తిని కొన్ని బీజాక్షరాల ద్వారా యంత్రంలో నిక్షిప్తం చేసి విగ్రహం క్రింద ప్రతిష్టించి, దాని మీద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.  విశ్వశక్తి ఒకేచోట స్థిరంగా ఉండటం కోసం దేవాలయాల నిర్మాణం ఎక్కడ ఎలా ఏమి నిర్మించాలో, ఎలా నిర్మించాలో లెక్కించి, ఆగమ శాస్త్రం రచించారు. దానినే నేటికి దేవాలయాల నిర్మాణానికి వాడుతున్నారు.. దేవాలయంలో నాలుగు ప్రక్కలా బలిపీఠం ద్వారా ఆయా ప్రదేశాలలో ఉన్న అదృశ్య శక్తులకు, పక్షులకు ఆహారాన్ని మూడు పూటల అందిస్తున్నారు. 

అంతటి శక్తి కలిగిన దేవాలయాలలోకి ప్రవేశించగానే మనసులో ఒక రకమైన శాంతి లభిస్తుంది. కోరిన కోర్కెలు తీరుతున్నాయి. దైవం అంటే తెలియని సామాన్యులకు దైవ దర్శనం, దైవాన్ని దర్శించిన వారికి భక్తి, భక్తి కలిగిన వారికి ముక్తి లభించడం దేవాలయం యొక్క ముఖ్య లక్ష్యం. అలాంటి దేవాలయాన్ని నిర్మించడం ఎంత ముఖ్యమో, దానిని రక్షించడం కూడా అంతే ముఖ్యం. 

దైవం నాకు గుడి కావాలని అడగలేదు. మన కోసం మనమే నిర్మించున్నాం. మనమే కాపాడుకోవాలి. నాకోసం గుడి కట్టాడు అని కరుణించడం, నా గుడిని కూల్చాడు అని శపించడం దైవానికి సంబంధం లేదు. ఇంత సృష్టిని రక్షించే వాడికి గుడిని రక్షించుకోవడం తెలీదా! అని కొందరు మేధావులు వాదిస్తూ ఉంటారు. పరమాత్మ నాకోసం దేవాలయం కట్టమని చెప్పలేదు. కూల్చమని చెప్పలేదు.ఆదిత్యయోగీ.

కట్టినప్పుడు మంచి జరిగితే కూల్చినప్పుడు చెడు జరగదా అంటే జరుగుతుంది. అక్కడ ఉండే శక్తుల ప్రభావం ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. కానీ నిర్వికార బ్రహ్మ కు సంబంధం లేదు. అక్కడ ఏర్పాటు చేసిన శక్తి చెడు చేసిన వారిపై ప్రభావం చూపుతాయి. విద్యుత్ తీగలో శక్తి బయటికి కనబడదు. పట్టుకుంటే దాని ప్రభావంతో మృత్యువాత పడినట్లు, దేవాలయాలలో ఉండే అదృశ్య శక్తుల ప్రభావం వల్ల మంచి చెడు రెండు జరుగుతాయి.

ఈ సృష్టి మంచి చెడుల మిళితం. ఇది మంచి, ఇది చెడు అని చెప్పడానికి లేదు. మనకి అసలు అర్హత లేదు. ఇతరులకు ఇబ్బంది కలిగించకపోవడం మంచి, హాని కలిగించడం చెడు. రెండు సరిసమానంగా ఉంటేనే సృష్టి సవ్యంగా సాగుతుంది. అందుకే దేన్నీ పూర్తిగా తీయడం చేయడు పరమాత్మ. మూలాన్ని అంటే నాయకుడ్ని , వాడికి వత్తాసు పలికే బలవంతుల్ని మాత్రమే నాశనం చేస్తాడు. ఎందుకంటే సామాన్యుడు ఏది ఎక్కువగా ఉంటే అటే మొగ్గు చూపుతాడు. మంచి ఉంటే మంచి వైపు, చెడు సంస్కారం ఉంటే చెడు వైపు వెళతాడు. ఈ సృష్టిలో ఎవరికి ఏది కావాలంటే అది లభిస్తుంది. మంచివారికి ముక్తి లభించినట్లు, చెడ్డవాడికి జన్మ లభిస్తుంది. ముక్తిని అందరూ పొందడం ఎలా సాధ్యం కాదో చెడు చేయడం కూడా అందరికీ సాధ్యం కాదు. కానీ ఇక్కడ అందరూ జీవించాలి. పుట్టిన దగ్గర నుండి ఎవరి సంస్కారానికి తగ్గట్టు వారు బ్రతకాలి. ఇది సృష్టి నియమం. అందుకే అందరూ ఇక్కడ చెలామణి అవుతున్నారు..

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025