ప్రతి రోజూ ఒక భగవద్గీత శ్లోకం
భగవద్గీత
ప్రథమొధ్యాయః - అర్జున విషాద యోగము
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి ।
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ।। 4 ।।
ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ ।
పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ।। 5 ।।
యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ।
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ।। 6 ।।
ప్రతి పదార్ధ:
అత్ర — ఇక్కడ; శూరాః — శక్తివంతమైన యోధులు; మహా-ఇశు-ఆసాః — గొప్ప ధనుర్ధారులు; భీమ-అర్జున-సమాః — భీముడు-అర్జునుడులతో సమానమైన; యుధి — యుద్ధ విద్యలో; యుయుధానః — యుయుధానుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; ద్రుపదః — ద్రుపదుడు; చ — మరియు; మహా-రథః — పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు; ధృష్టకేతు — ధృష్టకేతుడు; చేకితానః — చేకితానుడు; కాశిరాజః — కాశీరాజు; చ — మరియు; వీర్య-వాన్ — వీరోచిత; పురుజిత్ — పురుజితుడు; కుంతిభోజః — కుంతిభోజుడు; చ — మరియు; శైబ్యః — శైబ్యుడు; చ — మరియు; నర-పుంగవః — ఉత్తమ పురుషులు; యుధామన్యుః — యుధామన్యుడు; చ — మరియు; విక్రాంత — ధైర్యవంతుడైన; ఉత్తమౌజాః — ఉత్తమౌజుడు; చ — మరియు; వీర్య-వాన్ — వీరుడైన; సౌభద్రః — సుభద్ర కుమారుడు; ద్రౌపదేయాః — ద్రౌపది పుత్రులు; చ — మరియు; సర్వే — అందరును; ఏవ — నిజంగా; మహా-రథాః — పదివేలమంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు
తాత్పర్యము :
వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి - యుయుధానుడు, విరాటుడు, మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు - వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా, ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు, వీరందరూ శ్రేష్ఠమైన యుద్ధ వీరులే.
వివరణ :
రాబోయే పెను విపత్తు భయానికి, దుర్యోధనుడికి, పాండవులు సమీకరించిన సైన్యం, ఉన్న దాని కన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది. తన ఆందోళనని వ్యక్తం చేస్తూ, పాండవుల పక్షంలోనున్న మహారథులను (పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న ఒక్కో యోధులు) చూపాడు. పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చేవారే.
సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి