సాధన ఎలా సాగించాలి? సంఘర్షణలను ఎలా అధిగమించవచ్చు?

 


సాధన ఎలా సాగించాలి? సంఘర్షణలను ఎలా అధిగమించవచ్చు?

అహంకారమంటే అదొక స్థితి కాదు, దేహస్మృతి. ఈ శరీరమనోబుద్ధులే నేను అనుకోవటం అహంకారం. అహంకు ఇహం పర మనేది తెలియదు. తెలుస్తుందల్లా అహంకారం మాత్రమే. రాయిని చెక్కి దైవమును చూసే మనం, మనిషిలో దైవమును చూడలేకపోతున్నది ఈ అహంకారం వలననే. అహంకారమనేది సకలవాసనల సమూహము. అహంకారమున్నంతవరకు చావుపుట్టుకలు తప్పవు. శరీరం ఖననమైనా స్వభావం ఖననమవ్వదు. అహంకారమనేది అనేక జన్మలనుండి జీవుడిని పెనవేసుకుని వున్నది. అనేకజన్మల అహంకారాన్ని నిశ్శేషంగా నాశనము చేయడం శీఘ్రంగా సాధ్యం కాదు. స్వార్ధ రహిత, ఫలాపేక్ష రహిత, వాంఛ రహిత కార్యములు నిర్వహించుటవలన అహంకారం తొలగుతుంది. భగవంతుని పాదాలను భక్తితో ఆశ్రయిస్తే వాసనలు తగ్గుతాయి. మాటకి మాట, చేతకి చేత అనే భావన మనలో లేకుంటే ఎవరి మాటల్ని చేతల్ని పట్టించుకోము. ఈ ఉదాసీనత స్థిరచిత్తంకు దర్పణం. ఆలోచనలు, అలవాట్లు మారితే మనస్సు నెమ్మదిస్తుంది. అహంకారం నశిస్తుంది. మానవ సంబంధాల్లో ఏర్పడే అంతరాలకు, అపార్ధాలకు అహంకారం కారణంగా నిలుస్తుంది. అహంకారంపోతే మానవ సంబంధాలూ... ప్రపంచంతో మన సంబంధ బాంధవ్యాలూ... బాగుండటమే కాదు దైవానుబంధంగా శోభిల్లుతాయి.    

అలానే మనలో అహంకారం తగ్గించే మరో శక్తివంతమైన సాధన ఏంటంటే ఇతరుల అహంకారమునకు ప్రతిస్పందించకపోవడం. 

భగవంతునికి మనకి రెండు అడుగుల దూరమే. నేను, నాది - అహంకారం, మమకారం. ఆ రెండు అడుగులు దాటామో .... జీవన్ముక్తులమే అంటారు పెద్దలు.                                                          

మనం తూర్పుదిక్కుకు వెళ్లేకొద్దీ పడమరకు మరింత దూరం అవుతాం కదా. అలాగే మన మనస్సును బుద్ధిని ఎంత మంచిగా మలచుకుంటామో, అంతగా అహంకారం అణుగుతుంది, అరిషడ్వర్గాలు తగ్గుతాయి, అంతరశుద్ధి అవుతుంది, అంతర్యామికి చేరువవుతాం.      

సాధకులకు అంతరంగిక స్వీయ నియమం, విచక్షణ  అతిముఖ్యం. సర్వులకు శ్రేయస్సు చేకూర్చాలన్న ఆలోచన మనస్సులోను, సత్యాన్నే పలుకాలనే ఆలోచన వాక్కులోను, ధర్మాన్నే ఆచరించాలనే ఆలోచన కర్మలోను అలవర్చుకుంటూ, సర్వాత్మ భావన అంతరంలో నిలుపుకుంటే చాలు. ఈ భావం బలపడితే మనస్సు స్థిరమౌతుంది. మనస్సు స్థిరమైతే వాక్కు సత్యమౌతుంది. వాక్కు సత్యమైతే చేతలు శుద్ధమవుతాయి. తద్వారా పవిత్రత ప్రవహిస్తుంది. 

సాధకులు చలించని మనస్సును, భ్రమించని దృష్టిని కల్గియుంటూ, వ్యవహారికంలో పూర్తి భావజాగృతిలో శ్రద్ధగా ఉంటూ, ప్రతీక్షణం ప్రతీ చిన్నపనిలో కూడా నాచే, ఇది భగవంతుడే చేయిస్తున్నాడన్న భావనతో ఎరుకలో ఉండగలిగినప్పుడే చిత్తశుద్ధి కల్గుతుంది. ఇది  అలవడాలంటే అందుకు కావాల్సింది వివేకం (నిత్యానిత్యవస్తు వివేకం), విరాగం. శ్రద్ధ వివేకము, విరాగంలు అలవడితే గాని విషయాసక్తి నుండి విడుదల పొందలేము. అవగాహనను పెంపొందించుకోలేం. అంతవరకు అర్ధంకాని బోధనలతో విబేధం తప్పదు. అవగాహన అవ్వనంతవరకు ఆవేదన తప్పదు.                                                  

ఆధ్యాత్మిక జీవితం, ప్ర్రాపంచిక జీవితం అని రెండు వేరు వేరు జీవితాలు ఉండవు. మన జీవన విధానంలోనే రెండూ ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవనం సాగించాలని తలపే జీవితంలో ఓ మలువు. మన సంసార ధర్మాలను, ప్రాపంచిక బాధ్యతలను నిర్వర్తిస్తూ మన దైనందిక కార్యక్రమాలలో ఆధ్యాత్మిక సాధన ఓ అంతర్భాగమైనట్లు అనుసంధానం చేసుకోవాలి. ఏ బంధమూ, ఏ బాంధవ్యమూ ఆత్మవిచారణకు ప్రతిబంధకం కాదు. వాటిని కొనసాగిస్తూ మానసికంగా అన్నింటికీ అతీతమౌతూ ఆత్మకు చేరువ కావాలి. మనోశుద్ధత, నిరాహంకార సాధనలతో ముందుకు సాగాలి. అంతరంగ వివేచనతో సాధన చేస్తే క్రమక్రమంగా ప్రాపంచిక లాలస తగ్గుతుంది. ఏదీ కొద్ది రోజుల్లోసాధ్యం కాదు.  సద్గురువులు, సత్సంగాలు ఊతం ఇస్తాయి. క్రమేణా కాస్త కాస్త ఆధ్యాత్మిక జీవనం గురించి అవగాహన ఏర్పడుతుంది.                                                                                                  

ఈ గమనంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, ఆనందాలు, ఆవేదనలు, సమస్యలు, సంఘర్షణలు, అనుభవాలు, అయోమయాలు..... అన్నీ ప్రాపంచిక జీవితానికి అన్వయింపబడి అగమ్యగోచరంగా, అలజడిగా అనిపించినా, ఎంతో అంతర్మధనం జరుగుతున్నా, ఇవన్నీ పారమార్ధిక జీవనంలో వైరాగ్యాన్ని, వివేకాన్ని, భక్తిని, పరమాత్మునిపై పరమప్రేమను పరిక్షించడానికి ఈశ్వరుడు పెట్టే పరీక్షలుగా భావించి సంకల్పమును చెదరనీయక, క్రుంగక, ప్రయత్నం వీడక ఫలితం ఆశించక, పయనం ఆపక, మరింత శ్రద్ధతో, పట్టుదలతో, సంయమనంతో, సమర్ధవంతంగా, ధీశాలిగా ముందుకు పోవడమే సరైన సాధనని ఆధ్యాత్మిక అనుభవజ్ఞుల సూచన. అనేక పరీక్షలు నెగ్గి సాధన చేస్తేగానీ అంతఃకరణ శుద్ధి కాదు. ఎవరికి వారే వారివారి సంస్కారముల ఆధారంగా సాధనామార్గంలను అనుష్టించి ఆత్మసాక్షాత్కారం కలిగేంతవరకు నిర్విరామ సాధన చేయాలి. అప్పుడే భవం నుండి భవ్యం వైపు వెళ్ళగలరు.

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025