శ్రావణ మాసంలో వచ్చే పవిత్ర ఏకాదశి
శ్రావణ మాసంలో వచ్చే పవిత్ర ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. సంతానం లేని దంపతులు భక్తి శ్రద్ధలతో, నిష్టతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని విశ్వాసం. అయితే ఈసారి ఈ ఏకాదశి ఏ తేదీన వచ్చింది.. ఎలాంటి నియమాలు, పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం..
హిందు సంప్రదాయంలో ఏకాదశికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అందులోను పుత్రదా ఏకాదశి ని మరింత విశేషమైనదిగా, పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఉపవాసం ఏడాదిలో రెండుసార్లు ఆచరించస్తారు. శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రాద ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి సంతానం కోసం శ్రీ మహావిష్ణువును పూజించే పవిత్రమైన రోజు. సంతానం లేని దంపతులు ఈ పుత్రదా ఏకాదశి ని ఆచరించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. ఈ పుత్రదా ఏకాదశి విశిష్టత గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పినట్లు పురాణ కథ.
ఈ ఆగస్టు నెల శ్రావణ మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశి తిథి 2025 ఆగస్టు 04వ తేదీ ఉదయం 11:41 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఏకాదశి తిథి 2025 ఆగస్టు 05వ తేదీ మధ్యాహ్నం 01:12 గంటల వరకు ఉంటుంది. అయితే.. హిందు సంప్రదాయంలో ఉదయ తిథి ప్రకారం ఏ పండుగనైనా నిర్వహిస్తారు. కాబట్టి ఉదయం తిథి ప్రకారం ఆగస్టు 5వ తేదీ మంగళవారం (Tuesday) రోజు పుత్రదా ఏకాదశి ఉపవాసం, పూజ ఆచరిస్తారు. ఈరోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

ఏకాదశి వ్రత నియమాలు :
ఆ తర్వాత ఆగస్టు 6వ తేదీ అంటే ద్వాదశ తిథి రోజు ఉదయం 5.45 గంటల నుంచి 8.30 గంటల మధ్య ఉపవాసం విరమించాలి. ఇప్పుడు బ్రహ్మణులకు భోజనం పెట్టి, దానం చేసి ఆ తర్వాత భోజనం చేయాలి. ఇలా భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. పుత్ర ఆనందం పొందడానికి ఈ పుత్రదా ఏకాదశి ఉపవాసం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఈ ఉపవాసం పాటించడం ద్వారా కోరికలు నెరవేరుతాయి. మోక్షం కూడా లభిస్తుందని భక్తుల విశ్వాసం.
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #ekadashi #pavitraekadashi #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి