పరివర్తిని ఏకాదశి వేళ మీ రాశిని బట్టి వీటిని దానం చేస్తే.. సమస్యలన్నీ తొలగిపోతాయి.

 


పరివర్తిని ఏకాదశి వేళ మీ రాశిని బట్టి వీటిని దానం చేస్తే.. సమస్యలన్నీ తొలగిపోతాయి.

జ్యోతిష్య ప్రకారం, పరివర్తిని ఏకాదశి వేళ ద్వాదశ రాశుల వారు కొన్ని వస్తువులను దానం చేస్తే ప్రతి సమస్య తొలగిపోతుందట. ఈ సందర్భంగా ఏ రాశి వారు ఏమి దానం చేస్తే శుభ ఫలితాలొస్తాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Parivartini Ekadashi 2025 హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్షంలో ఏర్పడే ఏకాదశిని పరివర్తిని ఏకాదశి, పద్మ ఏకాదశి, వామన ఏకాదశి అని అంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 03 సెప్టెంబర్ 2025 బుధవారం రోజున పరివర్తిని ఏకాదశి వచ్చింది. అంతేకాదు ఈ ఏకాదశి వేళ చాతుర్మాసం కారణంగా శ్రీ మహా విష్ణువు కూడా యోగ నిద్రలోకి ఉంటాడని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున దానధర్మాలు చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం, ఏ రాశి వారు ఏయే వస్తువులను దానం చేస్తే, శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందుతారు.. సమస్యల నుంచి విముక్తి పొందుతారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి

ఎరుపు రంగు పండ్లు, పువ్వులు లేదా బట్టలు తదితర వాటిని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శ్రీ విష్ణువు అనుగ్రహం పొందుతారు.

వృషభ రాశి

శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందడానికి పేదలకు మీ శక్తి, సామర్థ్యాల మేరకు పాలు, మజ్జీగ, లస్సీ తదితర వాటిని దానం చేయాలి.

మిథున రాశి

మిథున రాశి వారు పద్మ ఏకాదశి వేళ ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయాలి.అలాగే గోశాలకు వెళ్లి పచ్చని గడ్డి దానం చేయొచ్చు. వివాహిత మహిళలకు ఆకుపచ్చ రంగు గాజులను దానం చేయాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారు పరివర్తిని ఏకాదశి వేళ బియ్యం, చక్కెర, మిఠాయి, పాలు, తెల్లని స్వీట్లు, తెల్లని దుస్తులు, తెల్లని వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

సింహ రాశి

సింహ రాశి వారు పరివర్తిని ఏకాదశి వేళ ఎర్రని పప్పు, బెల్లం, తేనే తదితర వస్తువులను దానం చేయాలి.

కన్య రాశి

కన్య రాశి వారు ఏకాదశి వేళ ఆకుపచ్చని బట్టలు, ఆకుపచ్చని రంగులో ఉండే పండ్లు లేదా కూరగాయలు దానం చేయాలి.

తులా రాశి

తులా రాశి వారు శ్రీ మహా విష్ణువు ఆశీస్సులు పొందడానికి పరివర్తిని ఏకాదశి వేళ పేదలకు ఆహార ధాన్యాలు దానం చేయాలి. మీ శక్తి, సామర్థ్యాల మేరకు వెండిని కూడా దానం చేయొచ్చు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు పరివర్తన ఏకాదశి వేళ ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి దేవ గురువు అధిపతిగా ఉంటాడు కాబట్టి, పరివర్తిని ఏకాదశి వేళ పసుపు రంగులో ఉండే పండ్లు, గంధం వంటి వాటిని దానం చేయాలి.

మకర రాశి

మకర రాశి వారు పరివర్తిని ఏకాదశి వేళ ఆకలితో ఉన్నవారికి, పేదలకు అన్నదానం చేయాలి. మీ శక్తి, సామర్థ్యం మేరకు దుప్పట్లు లేదా బట్టలు దానం చేయాలి.

కుంభ రాశి

కుంభ రాశి వారు పరివర్తిని ఏకాదశి వేళ తమ శక్తి, సామర్థ్యం మేరకు డబ్బు, పండ్లు, ఆహారం తదితర వాటిని దానం చేయొచ్చు.

మీన రాశి

మీన రాశి వారు విష్ణువు అనుగ్రహం పొందడానికి పరివర్తిని ఏకాదశి పండ్లు లేదా లడ్డూ దానం చేయాలి.

    సర్వేజనా సుఖినో భవంతు 

    శుభమస్తు
    1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

      జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

      HAVANIJAAA
      (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
      శ్రీ విధాత పీఠం
      Ph. no: 
      9542665536

    2. #parivartiniekadashi #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025