ఏ తిథులలో ఏ దేవతాపూజలు శుభం


 ఏ తిథులలో ఏ దేవతాపూజలు శుభం

తిథి నిర్ణయ వివరాలు క్లుప్తంగా

యాంతిథింసమను ప్రాప్య యాత్యస్తం పద్మినీ పతిః౹ 

సాతిథిః తద్దినే ప్రోక్తా త్రిముహూర్తైవయాభవేత్ || ఇతి స్కాన్తోక్తేః।

దీపికాయామపి 'త్రిముహూర్తగాతు సకలా సాయం' ఇతి యానితు- 

వ్రతోపవాస స్నానాదౌ ఘటికైకాపియా భవేత్౹ ఉదయేసాతిథిర్ గ్రాహ్యా విపరీతాతు పైతృకే ॥ 

ఇత్యాదీని స్కాన్దాది వచనాని

సూర్యుడు ఏ తిథిలోకి ఉదయించి మరియు అస్తమిస్తాడో, ఆ తిథి ఆ రోజు అని గ్రహించాలి. ఆ తిథి త్రిముహూర్తముల కాలమున్నా అని స్కాంద వచనం. దీపికయందు కూడా ఏ తిథి సాయంకాలమందు మూడు ముహూర్తముల కాలం ఉంటుందో అదే మొత్తము అని.

ఇక వ్రత ఉపవాస స్నానాదులందు ఉదయమందలి ఘడియ కాలముండే తిథినే గ్రహించాలి,

 పితృకర్మలలో  మధ్యాహ్న వ్యాప్తి ఉన్నవి  గ్రహించాలి.  నిర్ణయం ఘడియ కాలాలను బట్టి వేరుగా ఉంటుంది.

తత్ర సర్వాతిథిః యదహః కర్మకాల వ్యాపినీ, సైవగ్రాహ్యా కర్మణో యస్యయః కాలః తత్కాలవ్యాపినీ తిథిః.

తయా కర్మాణి కుర్వత హాసవృద్దిన కారణం॥ 

ఇతి విష్ణు ధర్మోక్తేః. 

దినద్వయేతద్వ్యాప్తౌ ఏక దేశ వ్యాప్తా వా యుగ్మ వాక్యాన్నిర్ణయః 

కర్మకాల వ్యాపియైన తిథినే ఆ రోజు తిథిగా గ్రహించాలి. ఏకర్మ చేయటానికి ఏది కాలమని చెప్పబడి ఉందో ఆ కాల వ్యాపియైనది ఏ తిథో ఆ తిథిలోనే కర్మలు చేయాలి. తిథి యొక్క హ్రాస, వృద్ధులు కారణం గాదు అని విష్ణు ధర్మోక్తి. ఆ తిధి రెండు రోజులు వ్యాప్తిచెందినా, ఏకదేశంలో (ఒకే రోజు) వ్యాప్తి చెందిన యుగ్మ వాక్యాన్ననుసరించి నిర్ణయం చేయాలి.

యాంతిథింసమను ప్రాప్య ఉదయంయాతి భాస్కరః౹

సాతిథిఃసకలాజ్ఞేయా దానాధ్యయన కర్మసు||

దాన,అధ్యయన కర్మలందు ఉదయకాలమందు సూర్యుడు ఏ తిథిలో ఉన్నాడో ఆ తిథిని గ్రహించాలి

ఇక తిథుల లో ఏ దేవతా పూజలు చేసిన శుభము తెలుసు కుందాము-

పాడ్యమి

సదా వహ్నిం ప్రతిపది పూజయిష్యంతి యే నరా:|

హృతద్రవ్యైశ్చ హుత్వా తం దుగ్ధహారా ప్రతే రతా:|

ఉపోషణం కరిష్యంతి తైశ్చ దేవాః సహేశ్వరా:|

తోషితాస్తే సదా తేభ్యో దాస్యంతి మనసీప్సితం|

బ్రహ్మార్పణ స్వభావేన గమిష్యంతి మదాత్మని.|

పాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ పాడ్యమి

నాడు అగ్నిదేవుని హోమాదులచే (లేదా దీపమునందు)మంది ఆరాధించడం వలన దేవతలందరు సంతోషించి మనసులో కోరుకున్నవి తీరుస్తారు. బ్రహ్మార్పణ భావంతో చేస్తే మోక్షాన్ని పొందుతారు.

విదియ

ద్వితీయాయాం నరో యస్తు పూజయేదశ్వినౌ శుభౌ|

పత్రాహారసమాయుక్తో రూపవాన్ జాయతే కిల|

బ్రహ్మార్పణస్వభావేన ద్వితీయా వ్రతమాచరేత్|

సస్వానందే మదీయే వై లీనశ్చైవ భవిష్యతి|

శాకములను మాత్రమే ఆహారంగా స్వీకరించి

విదియనాడు అశ్వినీదేవతలను పూజించడం వలన సౌందర్యం, ఆరోగ్యం కలుగుతాయి. బ్రహ్మార్పణం భావంతో చేస్తే ఇష్టదైవలోకాన్ని చేరి దైవంలో లీనమవుతారు.

తదియ

తృతీయాయాం మహాశక్తిం పూజయేద్భక్తి సంయుతః|

సర్వైః సౌభాగ్యదైః ద్రవ్యైః లవణాహారవర్జితః|

స శక్తిలోకగో భూత్వా భోగయుక్తో భవిష్యతి|

బ్రహ్మార్పణతయా సోపి మల్లోకే చాగమిష్యతి|

తదియ నాడు ఉప్పు లేని ఆహారం స్వీకరిస్తూ శక్తి

ఆరాధన చెయ్యడం వల్ల సకల సౌభాగ్యాలు పొంది

శక్తి లోకాన్ని పొందుతారు.

చవితి

చతుర్ధ్యాo శుక్లపక్షశ్చ స్థితాయాం సర్వదా జనాః|

నిరాహారేణ మాం తత్ర త్వద్యుక్తం పర్యుపాసతే|

చతుర్విధం ఫలం తైశ్చ సంప్రాప్తం నాత్ర సంశయః|

యద్యదిచ్ఛతి తత్తత్ స లభతే వ్రతకారకః|

అంతే స్వానందగో భూత్వా సాయుజ్యం బ్రహ్మణస్తథా|

నిరాహారులై చవితినాడు గణపతిని పూజించడం వల్ల

ఏ ఏ కోరికలు కోరుకుంటే అవి లభించడమే కాక

ధర్మార్థకామమోక్షాలను కూడా పొందుతారు.

పంచమి

పంచమ్యాం నాగముఖ్యాంశ్చ దుగ్ధేన స్నాపయేన్నరః|

పూజయేత్తాన్ ప్రయత్నేన నిరమ్లాహారకారకః|

స నాగలోకగో భూత్వా భోగయుక్తశ్చరిష్యతి| నిష్కామేన మదీయే వై లోకేంతే ఆగమిష్యతి|

పంచమి నాడు పులుపు పదార్థాలను విడిచిపెట్టి,

నాగదేవతలను పాలతో అభిషేకించడం మొదలైన

ఉపచారాలతో పూజించడం వలన నాగలోకంలో

భోగభాగ్యాలను అనుభవిస్తారు. నిష్కామంగా

చేయడం వల్ల ఇష్టదైవ లోకాన్ని పొందుతారు.

షష్ఠి

షష్ఠియాం స్కందం ఫలాహారః పూజయేద్భక్తిసంయుతః|

స్కందలోకే చరేత్ సోపి మహాభోగపరాయణ:|

నిష్కామభావయుక్తశ్చేత్ స్వానందం2 తే గమిష్యతి|

పండ్లను మాత్రమే ఆహారంగా గ్రహిస్తూ షష్ఠి నాడు

సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వల్ల ఇహలోకంలో మహాభోగాలను అనుభవించి, అంతమునందు స్కందలోకాన్ని చేరుకుంటారు.

సప్తమి

సప్తమ్యామర్చయేత్ సూర్యం ఉపోషణ పరాయణః|

సూర్యలోకమాశ్రిత్య ప్రచరేత్ భోగసంయుతః|

నిష్కామవ్రతకారీ చేన్ మహాలయసముత్థితే|

స్వానందే మే సదేహో వై బ్రహ్మభూతో భవిష్యతి|

ఉపవాసవ్రతం తో సప్తమి నాడు సూర్యుడు ఆరాధించడం పూజవల్ల భోగాలు అనుభవించి సూర్యలోకాన్ని చేరి, క్రమంగా ఇష్టదైవలోకంలో ప్రవేశించి ఆ దైవంలో లీనమవుతారు.

అష్టమి

అష్టమ్యాం మాతృకానాం యః పూజకో భావసంయుతః|

బిల్వాహారసమాయుక్తో మాతృగా లోకగో భవేత్

మదర్పణ స్వభావేన సదా వ్రతపరాయణః|

అష్టమ్యాం సోపి మల్లోకే గచ్చేత్ క్రమవినిశ్చితే|

అష్టమినాడు మారేడు(పండ్ల రసాన్ని)జలాన్ని సేవిస్తూ అష్టమాతృకలను భక్తిగా పూజించినవారు

అష్టమాతృకాలోకాన్ని పొందుతారు. వారి ఇష్టదైవానికి ఈ వ్రత సమర్పణ చెయ్యడం వల్ల ఆ లోకాన్ని చేరగలరు.

నవమి

నవమ్యామేవ దుర్గాయా:పూజనం యః సమాచరేత్|

పిష్టాశీ భోగసంయుక్తోంతే తల్లోకమవాప్నుయాత్|

చలిమిడి ఆహారంగా తీసుకుని, నవమినాడు

దుర్గాదేవిని పూజించడం వల్ల దుర్గాలోకాన్ని

పొందుతారు.

దశమి

దశమ్యాం వ్రతసంస్థో యో దధిభక్షణసంయుతః|

దిశాం దిగీశకానాం వై పూజకస్తత్ప్రియో భవేత్|

ఇహ భుక్త్వా ఖిలాన్ భోగానంతే తల్లోకమాప్నుయాత్|

నిష్కామ వ్రత భావేన బ్రహ్మభూతో భవిష్యతి|

దశమి నాడు పెరుగు ఆహారంగా సేవిస్తూ,

దిగ్దేవతలను ఆరాధించడం వల్ల వారు ప్రీతిచెంది పూజించినవారిని సర్వ దిక్కుల నుండి అనుగ్రహించడం వల్ల అనేక భోగాలు పొంది ఆయా లోకాలను చేరుతారు. నిష్కామంగా చెయ్యడం వల్ల మోక్షాన్ని పొందగలరు.

ఏకాదశి

ఏకాదశ్యాం నరో భక్షేద్వహ్నిపక్వవివర్జితం|

ధనపం పూజయేచ్చైవ భక్తియుక్తేన చేతసా|

స వై తస్య వసేల్లోకే నానాభోగకరః సదా|

బ్రహ్మార్పణతయా తద్వ్రతం కృత్వా సుఖీ భవేత్|

అగ్నిసంయోగంతో వండిన పదార్థాలు తినకుండా

కుబేరుని ఏకాదశినాడు భక్తిగా సేవించడం వల్ల

నానావిధాలైన భోగాలనుభవించి, కుబేరలోకంలో

ఆనందంగా విహరించగలరు. ఈ వ్రతాన్ని

బ్రహ్మార్పణంగా చెయ్యడం వల్ల ఇష్టదేవతాలోకాన్ని

పొందగలరు.

ద్వాదశి

విష్ణుం సంపూజయేత్ యో వై ద్వాదశ్యాం ఘృతభోజనః|

స వికుంఠే వసేన్నిత్యం నానాభోగపరాయణః|

బ్రహ్మార్పణ విధానేన కుర్యాద్యదా నరః|

మహాలయే మదీయే స లోకే బ్రహ్మమయో భవేత్|

ద్వాదశినాడు నేతితో చేసిన పదార్థాలను ఆహారంగా తీసుకుని, విష్ణువును పూజించడం వల్ల ఇహలోకంలో సకల సౌభాగ్యాలు పొంది అంతమునందు వైకుంఠాన్ని చేరుకుంటారు, బ్రహ్మార్పణం భావంతో చేసినవారు మోక్షాన్ని పొందుతారు.

త్రయోదశి

ధర్మం త్రయోదశి సంస్థం పూజయేత్ క్షీరభోజనః| 

సధర్మలోకగో భూత్వా భుంజీత వివిధం సుఖం |

బ్రహ్మార్పణతయా యేన సాధితా చేత త్రయోదశీ|

సస్వానందే సమాగమ్య బ్రహ్మభూతో భవిష్యతి|

పాలతో వండిన ఆహారాన్ని గ్రహించి,

త్రయోదశినాడు యమధర్మరాజును పూజించడం వల్ల సుఖమయ జీవితాన్ని గడిపి, యమయాతనలు లేకుండా ఆ లోకంలో భోగాలను పొందుతారు. బ్రహ్మార్పణ బుద్దితో ఈ వ్రతాన్ని ఆచరించినవారు మోక్షాన్ని పొందగలరు.

చతుర్దశి

చతుర్దశ్యాం శివం యశ్చ పూజయేత్ భక్తిసంయుతః|

ఉపోషణసమాయుక్తో గోధూమాన్నేన పారణం

కరిష్యతి చ కైలాసే వాసస్తస్య భవిష్యతి| నిష్కామశ్చేత్తదంతే స మల్లోకే మన్మయో భవేత్|

చతుర్దశి నాడు గోధుమలతో చేసిన పదార్థాలను స్వీకరించి, భక్తిగా శివుని పూజించినవారు సకల కామ్యములు సిద్దింపజేసుకుని కైలాసవాసాన్ని పొందుతారు.

పూర్ణిమ

పూర్ణిమాయాం దేవగణాన్ దేవాంశ్చంద్రమసం తథా|

పూజయేద్భక్తిభావేన చంద్రలోకం స ఆప్నుయాన్|

ఇహ భుక్త్వా ఖిలాన్ భోగాన్ అంతే దేవాన్ గమిష్యతి|

ఉపోషణ సమాయుక్తోర్ఘ్యదానం యః కరిష్యతి| చంద్రాయ నిశిభుక్ వా పి సర్వదేవపరాయణ|

సర్వదేవమయీ రమ్యా పూర్ణిమా పరికీర్తితా|

సకలదేవమయమైన పూర్ణిమనాడు ఉపవాసము చేసి చంద్రునకు అర్ఘ్యము మొదలైన వాటితో పూజించడం వల్ల దేవతలందరి అనుగ్రహం కలిగి, సకల భోగాలను అనుభవించి ,చంద్రలోకాన్ని చేరుకుంటారు,బ్రహ్మార్పణంగా చెయ్యడం వల్ల మోక్షాన్ని కూడా పొందగలరు.

అమావాస్య

అమాయాం తర్పయేద్యో వై పితృాన్ పితృపరాయణ|

ఉపోషణం వా కుర్వీత స సర్వార్థమవాప్నుయాత్|

అంతే పితృమయే లోకే వసతిస్తస్య సంభవేత్|

ఆగమిష్యతి నిష్కామశ్చేత్ స్వానందే స తల్లయే|

అమావాస్యనాడు పితృదేవతలను ఉద్దేశించి భక్తిగా

తర్పణాలు/ఉపవాసము మొదలైన వాటిని ఆచరించడం వల్ల అన్ని ప్రయోజనాలు సిద్ధించడమే కాక పితృలోకాన్ని చేరుతారు. నిష్కామంగా చెయ్యడం వల్ల స్వాత్మానంద స్థితి అయిన మోక్షాన్ని పొందుతారు.

సర్వేజనా సుఖినో భవంతు 

    శుభమస్తు
    1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

      జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

      HAVANIJAAA

      (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit),

      MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

    2. శ్రీ విధాత పీఠం
      Ph. no: 
      9542665536

  1. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025