మహాలయ పక్షముల సందర్భంగా - పితృ దేవతా స్తుతి
పితృ దేవతా స్తుతి
(మహాలయ పక్షముల సందర్భంగా...)
[ బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్తుతి]
ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు. ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పుచేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రము చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అంతేకాక పితృదేవతలు చదివినవారిని అనుగ్రహిస్తారు. దీనిని ఎవరైతే వారి పుట్టిన రోజునాడు తండ్రికి నమస్కరించి వారి వద్ద చదువుతారో వారికి పితరుల అనుగ్రహం లభిస్తుంది.
బ్రహ్మఉవాచ:
1. నమో పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ!
సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే!!
ఎవరివలన ఈ జన్మవచ్చినదో, ఎవరు సకల దేవతా స్వరూపులో, ఎవరి ఆశీస్సులవల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు.
2. సర్వయజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే!
సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ!!
సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమాన మైనవారు సకల పుణ్యతీర్ధములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితరులకు నమస్కారములు.
3.నమో సదా ఆశుతోషాయ శివరూపాయ తే నమః!
సదా౬పరాధక్షమినే సుఖాయ సుఖదాయ చ!!
సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివ రూపులకు నమస్కారము. ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు.
4.దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మాయా వపుః!
సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః!!
ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించినదో ఆ పితృదేవతలకు నమస్కారములు.
5.తీర్ధస్నాన తపో హోమ జపాదీన్ యస్య దర్శనం!
మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః!!
ఎవరిని చూసినంతనే అనేక తీర్థస్నానములు, తపస్సులు, హోమాలు, జపములు చేసిన ఫలితం కలుగునో మహా గురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు.
6.యస్య ప్రణామస్తవనాత్ కోటిశః పితృతర్పణం!
అశ్వమేధ శతైః తుల్యం తస్మై పిత్రే నమో నమః!!
ఎవరిని నమస్కరించినా, తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారములు.
ఫలశృతి:
ఇదం స్తోత్రం పితృః పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః
ప్రత్యహం ప్రాతురుత్థాయ పితృశ్రాద్ధదినోపి చ
స్వజన్మదివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపివా
న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞత్వాది వాంఛితం
నానాపకర్మకృత్వాపి యఃస్తౌతి పితరం సుతః
సధృవం ప్రవిధాయైవ ప్రాయశ్చిత్తం సుఖీభవేత్
పితృప్రీతికరైర్నిత్యం సర్వకర్మాణ్యధార్హతి
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536
#pitrudevathasthuti #mahalayapaksham #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి