బతుకమ్మ పండుగలో "ముద్దపప్పు బతుకమ్మ"

 


బతుకమ్మ పండుగలో "ముద్దపప్పు బతుకమ్మ"

మూడో రోజు ఆశ్వయుజ విదియ నాడు 'ముద్దపప్పు బతుకమ్మ'గా పూజిస్తారు. ఇవాళ ముద్దపప్పు , పాలు , బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు.

ఇవాళ తామర పాత్రల్లో మూడంతరాలలో చామంతి , సీతమ్మజడ , రామబాణం , మందార పూలతో బతుకమ్మను పేరుస్తారు. శిఖరంపై పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. ఉదయం పూజలు చేస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యం , బోగభాగ్యాలు కలుగుతాయని తెలంగాణ ప్రజల విశ్వాసం.

బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..

విశాలమైన ప్రదేశంలో తొలుత వెంపలి చెట్టును నాటి... దానిపై పసుపు కుంకుమను చల్లుతారు. అనంతరం బతుకమ్మలను ఆ చెట్టు చుట్టూ ఉంచుతారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని కోలాటాలు చేస్తారు. మరికొందరు చేతిలో రెండు కర్రలను పట్టుకొని కోలాటం చేస్తారు. 

బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...., ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్కజాములాయే చందమామ... , పసుపుల పుట్టింది గౌరమ్మా... పసుపుల పెరిగింది గౌరమ్మా... అంటూ చప్పట్లతో కష్టసుఖాలను తెలియజేసే జానపద పాటలు పాడుతారు. బంధాలు , బంధుత్వాలపైనా పాటలు పాడుతారు. పిల్లాపెద్దా కలిసి ఐక్యతా , సోదరభావం , ప్రేమానురాగాలతో జరుపుకుంటారు.

గంగమ్మ మెరిసే.. గౌరమ్మ మురిసే.. చీకటి పడే వరకు మహిళలంతా బతుకమ్మ ఆడుకుంటారు. అనంతరం బతుకమ్మను గంగమ్మ ఒడికి చేరుస్తారు. తర్వాత ఇంటి నుంచి తీసుకొచ్చిన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పించి.. ఒకరికొకరు పంచిపెడతారు. బతుకమ్మ పేర్చిన ఖాళీ షిబ్బి , తాంబాలంతో పాటలు పాడుకుంటూ.. బతుకమ్మను గుర్తు తెచ్చుకుంటూ ఇళ్లకు చేరతారు.

పల్లెల్లో కోలాహలం

ఆడబిడ్డలంతా తమ పుట్టిళ్లకు చేరుకుని తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సంబురాలు చేసుకుంటారు. ఆడపడచుల రాకతో ప్రతి ఇంటా కోలాహలం మొదలైంది. చదువు పేరిట ఇంటికి దూరంగా వెళ్లిన వాళ్లంతా తమ ఊళ్లకు చేరుకున్నారు. బంధువులు , స్నేహితులతో రాష్ట్రంలోని పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి.

    సర్వేజనా సుఖినో భవంతు 

      శుభమస్తు
      1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

        జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

        HAVANIJAAA

        (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

      2. శ్రీ విధాత పీఠం
        Ph. no: 
        9542665536

    1. #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025