బ్రహ్మోత్సవాలు_ఎందుకంటే ?


బ్రహ్మోత్సవాలు_ఎందుకంటే ?

తిరుమల శ్రీవారి వేడుకలను తొలిసారి బ్రహ్మదేవుడు స్వయంగా నిర్వహించాడు కాబట్టి వాటికి బ్రహ్మోత్సవాలని పేరొచ్చింది. అది పురాణ వచనం. ఏటా వర్ష ఋతువులో వస్తాయి కనుక వార్షిక బ్రహ్మోత్సవాలన్నది పెద్దల నిర్వచనం.

  'నానా దిక్కుల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి' అన్నాడందుకే అన్నమయ్య.. ఏడాదికి నాలుగొందల యాభైకి పైగా జరిగే ఉత్సవాలన్నీ ఒక ఎత్తు, వార్షిక బ్రహ్మోత్సవాలు మరో ఎత్తు! తిరుమలకు 'సువ్రతులై' రమ్మన్నాడు అన్నమయ్య- ఎందుకంటే అది విహార యాత్రాస్థలం కాదు. పుణ్యక్షేత్రం కాబట్టి!

పెద్ద పండుగ వస్తోందనగానే ఇల్లంతా బూజులు దులిపి, గడపలకు పసుపులు పులిమి, గుమ్మాలకు పచ్చని మామిడి తోరణాలు కట్టి సంక్రాంతి లక్ష్మిని మంగళకరంగా స్వాగతిస్తున్నామా, లేదా? అలాగే, శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందే మనలోని కల్మషాలు, కాలుష్యాల దుమ్ము దులిపి, ఎదలను భక్తితో తడిపి, గుండెల్లో దైవాన్ని నిలిపి, శ్రీ వేంకటేశ్వర దీక్షను స్వీకరించాలి. పారలౌకిక అనుభవం కోసం ఆర్తితో, ఆర్ద్రతతో ,ఆత్రుతతో అర్రులు చాస్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ని మెప్పించి దర్శించి తరించాలి. అలాంటి నిశ్చయ బుద్ధితో ప్రయాణం కావడమే- 'సువ్రతముల తోడనెవత్తురు కదిలి' వాక్యానికి వ్యాఖ్యానం!

అలా దీక్షితులై కొండకు చేరుకునే వారి మనసు కొండంత పారవశ్యానికి లోనవుతుంది. అణువణువూ బ్రహ్మమయంగా తోస్తుంది. ప్రతి శిలా సాలగ్రామంలా కనపడుతుంది. అక్కడున్న ప్రతి అంశాన్నీ ఇన్నేళ్లుగా- అక్కడ ఉన్నది ఉన్నట్లుగా కాకుండా, మనం అనుకున్నట్లుగా మాత్రమే చూశామన్న సత్యం బోధపడుతుంది. పశ్చాత్తాపంతో గుండె మూల్గుతుంది. అవి సాదాసీదా పర్వతాలు కావని, సాక్షాత్తు వేదరాశులనీ, అందుకే అన్నమయ్య 'వేదములే శిలలై వెలసినదీ కొండ' అంటూ సవరించాడనీ అర్థమవుతుంది. 'వేదాల పేరుతో శబ్ద బ్రహ్మ రూపంగా లోకాన్ని అలరించేదంతా పరమాత్మ చైతన్యమేనంటూ తంత్ర వార్తికంలో కుమారిల భట్టు చేసిన సూచన గోవింద నామస్మరణలో ప్రతిధ్వనిస్తుంది. మన చైతన్యాలను మారుస్తుంది. రాజగోపుర ప్రవేశానికి అర్హత లభిస్తుంది. ఆ పెద్ద గడప వద్ద పారే నీరు మన కాళ్లకే కాదు, జన్మజన్మల దోషాలను కడిగేసిందని, మనల్ని ధన్యులను చేసిందని తెలుస్తుంది.

లోపలికి ప్రవేశించగానే ఇంకేముంది! ఏ అనుభూతి వైభవం అన్నమయ్య అంతరంగాన్ని ఆక్రమించి- పదమై ప్రసరించిందో.. గానమై ప్రవహించిందో.. గగనమై ప్రతిధ్వనించిందో, అదే అనుభూతి- సాలగ్రామ శిలామూర్తి రూపంలో ప్రత్యక్షమై సాక్షాత్కార దివ్యానుభవం అవుతుంది. అన్ని నేనులూ తానైన నేనులో నేనూ లీనమయ్యాననే పులకింత క్షణికమై.. శాశ్వతమై.. మనలోని మంత్ర కవాటాలను తెరుస్తుంది. దేహం మరణిస్తే- నిర్యాణమని, 'నేను' నశిస్తే నిర్వాణమని తెలిసొచ్చి అంతులేని ఆనందం ఉబికి వస్తుంది. 'నిర్వాణ సోపానమధిరోహణము చేయు' దారి తోస్తుంది. బ్రహ్మానందాన్ని రుచి చూపించేందుకే బ్రహ్మదేవుడు బ్రహ్మోత్సవాలకు భూలోకంలో శ్రీకారం చుట్టాడనిపిస్తుంది. ఈ యాత్ర పూర్తవుతుంది. ఆ యాత్ర మొదలవుతుంది.

    సర్వేజనా సుఖినో భవంతు 

      శుభమస్తు
      1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

        జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

        HAVANIJAAA

        (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

      2. శ్రీ విధాత పీఠం
        Ph. no: 
        9542665536

    1. #brahmosthavaluendukante #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025