సమయపాలన
లక్ష్యసాధనకు ఎందరో ఎన్నో మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు. వారిలో కొందరే విజయతీరానికి చేరగలుగుతారు.
సఫలీకృతులైన వారందరిలో ఒక సమాన లక్షణాన్ని గమనించవచ్చు. అదేమిటంటే- ‘సమయపాలన!’ 'ముందుగా అనుకున్న 'సమయం' లోపల పనిని పూర్తిచెయ్యడం!
నిజానికి ఇది మనం అనుకున్నంత సులభం కాదు. పనిపై శ్రద్ధ ఉన్నవాళ్ల తీరు వేరుగా ఉంటుంది. రైతు తొలకరి జల్లులకోసం ముందుగానే పొలాన్ని సిద్ధం చేస్తాడు. ఏ కార్తెలో ఏ పంట వేయాలో ముందుగానే ఒక ప్రణాళిక వేసుకుంటాడు.
ఉపాధ్యాయుడు ఆ సంవత్సరం పాఠ్యప్రణాళిక ముందుగానే సంసిద్ధం చేయవలసి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా చదివిన విద్యార్థి సత్ఫలితాన్ని సాధిస్తాడు.
ఈ పంక్చువాలిటీ భారతీయులకు అసలు తెలియదని,
చాలామంది ఆంగ్లేయుల పుణ్యమా అని మనం ఈ సుగుణాన్ని అలవరచుకున్నామని భ్రాంతి పడుతుంటారు.
నిజానికి రామాయణ, భారతాల సందేశ సమూహంలో సమయపాలన ఒకటి! శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు, భరతుడు అన్నగారిని తిరిగి రమ్మని ప్రార్ధించగా, పదునాలుగేళ్లు పూర్తయ్యే సమయానికి వస్తానని రాముడు మాట ఇస్తాడు. రాముడి సన్నిధి నుంచి తిరిగి వెళ్ళే టప్పుడు భరతుడు ఇలా అన్నాడు... నేను పదునాలుగు సంవత్సరాలు
నార చీరలు ధరించి, కందమూలాలు తింటూ నీ నామస్మరణతో గడుపు తాను. పదునాలుగో సంవత్సరం పూర్తికాగానే... నువ్వు తిరిగి రాకపోతే నేను అగ్నిప్రవేశం చేస్తాను.
పదునాలుగేండ్లు గడిచాయి. శ్రీరాముడు తిరిగి రావలసిన సమయం ఆసన్నమైంది. సర్పాన్ని పట్టుకోవడానికి ఎగిరే గరుత్మంతుడిలా హనుమంతుడు వేగంగా వచ్చి రాములవారి రాకను భరతుడికి చెప్పాడు.
వరసగా పరిశీలిస్తే హనుమంతుడు చేసిన ప్రతి పనీ సకాలంలో చేసినట్లు స్పష్టం అవుతుంది.
యుద్ధంలో రావణుడు ప్రయోగించిన బాణం వల్ల రామలక్ష్మణులు మూర్ఛితులయ్యారు. రాముడు 'ఆదిత్య హృదయం' మంత్రమహిమ వల్ల స్పృహలోకి రాగలిగాడు. లక్ష్మణుడు మాత్రం మృత్యుముఖంలో ఉన్నాడు.
తెల్లవారేలోపల సంజీవని మూలికను తేగలిగితే లక్ష్మణుడు బతుకుతాడు!' అని సుషేణుడు చెప్పగా హనుమంతుడు అందుకు సిద్ధపడ్డాడు. ఆకాశమార్గాన ఎగిరిపోయి సంజీవని మొక్క ఉండే తావుకు చేరుకున్నాడు. కానీ అక్కడే చిక్కు ప్రశ్న ఎదురైంది. ఆ మొక్కల్లో సంజీవని ఏది? కనుక్కోవడం కష్టమైన సమస్య... అమాంతం ఆ మొక్క ఉన్న పర్వతాన్నే ఎత్తిపట్టి రాముడి ఎదుట సూర్యోదయం లోపల వచ్చి నిలిచాడు. లక్ష్మణుడి ప్రాణాలు నిలిపాడు. శ్రీరాముడు
పావనిని గుండెలకు హత్తుకున్నాడు..
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
సర్వేజనా సుఖినో భవంతు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి