రుద్రుని ప్రతి రూపాలే రుద్రాక్షలు


రుద్రుని ప్రతి రూపాలే రుద్రాక్షలు

* రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము.

* రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి.

* రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి.

* ఎలాంటి కష్టనష్టాలు రావు.

* అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష.

* ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది.

* రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు.

* తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు.

* అనారోగ్య సమస్యలతో జారిపోతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి.

* అంతేకాదు, ఏవైనా వ్యసనాలకు లోనయినవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి, అందులోంచి బయట పడలేకపోతున్నట్లయితే రుద్రాక్షమాలను ధరిస్తే చాలా మంచి ఫలితముంటుంది.

* నొసటన విభూతి, కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేస్తున్న వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది.

*సరస్వతీ నదితో సమానం

* రుద్రాక్షలను సర్వపాపములనూ నశింపచేసే సరస్వతీ నదితో పోల్చారు మునులు.

* మెడ, చేతులు, చెవులకు, రుద్రాక్షలను ధరించినవారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేనివారిగా భాసిస్తారు.

* ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెబుతున్నాయి.

* రుద్రాక్షలపై ఉండే ముఖాల ఆధారంగా రుద్రాక్షలను ఇరవయ్యొక్క రకాలుగా విభజించారు.

* రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి.

పాటించవలసిన నియమాలు

1. రుద్రాక్ష మాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు.

2. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు.

3. కుటుంబసభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్ష మాలను మరొకరు ధరించకూడదు.

4. రుద్రాక్ష మాలను ఉంగరంలో ధరించకూడదు.

5. రుద్రాక్ష మాలను ధరించి నిద్రపోకూడదు.

6. రుద్రాక్ష మాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు.

7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.

ధారణవిధి

* సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభసమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి.

* ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి.

* రుద్రాక్షను ధరించిన వెంటనే ఏదో అద్భుతం జరిగిపోతుంది అని ఎదురుతెన్నులు చూస్తే ఫలితం ఉండదు.

* సత్వర ఫలితాన్ని ఆశించేవారు, రుద్రాక్షల పూర్తి సమాచారాన్ని సేకరించి, సిసలైన పద్ధతి ప్రకారం, గురువు సమక్షంలో ధరించి, సాధన చేయాలి.

*ధరించవలసిన తిథులు

* పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం మహాశ్రేష్టం.

* రుద్రాక్షలను ధరిస్తే సర్వదుఃఖాలు తొలగిపోతాయి.

* సకల సంపదలూ ఒనగూడుతాయని స్కాంద పురాణం చెబుతోంది.

* జావా, సమత్రా, ఇండోనే షియా, నేపాల్‌ మొదలైన చోట్ల, ఇండియాలో చాలా కొద్ది ప్రదేశాల్లో రుద్రాక్ష చెట్లు పెరుగుతాయి.

ఓం నమో భగవతే రుద్రాయ!

    సర్వేజనా సుఖినో భవంతు 

      శుభమస్తు
      1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

        జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య

        HAVANIJAAA

        (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.

      2. శ్రీ విధాత పీఠం
        Ph. no: 
        9542665536

    1. #rudraksha #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025